
తుపాను బాధితులకు రూ.50 లక్షల విరాళం
పీఎన్‌కాలనీ : రవీం ద్రభారతీ విద్యాసంస్థల చైర్మన్ ఎం.ఎస్.మణి హుదూద్ తుపాను ఆదుకునేం దుకు విరాళంగా రూ. 50 లక్షల చెక్కును శనివారం సీఎం చంద్రబాబును క్యాం ప్ కార్యాలయంలో కలిసి అందజేశారు. హూదుద్ వల్ల విశాఖపట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రకృతి ప్రకోపానికి గురైన బాధితులను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించినట్టు ఆయన ఆదివారం తెలిపారు.