
నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించిన విజయమ్మ
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ, నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తున్నారు. రాజుపురం గ్రామంలో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు విజయమ్మ కంచిలి, జాడుపూడి, పెద్దకొజ్జీరియాలలో పర్యటించారు. తుపాను ప్రభావంతో జాడుపూడిలో ధ్వంసమైన జీడిమామిడి తోటలను పరిశీలించారు. తుపాను బాధితులను పరామర్శించిన సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.