శ్రీకాకుళం జిల్లాను తుపాను బాధిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 3వ నంబరు జీవోను జారీ చేసింది.
తుఫాన్ బాధిత జిల్లాగా గుర్తింపు
Published Fri, Jan 24 2014 3:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శ్రీకాకుళం జిల్లాను తుపాను బాధిత జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 3వ నంబరు జీవోను జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో వచ్చిన వరుస విపత్తులు, పైలీన్ తుఫాన్ అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 801 మండలాలు తీవ్రంగా నష్టపోయాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జాబితాలో జిల్లాలోని 38 మండలాలూ ఉన్నాయి. 2013 అక్టోబర్ 8 నుంచి 27వ తేదీ వరకు తొలుత పైలీన్ తుఫాన్, అనంతరం భారీ వర్షాలు కురియటంతో జిల్లాలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సుమారు రూ.వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు జిల్లా యంత్రాంగం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం తుపాను బాధిత జిల్లాగా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Advertisement
Advertisement