coconut trees
-
చెట్టంత చేయూత
సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది. ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది. అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇలా.. కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది. దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది. తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది. -
Goa: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం!
గోవాలో లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. కాని కొబ్బరి కల్లు గీసే కార్మికులు 200 మించి లేరు. ఇతర దేశీయ మత్తు పానీయాలను తయారు చేసుకునే గోవా ప్రజలు కొబ్బరి కల్లును ఇప్పుడు లాభసాటిగా చూస్తున్నారు. అందుకు కారణం శ్వేత. 24 ఏళ్ల ఈ అమ్మాయి గోవాలో ఏకైక కొబ్బరి కల్లు గీత కార్మికురాలు. ఒక కొబ్బరి ఫామ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ కొబ్బరి కల్లు గీస్తూ ఆదాయ మార్గాలు సృష్టించి వార్తల్లోకి ఎక్కింది. శ్వేతా గోయంకర్ ఇప్పుడు గోవా కల్లు ఉత్పత్తిని ప్రభావితం చేసి కొన్ని వందల జీవితాల్లో ఉపాధి తేనుంది. ఇంత వరకూ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన ఒక ప్రధాన ఆదాయ వనరు శ్వేతా వల్ల మబ్బు తొలిగి వెలుతురులోకి వచ్చింది. అంతా రాసి పెట్టినట్టు జరిగింది అంటామే అలాగే జరిగింది. బీటెక్ బదులుగా వ్యవసాయ కోర్సు శ్వేతా గోయంకర్ బీటెక్ చేద్దామనుకుని కోచింగ్ మొదలెట్టింది. కాని ఎందుకో ఆమెకు బి.ఏ అగ్రికల్చర్ కోర్సు చేయాలనిపించింది. సాధారణంగా గోవాలో ఈ కోర్సు చేసేవాళ్లు తక్కువ. కోర్సు పూర్తయ్యాక శ్వేతా బెంగళూరులో ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ టిష్యూ కల్చర్ గురించి పరిశోధన. ఒక సీడ్ నుంచి వేలాది సీడ్లను ఎలా ఉద్భవించేలా చేయవచ్చో శ్వేతా పరిశోధన చేస్తుంటే హటాత్తుగా లాక్డౌన్ వచ్చి ఉద్యోగం పోయింది. శ్వేత గోవాకు తిరిగి వచ్చి ఒక కొబ్బరితోటలో మేనేజర్ ఉద్యోగానికి కుదిరింది. సరదా ప్రయత్నం లాక్ డౌన్ కాలంలో తోట వ్యవహారాలు చూస్తున్న శ్వేతకు ఒకరోజు కొబ్బరి చెట్టు ఎక్కాలనిపించింది. ఎక్కింది. భయం వేయలేదు. చిటారుకు వెళ్లాక ఆమెకు కొబ్బరి కల్లు తీయడం గుర్తుకొచ్చింది. చదువులో భాగంగా ఆ పని తెలిసిన శ్వేత మరుసటి రోజు కొబ్బరి కల్లు గీత మొదలెట్టింది. తను పని చేస్తున్న తోటలో కల్లు గీయడం ప్రారంభించే సరికి చుట్టుపక్కల వారికి తెలిసి చూడటానికి రావడం మొదలెట్టారు. తాటి కల్లు, ఈత కల్లులాగే కొబ్బరి కల్లు కూడా దేశీయ పానీయం. అందుబాటులో లేక గాని తాగే వారి సంఖ్య తక్కువేం కాదు గోవాలో. ఇప్పుడు శ్వేత వల్ల కొబ్బరి కల్లు పట్ల కుతూహలం మొదలయ్యింది. 200 మంది మాత్రమే గోవాలో కొబ్బరి చెట్లు లక్షల్లో ఉంటే కొబ్బరి కల్లు గీసే కార్మికుల సంఖ్య కేవలం 200 ఉంది. ప్రభుత్వం, ఉద్యానవన శాఖలు ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాయి. కారణం చెట్టెక్కడంలో ఉన్న రిస్కు, ఆదాయం అంతంత మాత్రమే ఉండటం. ‘కాని కొబ్బరి కల్లు మీద సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక్కో మనిషి మూడున్నర లక్షల ఆదాయం గడించవచ్చు’ అని శ్వేత అందరికీ తెలియచేసింది. కేరళ నుంచి తెప్పించిన పరికరంతో సులభంగా చెట్టు ఎక్కి కాయను దించడమే కాదు, కల్లు ఎలా గీయవచ్చో శ్వేత ట్రైనింగ్ ఇస్తోంది. ఇటీవలే 60 మంది కొబ్బరి రైతులకు ఆమె కల్లు గీయడం నేర్పించింది. ఈ విషయమై అందరూ శ్వేతను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. కల్లు గీస్తున్న ఏకైక గోవా అమ్మాయి శ్వేత. ఈ సంఖ్య పెరగాలని అందరూ ఈ ఉపాధిని పొందాలని కోరుకుంటోంది శ్వేత. చదవండి: Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్.. -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్‌ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. -
చూసొద్దాం తాటివనం
చాదర్‌ఘాట్: నగరంలో తాటి చెట్టును చూడగలమా..! అంటే మాత్రం కాంక్రీట్ జంగిల్లో అదెలా సాధ్యం అంటారు ఎవరైనా. కానీ ఓల్డ్ మలక్‌పేట్‌లో మాత్రం ఒక్క తాటి చెట్టే కాదు.. ఆ జాతి మొక్కలతో ఓ అద్భుతమైన వనమే ఉంది. పచ్చని వాతావరణంలో ఆ వనంలో సేదతీరేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. నిటారుగా పెరిగిన ఆ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్నట్టున్నాయి. గజిబిజి గందరగోళంగా ఉండే నగరంలో పచ్చదనం విస్తరించిన ఓ పల్లె వాతావరణం సందర్శకులను పరవశింపచేస్తుంది. ఓల్డ్ మలక్‌పేటలోని ఈసేవా కార్యాలయం వెనుక వైపు తీర్చిదిద్దిన ఈ తాటివనంలో 103 దేశాలకు చెందిన తాళజాతి మొక్కలు పెంచుతున్నారు. సౌత్ ఈస్ట్ ఆసియాకు చెందిన టారాఫామ్ ఈత చెట్టు, నార్త్ ఆఫ్రికాకు చెందిన పోకచెట్లు ఈ పార్కులో ఆకర్షణ. జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ వనం స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల మదినిండా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపుతోంది. ఇక్కడ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బర్ముడా, నార్త్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా, బ్రెజిల్, క్యూబా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ తదితర దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఈ వనంలో ఉన్నాయి. గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే వాకర్స్‌ను పలుకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ పార్కులో ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు విహరించవచ్చు. -
తెల్లదోమను తట్టుకున్న కొబ్బరి తోట
కోనసీమ పొత్తిళ్లలో పంటలను రూగోస్ తెల్లదోమ చావు దెబ్బ తీస్తోంది. అమెరికా నుంచి కేరళ, తమిళనాడు మీదుగా మన రాష్ట్రంలోకి వచ్చిన ఈ కొత్తరకం తెల్లదోమ పూర్తి పేరు వలయాకారపు తెల్లదోమ లేదా సర్పిలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరలింగ్ వైట్ఫ్లై). గత ఏడాది నుంచి కొబ్బరి రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల కొబ్బరి తోటలు దీని బారిన పడి విలవిల్లాడుతున్నాయి. గాలి ద్వారా, అంటు మొక్కల ద్వారా వ్యాపించే ఈ తెల్లదోమ అంతటితో ఆగలేదు. ఆయిల్ పామ్, అరటి, మామిడి, కరివేపాకు, జామ తోటలనూ చుట్టేస్తోంది. రామాఫలం, పనస మొక్కలను, కడియం నర్సరీల్లో పూల మొక్కలను సైతం ఆశిస్తోంది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నా అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రసాయనిక పురుగుమందులు వాడితే ఫలితం ఉండకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తోటల్లో బదనికలు వదలడం ద్వారా జీవనియంత్రణ పద్ధతులను అవలంబించడమే మార్గమని సూచిస్తున్నారు. అయితే, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు అనుభవం భిన్నంగా ఉంది. తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న రసాయనిక సేద్యం జరుగుతున్న తోటలన్నీ తెల్లదోమతో 100% దెబ్బతింటే.. తన చెట్లకు 10%కి మించి నష్టం జరగలేదని పచ్చగా అలరారుతున్నాయని ఆయన తెలిపారు. ఇంతకీ ఆయన విజయరహస్యం ఏమిటి? ఆ వివరాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్, అగ్నిహోత్రంతో కూడిన ప్రకృతి సేద్యమే తన తోట పచ్చగా నిలబడటానికి కారణమని తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు సగర్వంగా చెబుతున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి 20 కిలోమీటర్ల దూరంలో గల తన గురుకృప గ్రీన్ ఫామ్‌లో మూడు, నాలుగేళ్లుగా ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు అనుబంధంగా ఉన్న వ్యవసాయ విభాగం నిపుణులు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో రైతులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. ఆమె అందించిన సమాచారం ప్రకారం.. అరుసు కొబ్బరి తోట పరిసరాల్లోని ఇతర కొబ్బరి తోటలను రూగోస్ తెల్లదోమ తీవ్రంగా దెబ్బతీసింది. మంగు కారణంగా ఆకులు నల్లగా మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెల్లదోమ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే కొందరు రైతులు కొబ్బరి చెట్లు కొట్టేసి వరి సాగు ప్రారంభించారు. అయితే, పక్కనే ఉన్న అరుసుకు చెందిన కొబ్బరి తోట మాత్రం పచ్చగా అలరారుతోంది. ఈ తోటకు కూడా రూగోస్ తెల్లదోమ సోకింది. అయితే, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నందున నష్టం 10 శాతానికే పరిమితమైందని ఉమమహేశ్వరి తెలిపారు. అరుసు అనుసరిస్తున్న సాగు పద్ధతి అరుసు కొబ్బరి చెట్లకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం లేదు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. కొబ్బరి చెట్ల మొదళ్లకు చుట్టూ ఎండు ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. చెట్ల మొదళ్లకు దూరంగా చుట్టూ గాడి తీసి నీటితో పాటు 15 రోజులకోసారి జీవామృతం ఇస్తున్నారు. పండ్లు, కూరగాయ తొక్కలను మురగబెట్టి తయారు చేసుకున్న గార్బేజ్ ఎంజైమ్‌ను లీటరుకు 100 లీటర్ల నీరు కలిపి వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. ఆవు పేడ పిడకలతో రోజూ అగ్నిహోత్రం నిర్వహిస్తున్నారు. తద్వారా హానికారక వాయువులు తోట దరి చేరకుండా ఉంటాయని ఉమామహేశ్వరి(90004 08907) తెలిపారు.] జీవామృతం, గార్బేజ్ ఎంజైమే కాపాడుతున్నాయి ప్రకృతి వ్యవసాయంలో బెంగళూరు తదితర చోట్ల శిక్షణ పొందాను. కొబ్బరి, అరటి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మూడు, నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాను. మా ప్రాంతంలో తెల్లదోమ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను మాత్రం జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌ను మాత్రమే వాడుతున్నాను. మా పొరుగు తోటల్లో తెల్లదోమ తీవ్రత 100% ఉంటే నా తోటలో కేవలం 10%కి పరిమితమైంది. మా కొబ్బరి చెట్లు చాలా ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తుండటం చూసి ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యపోతున్నారు. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌లే నా తోటను రక్షిస్తున్నాయని నేను భావిస్తున్నాను. తెల్లదోమ ఆశించినప్పటికీ తీవ్రత పది శాతానికి మించి లేదు. చెట్లు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మా కొబ్బరి చెట్ల ఆకులు ఎండాకాలంలో కూడా రాలిపోవు. ప్రకృతి వ్యవసాయం వల్ల కాయల బరువు కూడా 350 గ్రాముల నుంచి 500 గ్రాములకు పెరిగింది. అరుసు (97509 29185) (తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), కొబ్బరి రైతు, పొలాచ్చి,కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు ఇన్పుట్స్: ఎన్. సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం జీవ నియంత్రణే మేలు ►మిత్రపురుగులు ►బదనికలు ►గంజి ద్రావణం ►ఫంగస్ ►కొబ్బరి, ఆయిల్‌పామ్, అరటి పంటలలో, ఈ దోమ ఆశించిన తోటల్లో పసుపురంగు జిగురు అట్టలను కట్టాలి. పసుపురంగుకు ఆకర్షించే ఈ పురుగు అట్టలకు అంటుకుని చనిపోతోంది. అట్టలు ఏర్పాటు చేయడం వల్ల పురుగు ఉంటే దాని ఆచూకీని కనిపెట్టే అవకాశముంది. ►పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లార్వా (పిల్ల), ప్యూపా (నిద్రావస్థ) దశలకు సంబంధించి ఎన్కార్సియా గ్వడలోపే జాతి బదనికలు తోటల్లో వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రాంతం నుంచి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మిత్రపురుగులను తీసుకు వచ్చి దోమ ఉన్న తోటల్లో వదులుతున్నారు. ►తెల్లదోమ వల్ల వచ్చే మసిమంగు నివారణకు ఒక శాతం గంజి ద్రావణాన్ని మసి ఆశించిన మొక్కలపై భాగాలపై పిచికారీ చేయాలి. లేదా ఉధృతంగా మంచినీటిని ఆకుల మీద పడేలా చేయాలి. ఇలా చేస్తే నల్లని మసిమంగు వదిలిపోతుంది. ►వేప నూనెను ప్రతీ పదిహేను రోజులకు మొక్క ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంది. ఒక్క శాతం వేప నూనెకు పది గ్రాముల డిటర్జెంట్ పౌడరు కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. ►వేప నూనెకు ప్రత్యామ్నాయంగా అంబాజీపేట ఉద్యాన పరిశో«ధనా స్థానం ఐసోరియా ఫ్యూమోసోరోసే ఫంగస్‌ను ఆకుపై పిచికారీ చేయాలి. ఈ ఫంగస్‌ను తయారు చేసుకోవడం ఎలాగో రైతులకే నేర్పిస్తున్నాం. ►కొత్తగా డైకోక్రై సా ఆస్టర్ మిత్రపురుగులను తోటల్లో విడుదల చేయాల్సి ఉంది. తెల్లదోమ గుడ్డు, పిల్ల పురుగు దశలో తెల్లదోమను ఈ మిత్రపురుగు తింటుంది. ►దోమ ఆశించిన తోటలు, నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకోకూడదు. డా. ఎన్.బి.వి.చలపతిరావు (98497 69231), ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం), కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా -
బతుకు పంట!
ఆ రైతు వయసు 73 ఏళ్లు... చేసేది ముప్పాతిక ఎకరం (75 సెంట్లు)లో వ్యవసాయం. ఏడాదికి ఆదాయం అక్షరాలా రూ.1.50 లక్షలపైనే. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ, పాలేకర్ సూచించిన, అయిదు అంతస్తుల సేద్య విధానానికి రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఆ వ్యవసాయ క్షేత్రం కొబ్బరి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలచెట్లతో అడవిని తలపిస్తుంటుంది. నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదన తో అటు ఆరోగ్యం, ఇటు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రోజువారీ పండ్లు, కూరగాయలు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయటమే కాదు, ఆ వయసులోనూ కొబ్బరి చెట్లను అవలీలగా ఎక్కుతూ, గెలలను దింపుతూ, స్వయంగా బజారులో అమ్ముకుంటూ తానే ఒక సైన్యంలా శ్రమిస్తున్నాడు. ఫలితంగానే నిత్య ఫలసాయం, ప్రతిరోజూ సంపాదనతో అటు ఆనందం, ఇటు ఆరోగ్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటుతున్నాడు. ఎందరో రైతులకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆ నిత్య కృషీవలుడు నామని రోశయ్య ఆదర్శ జీవన సేద్యంపై ‘సాగుబడి’ కథనం.. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం అత్తోట.. రోశయ్య స్వస్థలం. ఊరివెలుపల మాగాణి పొలాల్లో గుబురుచెట్లతో అడవిలా కనిపించేదే ఆయన వ్యవసాయక్షేత్రం. చుట్టూ వరి పండించే మాగాణి భూముల మధ్య ఇదొక్కటే మెట్ట చేను. వాస్తవానికి ఒకప్పుడది మాగాణి భూమే. సేద్యాని కనుగుణంగా మెట్టగా మార్చుకున్నారు రోశయ్య. పెద్దల్నుంచి సంక్రమించిన ఆ భూమికి చుట్టూ గట్లపై కొబ్బరి చెట్లు నాటారాయన. వాటిపై వచ్చే ఆదాయంతో ఏటా 10 సెంట్ల చొప్పున మెరక చేసుకుంటూ ఏడెనిమిదేళ్లలో మొత్తం భూమిని మెట్టగా మార్చేసుకుంటూ ఏటా కొన్ని కొబ్బరి చెట్లు నాటుతూ వచ్చారు. వాటితోపాటు వివిధ రకాల పండ్ల చెట్లు, కూరగాయలు, దుంప పంటలు, పూలచెట్లతో సహా 23 రకాల మొక్కలు/ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు ప్రస్తుతం రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరిచెట్లు–70, నిమ్మచెట్లు–60, జామచెట్లు–8, సీతాఫలం–20, బత్తాయి–4, నారింజ–1, అరటి– 25, దానిమ్మ–2, ఉసిరి–2, నేరేడు–4, మామిడి–4తో సహా సపోటా, బొప్పాయి, మునగ చెట్లతోపాటు 3 నుంచి 5 సెంట్ల విస్తీర్ణం చొప్పున కంద, బెండ, వంగ వంటి కూరగాయల తోటలున్నాయి. ఒక వరుసలో పసుపు విత్తారు. 10 సెంట్లలో పశువుల మేత పెరుగుతోంది. వావిలి, వేప, నల్లేరు, తులసి, ఆముదం, కుంకుడు, రబ్బరు, ఉమ్మెత్త వంటి ఔషధ మొక్కలు, కొన్నిరకాల పూలమొక్కలు ఉన్నాయి. అంతర పంటల సాగులో రోశయ్య మేటి అనిపించుకుంటున్నారు. మినుము, పెసర, పసుపు, కంద పంటలను మూడునాలుగేళ్ల కాలవ్యవధిలో సాగుచేస్తూ వచ్చారు. మినుము పంట చేతికొచ్చాక, బంతి పూల సాగుకెళతారు. ఆ పంట తర్వాత మళ్లీ అపరాలు, మరోసారి పసుపు సేద్యం, ఇంకోసారి మొక్కజొన్న...ఇలా పంటల వైవిధ్యం పాటిస్తూ ఏడాదిలో 365 రోజులు పంట చేతికొచ్చేలా రూపొందించుకొనే ప్రణాళిక లాభసాటి వ్యాపారి వ్యవహారంలా అనిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం వేసిన నిమ్మతోట ఇప్పుడు బ్రహ్మాండంగా కాపునిస్తోంది. కొబ్బరి చెట్లు ఎత్తు తక్కువ ఉన్నపుడు అరటి ఎక్కువగా సాగుచేశారు. గతేడాది వరకు 20 సెంట్లలో పండించిన పసుపుకు మార్కెట్ ధర ఆశాజనకంగా లేదని ఈ సంవత్సరం విరమించుకున్నారు. ఆ విస్తీర్ణంలో అలోనేరేడు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు రూ.500 కనీస ఆదాయం.. రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లకు 28 ఏళ్ల వయసు. రోజుకు ఒక్కో చెట్టు నుంచి మూడేసి గెలలను దింపుతారు. కొబ్బరి బోండాలను సైకిలుకు కట్టుకుని, అత్తోట గ్రామ సెంటరులో విక్రయిస్తారు. కొబ్బరి బోండాలను విడిగా, సీసాల్లోనూ కోరినవిధంగా ఇస్తారు. అత్తోట, దగ్గర్లోని గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొబ్బరి నీళ్లు అవసరమైన వారు నిశ్చయంగా రోశయ్య ఇంటి తలుపుతడతారు. నిమ్మ చెట్లు కాపునిస్తున్నాయి. కొబ్బరి బోండాలతో రూ.400, నిమ్మకాయలతో రూ.100 చొప్పున రోజుకు రూ.500 ఆదాయాన్ని కళ్లచూస్తున్నట్టు రోశయ్య ఒకింత గర్వంగా చెప్పారు. ఏడాదిలో కనీసం 10 నెలలపాటు ఈ రెండింటిపైనే రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఇతర పండ్లు, కూరగాయలను సొంతానికి వినియోగించుకుంటూ మిగిలినవి మార్కెట్ చేస్తుంటారు రోశయ్య, ఆవిధంగా తన రెక్కల కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతున్నట్టు చెప్పారు. 5 సెంట్ల స్థలంలో వేసిన గజేంద్ర రకం కంద గతేడాది 400 కిలోల దిగుబyì నీ, రూ.6000 ఆదాయాన్నిచ్చింది. 20 సెంట్ల స్థలంలో పసుపు సాగుతో 300 కిలోల ఎండు పసుపు కొమ్ములు వచ్చాయి. దీనితో క్వింటాలు రూ.6,000 చొప్పున రూ.18 వేలకు అమ్మగలిగారు. ఉసిరికాయలపై ఏటా రూ.1,500 వస్తాయి. పచ్చిగడ్డిని ఆవుకు మేతగా వినియోగిస్తున్నారు. చక చకా కొబ్బరి చెట్లు ఎక్కేస్తున్నారు... కొబ్బరి చెట్టు ఎక్కడం అంత సులువు కాదని తెలిసిందే. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు దింపేవారు లేక చాలామంది వాటిని చెట్లకే వదిలేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో వున్నా, కూలీ ఖర్చు ఎక్కువ అడుగుతారు. రోశయ్యకు ఈ ఇబ్బందులేం లేవు సుమా! 73 ఏళ్ల వయసులో కొబ్బరి చెట్టును ఇట్టే ఎక్కేస్తున్నారు. మోకాళ్ల నొప్పి వస్తుందనే భావనతో ఇటీవలే చిన్న నిచ్చెన తెచ్చుకున్నారు. నిచ్చెనతో సగం దూరం వెళ్లాక, అక్కడ్నుంచి కాళ్లకు బంధం తాడు, మొలలో కొడవలి, నోట్లో మోకుతో చెట్టు మొదల్లోకి సునాయాసంగా వెళతారు. ఒక్కో గెలను నరికి, మోకుకు తగిలించి, కిందకు జారవిడుస్తాడు. తర్వాత మరో గెల...మొత్తం పది, పదిహేను నిముషాల్లో కొబ్బరి గెలల దింపుడు పూర్తిచేసి దిగొచ్చాడు. పాలేకర్ సూచనలతో సేంద్రియంలోకి.. అనుకోకుండా 2008లో ఒకరోజు పాలేకర్ సమావేశాలకు హాజరైన రోశయ్య, అప్పట్నుంచి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ప్రకతి వ్యవసాయానికి కీలకమైన ఆవును కొనుగోలు చేశారు. మూడేళ్ల తర్వాత దూడలతో సహా వేరొకరికి లాభానికి విక్రయించారు. మళ్లీ ఒంగోలు జాతి ఆవును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ‘నంది’ని పోలిన రెండు ఆవులను పోషిస్తున్నారు. ఆవు వ్యర్థాలను సేకరించుకొని వాటితో జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నామాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, ఇంగువ ద్రావణం వంటి కషాయాలను సొంతం తయారుచేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, తరచూ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ రోశయ్య తగిన సలహాలనిస్తున్నారు. ఐదు అంతస్తుల వ్యవసాయ క్షేత్రం.. పాలేకర్ సూచించిన అయిదు అంతస్తుల సేద్యం లక్ష్యంగా వ్యవసాయం చేస్తున్నట్టు రోశయ్య చెప్పారు. భూమిలోపల దుంప పంటలు, పైన ఎత్తు తక్కువలో కూరగాయలు, తర్వాత నిమ్మ, బొప్పాయి వంటి పంటలు, ఆపైన మామిడి, మునగ వంటివి, చివరగా కొబ్బరి చెట్లతో తన వ్యవసాయక్షేత్రాన్ని ఆ విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. చుట్టూ సరిహద్దులో, మరో వరుసలో కొబ్బరి చెట్లు ఉంటే, మధ్యలో ఒకవైపు కూరగాయలు, దుంప పంటలు, కూరగాయలు పెంచుతున్నారు. మరోవైపు పశుగ్రాసాన్ని సాగుచేస్తున్నారు. మధ్యలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెరుగుతూ ఫలాలను అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ ఎన్‌పీఎం దుకాణాన్ని రోశయ్యకు మంజూరు చేశారు. వివిధ రకాల కషాయాలను తయారుచేసి రైతులకు అందించటం రోశయ్య విధి. ప్రస్తుతం ఇది ప్రారంభంలోనే ఉంది. లీటరుకు రూ.2 మిగులుతున్నట్టు చెప్పారు. ‘ఇద్దరు పిల్లలూ సెటిలయ్యారు.. నాకూ ఆ ఇంటామెకు ఈ 75 సెంట్ల క్షేత్రం ఉంచుకున్నాం. ఆరోగ్యకరమైన çపండ్లు, కూరగాయలు పండిస్తున్నాం. మేము తింటూ నలుగురికి అందిస్తున్నాం...ఇంతకన్నా కావాల్సిందేముంది’ అంటూ చిరునవ్వు నవ్వారు రోశయ్య. శారీరక శ్రమ గురించి అడిగితే, కష్టపడితేనే కదా! ఫలితం వచ్చేది’ అంటూ ప్రశ్నించి, నేటి తరానికి రోశయ్య (96665 32921) కర్తవ్య నిర్దేశం చేస్తున్నారు!! స్వయంగా చెట్టెక్కికొబ్బరి కాయలు దింపుతున్న 73 ఏళ్ల రైతు రోశయ్య, చెట్లకు నిండుగా నిమ్మకాయలు – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఇదిగో పాము... వచ్చారో జాగ్రత్త
తూర్పుగోదావరి, అమలాపురం: కొబ్బరిచెట్టుపై పాము బొమ్మలు చూశారా? తోటలకు దిష్టి తగలకుండా వేసిన బొమ్మకాదు ఇది. కొబ్బరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసే ఉడతలు. ఎలుకలు దాడి నుంచి కొబ్బరి చెట్టును..దిగుబడిని రక్షించుకునేందుకు రైతులు ఇలా పాము బొమ్మలను గీస్తున్నారు. సాధారణంగా ఎలుకలు, ఉడతలు కొట్టడంతో చెట్టు పలురకాలుగా ధ్వంసమవుతోంది. కొబ్బరి పిందెలను, చిన్నపాటి కాయలను సైతం ఇవి కొట్టేస్తుంటాయి. అలాగే డొలకలు, కొబ్బరి ఆకులు మొత్తాల్లో చేరి మొవ్వును తినేస్తాయి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చెట్టు కూడా దెబ్బతిన చనిపోయే ప్రమాదముంది. రైతులు వీటిని సకాలంలో గుర్తించకుంటే కొబ్బరితోట నాశనమవుతోంది. కొబ్బరితోట ఒక్కటే కాదు.. దాని అంతర పంటగా సాగు చేసే కోకో ఎలుక, ఉడతల దాడివల్ల ఎక్కువగా నష్టపోతోంది. దీంతో పాటు ఇతర అంతర పంటలకు కూడా నష్టం వాటిల్లితోంది. వీటిని నిర్మూలించాలంటే మట్టుబెట్టడం మిన హా మరో మార్గం లేదు. కానీ కొంతమందికి ఉడతను చంపడానికి సెంటిమెంట్ అడ్డువస్తోంది. ఇటువంటి రైతులు వాటిని భయపెట్టేందుకు, చెట్టు ఎక్కకుండా చేసేందుకు ఇలా పాము బొమ్మలను వేస్తున్నారు. ఎలుక నివారణకు ఆల్యూమినియం రేకు మంచిది... ఎలుకలు, ఉడతల నివారణకు పాము బొమ్మలు వేయడం మంచిదే. కానీ ఇది అన్నిసార్లు మంచి ఫలితాన్నివ్వదని అమలాపురానికి చెందిన ఆదర్శ రైతు అబ్బిరెడ్డి రంగబాబు తెలిపారు. కొబ్బరి, కోకో, ఇతర అంతర పంటపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఎలుకల నివారణ ‘సాక్షి’కి ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ♦ ఎలుకలు చాలా తెలివైనవి. ముఖ్యంగా చెట్లు ఎక్కే ఎలుకల జాతి రకాన్ని రేటస్..రేటస్ అంటారు. కొబ్బరి చెట్లపై పాము బొమ్మలుంన్నా ఎలుకలు చెట్టు ఎక్కడం మానవు. పాము బొమ్మలను ఒకటి, రెండుసార్లు చూపి భయపడి చెట్టు ఎక్కకున్నా, తరువాత అవి బొమ్మలని ఎలుకలు పసిగట్టగలవు. చెట్టు ఎక్కి యథావిధిగా ధ్వంసం చేస్తాయి. వీటి నిర్మూలనకు పలు పద్ధతులున్నాయి. ♦ పుస్తకాలకు వేసే అట్టలు (ట్రాన్స్‌ప్లంట్ పేపర్)ని చెట్టుకు చుట్టాలి. కొబ్బరి చెట్టు కాండం గరుకుగా ఉండడం వల్ల ఎలుక ఎక్కేందుకు సలువుగా ఉంటుంది. కాబట్టి అట్ట పుస్తకాలకు వేసే అట్టలాంటి ట్రాన్స్పెంట్ పేపరును చుట్టడం మంచి ఫలితానిస్తోంది. దీనివల్ల ఎలుక, ఉడతలు కాళ్లు జారి కింద పడిపోతాయి. ♦ ఆట్టలకు వేసే పేపరుకన్నా ఉత్తమమైన పద్ధతి అల్యూమినియం రేకులను తొడగడం. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు జారిపడతాయి. ♦ అల్యూమినయం రేకు, ప్లాస్టిక్ రేకుతో గరాటా ఆకారంలో చెట్టు మధ్యలో ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడకు వెళ్లే ఎలుకలు, ఉడతలుపైకి వెళ్లేందుకు అవకాశముండదు. ♦ గ్రీజులో మోనోక్రోటోఫాస్ మందును రాస్తే ఎలుక కాళ్లకు గ్రీజు అంటుకుంటుంది. దీన్ని నోటితో శుభ్రపరుచుకుంటాయి. అప్పుడు విషం నోటిలోకి వెళ్లి ఎలుక చనిపోతోంది. ♦ చెట్టు దిగువ భాగంలో కొబ్బరి డొక్కల మధ్యలో ఎలుకల నివారణ ముందు ఉంచాలి. (ఫెర్మనెంట్ బైట్ స్టేషన్) ఎలుకలు చెట్టుమీదకు దిగినప్పుడు ఈ మందు తిని చనిపోతాయి.) -
బీమా ధీమా ఇచ్చేనా?
-కొబ్బరి చెట్లకూ ఇక బీమా -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -5 జిల్లాల్లో అమలు కానున్న పథకం -జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సేద్యం జంగారెడ్డిగూడెం : వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల ఎక్కువగా కొబ్బరి పంటకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా కొబ్బరి తోటలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొబ్బరి తోటల సాగులో రాష్ట్రం నాలుగోస్థానంలో ఉంది. జాతీయ హార్టీకల్చర్ బోర్డు 2014 లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 121.9 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1258.4 మెట్రిక్ టన్నుల కొబ్బరి ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంట తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాల్లో కొబ్బరి బీమా పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సుమారు 55 వేల ఎకరాల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. బీమా చేసే ప్రక్రియ.. పెనువిపత్తులు లేదా సహజసిద్ధమైన నష్టానికి, అకస్మాత్తుగా కొబ్బరి మొక్కలు చనిపోవడం వంటి వాటికి, రీప్లాంటేషన్ చేసే సమయంలో నష్టాన్ని తగ్గించేలా బీమా సౌకర్యం కల్పించనున్నారు. బీమా పథకంలో నిర్దేశించిన ప్రదేశంలో ఆరోగ్యవంతంగా ఉండే కనీసం 5 మొక్కలు ఉండాలి. అరోగ్యవంతంగా ఉన్న మొక్కలు అన్నింటికీ బీమా చేయించాలి. పాక్షిక బీమా చెల్లుబాటు కాదు. అన్ని రకాలైన కొబ్బరి మొక్కలకు బీమా వర్తిస్తుంది. పొట్టిగా, హైబ్రీడ్ రకాలకు చెందిన చెట్లకు 4 నుంచి 60 సంవత్సరాల వయసు, పొడవుగా ఉండే చెట్ల రకానికి చెందిన 7 నుంచి 60 సంవత్సరాల మొక్కలకు బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వయసుకు సంబంధించి సంబంధిత రైతు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుం ది. తనిఖీ సమయంలో లోపాన్ని గుర్తిస్తే బీమాను నిలుపుదల చేస్తారు. ఏ సందర్భాల్లో బీమా వర్తిస్తుందంటే.. పెను విపత్తులు సంభవించినా, అధిక వర్షాలు, పిడుగులు పడినా, వరదలు, అగ్నిప్రమాదం, చీడపీడలు, కరువు సమయాల్లో కొబ్బరి మొక్కలు చనిపోయినా లేక మొక్కలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఈ బీమా వర్తిస్తుంది. మొక్కలు వెంటనే చనిపోకపోయినప్పటికీ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు లేదా ఉద్యానశాఖ మొక్కలు ఉత్పాదకత కోల్పోయినట్టుగా ధ్రువీకరణ ఇస్తే బీమా చెల్లించడం జరుగుతుంది. అయితే ఉద్దేశ పూర్వకంగా పంట విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, నిర్వహణ లోపం, జంతు, పక్షులు లేదా మనుషుల వల్ల పంట నాశనం అయితే, యుద్ధాలు, పోరాటాలు, కుట్రలు, విద్యుదాఘాతాలు తదితర వాటికి బీమా వర్తించదు. క్లెయిమ్ చేసుకోవడం ఇలా.. బీమా చేసిన కొబ్బరి చెట్లు చనిపోయినా లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయినా ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఘటన జరిగిన 15 రోజులలోపు పూర్తి వివరాలతో తెలియజేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ తనిఖీ చేసేంతవరకు సంబంధిత చెట్లను తొలగించడం గానీ, తరలించడం గానీ చేయరాదు. అలాగే నష్టానికి సంబంధించి సీడీబీ లేదా ఉద్యానశాఖ ధ్రువీకరించాల్సి ఉంటుంది. బీమా ప్రతినిధి తనిఖీ చేసి ధ్రువీకరించిన 30 రోజులలోపు రైతుకు బీమా సొమ్ము అందుతుంది. ప్రీమియం ఇలా.. 4 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.9 ప్రీమియం చెల్లిస్తే రూ.900 బీమా లభిస్తుంది. 16 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న చెట్టుకు సంవత్సరానికి రూ.14 ప్రీమియం చెల్లిస్తే రూ. 1,750 బీమా లభిస్తుంది. చెల్లించే ప్రీమియంలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తుంది. మిగిలిన 25 శాతం రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరించకపోతే రైతు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఒకవేళ రెండు సంవత్సరాలకు ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే 7.5 శాతం, మూడు సంవత్సరాలకు ఒకేసారి చెల్లిస్తే 12.5 శాతం రాయితీ లభిస్తుంది. అయితే గరిష్టంగా మూడు సంవత్సరాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. బీమా చేసిన 30 రోజులలోపు చెట్లు చనిపోతే బీమా వర్తించదు. అయితే క్రమం తప్పకుండా రెన్యువల్ చేసిన చెట్లకు ఈ నిబంధన వర్తించదు. దరఖాస్తు ప్రక్రియ బీమాను నేరుగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ)కి దరఖాస్తు చేసుకోవడం ద్వారా గానీ లేదా అధీకృత ఏజెంట్ల వద్ద గాని, ఉద్యానశాఖ ద్వారా గానీ, సీడీబీచే గుర్తింపు పొందిన కోకోనట్ ఉత్పత్తి, పెంపకందార్ల సొసైటీల ద్వారా గానీ దరకాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుతో పాటు ప్రీమియం డీడీ, భూమి రికార్డు, అందులోని ప్లాంటేషన్ వివరాలను ధ్రువీకరిస్తూ రెవెన్యూ లేదా ఉద్యానశాఖ ఇచ్చిన ధ్రువీకరణపత్రం, ఆరోగ్యవంతమైన చెట్లకే బీమా చేస్తున్నట్టుగా రైతు ఇచ్చే స్వీయ ధ్రువీకరపత్రం, ప్లాంటేషన్‌కు సంబంధించి భూమి సర్వే నంబర్, భూమిలో వేసిన చెట్ల వివరాలతో కూడిన స్కెచ్ జత చేయాల్సి ఉంటుంది. రైతువాటా ప్రీమియం 25 శాతం డీడీ రూపంలో చెల్లించిన 30 రోజుల్లో బీమా ధ్రువీకరణపత్రం రైతుకు అందుతుంది. -
కొబ్బరి చెట్టుతో 'వాలెంటైన్స్ డే'
రాష్ట్రంలో పరిరక్షించాల్సిన వృక్షజాతి జాబితా నుంచి కొబ్బరిచెట్టును గోవా ప్రభుత్వం గత నెలలో తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీని ఈసారి 'కోకోనట్ వాలెంటైన్'గా వినూత్నంగా జరుపుకోవాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోవా ప్రజలు నిర్ణయించారు. పరిరక్షణ చెట్ల జాబితా నుంచి కొబ్బరిచెట్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా జనవరి 14వ తేదీ కావడం గమనార్హం. గోవా వాసులకు కొబ్బరిచెట్లంటే ప్రాణం. వాటిని వారు కల్పవృక్షాలుగా, సాంస్కృతిక సంపదగా పరిగణిస్తారు. అత్యవసరమై ఓ కొబ్బరి చెట్టును కొట్టివేయాలంటే అనుమతి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉన్నా వారెన్నడూ బాధ పడలేదు. ఇప్పుడు ఇష్టానుసారం కొబ్బరిచెట్లను కొట్టివేసేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 'ప్రజల్ సఖార్దాండే ఆఫ్ గోవా హెరిటేజ్ యాక్షన్ గ్రూప్' లాంటి సంస్థల పిలుపు మేరకు ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చెట్ల పట్ల తమకున్న ప్రేమాభిమానాలు చాటాలనుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచే 'కోకోనట్ వాలెంటైన్' ఆందోళన కార్యక్రమం ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీన ముగుస్తుంది. ఈ వారం రోజులు పిల్లలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు కొబ్బరి చెట్ల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ వాటివద్ద ఫొటోలు దిగుతారు. వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కామెంట్లు షేర్ చేసుకుంటారు. -
కొబ్బరి చెట్లకు బీమా అమలు
- ఆరు జిల్లాల్లో అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 2015-16 సంవత్సరానికి కొబ్బరి చెట్ల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెట్ల వయసు ప్రాతిపదికన తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఈ పథకం అమలవుతుంది. బీమా వర్తించాలంటే రైతుకు కనీసం ఐదు చెట్లుండాలి. 75 శాతం రాయితీతో ఈ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెట్టు వయసును బట్టి ప్రీమియం, సమ్ అష్యూర్ చెల్లుంపులు ఉంటాయి. జీవోలోని కొన్ని ముఖ్యాంశాలు.. 4 నుంచి 15 వయసున్న చెట్టుకు ఏడాదికి రు. 9 వందల బీమా, 9 రూపాయల ప్రీమియం 16 నుంచి 60 ఏళ్ల చెట్టుకు రు. 1750 బీమా, 14 రూపాయల ప్రీమియం రైతు చెల్లించాల్సిన ప్రీమియంలో 50 శాతాన్ని కొబ్బరి అభివృద్ధి సంస్థ (సీడీబీ), 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 25 శాతాన్ని సాగుదారులు చెల్లిస్తే సరిపోతుంది. అంటే 4-15 ఏళ్ల వయసున్న చెట్టుకు రైతు రెండు రూపాయల 25 పైసలు, 16-60 ఏళ్ల మధ్య వయసుండే చెట్టుకైతే మూడున్నర రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. రెండేళ్లకు, మూడేళ్లకు కూడా బీమా చేయించుకోవచ్చు. అప్పుడు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మరింత తగ్గుతుంది. ఆసక్తి ఉన్న రైతులు వచ్చే మార్చి 31లోగా తమ డీడీలను పంపాలి ఏఐసీ ఆఫ్ ఇండియా లిమిటెడ్,(అకౌంట్ నెంబర్ 008010200023922) పేరిట హైదరాబాద్‌లో చెల్లుబాటయ్యేలా డీడీతీసి పంపాలి. -
వారికది బతుకు చెట్టు!
ఇక్కడ కొబ్బరిచెట్లు ఎక్కుతున్న మహిళల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎప్పుడూ అనిపించేదే... అక్కడ కూడా మగవారికి పోటీ ఇస్తున్నారని. అయితే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కుతున్న అమ్మాయిలు పోటీల్లో భాగంగా ఎక్కడంలేదు. పొట్టకూటికోసం ఎక్కుతున్నారు. కొబ్బరికాయలు కోసేవారికి ప్రత్యేకంగా కూలీ ఇవ్వడం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ డబ్బులకోసమే కేరళ అమ్మాయిలు కొబ్బరిచెట్లు ఎక్కడం నేర్చుకుంటున్నారు. నలభై మూడేళ్ల లిస్సి తొట్టియిల్ మొదట కొబ్బరిచెట్టు ఎక్కి తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. కొబ్బరిచెట్లనే నమ్ముకుని బతికే కేరళలో అమ్మాయిలు చెట్లు ఎక్కే అవసరం ఎందుకొచ్చిందంటే...‘‘ఏం చేస్తాం. కూటి కోసం కోటి విద్యలంటారు కదా! ప్రతీ పనిలో పోటీ పెరిగిపోయింది. కొబ్బరికాయల దింపు పని ఏడాదంతా ఉంటుంది. ఆ పని చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కొబ్బరిచెట్లు ఎక్కడానికి శిక్షణ తీసుకుని పని మొదలుపెట్టాను. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను’’ అని చెబుతుంది లిస్సి. ఆమె మాటలు అక్కడ చాలామంది అమ్మాయిలకు నచ్చాయి. ఇంకేముంది... శిక్షణ ఇచ్చేవారి చిరునామా కనుక్కుని చెట్లెక్కడం నేర్చుకుంటున్నారు. ఒక్కో కొబ్బరికాయకి ఇన్ని పైసలని ఇస్తారక్కడ. ఆ డబ్బుతో చదువుకోవచ్చు, కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఆలోచనతో చదువుకున్న అమ్మాయిలు కూడా చెట్లెక్కడాన్ని పార్ట్‌టైమ్ జాబ్‌గా ఎంచుకున్నారు. నిరుద్యోగులకు వరం... ఇరవై ఏడేళ్ళ మరియాంబి పరీద్ మాటల్లో చెప్పాలంటే కొబ్బరిచెట్లు ఎక్కే అవకాశం నిరుద్యోగులకు వరంలాంటిది. ‘‘కొబ్బరి చెట్టు ఎక్కి కిందకి చూస్తే అందరికన్నా ఎత్తుకెదిగానన్న ఆ ఫీలింగ్ భలేగా ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం...ఈ పనిలో కూడా మగాళ్లకు తీసిపోలేదన్న భావన. ఫీలింగ్ సంగతి ఎలా ఉన్నా...నాలుగు పైసలు సంపాదించుకోడానికి అవకాశం దొరికింది’’ అని చెప్పిందామె. గత రెండేళ్లలో కేరళలో 600 మంది మహిళలు కొబ్బరిచెట్లు ఎక్కే శిక్షణ తీసుకున్నారు. నిరుద్యోగమే కాక, విభిన్నంగా ఆలోచించి ముందుకెళ్లే మహిళల ఆలోచనలు కూడా కారణం అనుకోవచ్చు. కొబ్బరి చెట్టు ఎక్కడంకోసం కొత్తరకం తాళ్లు వచ్చాయి. అలాగని చెట్టు ఎక్కేయడం సులువేం కాదు. కొత్తలో కళ్లు తిరగడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. చెట్టుపైకి ఎక్కాక కాయలు తీసేటప్పుడు పురుగు పుట్రా వంటివాటి నుంచి తప్పించుకోడానికి కూడా సిద్ధంగా ఉండాలి. -
నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించిన విజయమ్మ
-
నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించిన విజయమ్మ
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ, నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తున్నారు. రాజుపురం గ్రామంలో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు విజయమ్మ కంచిలి, జాడుపూడి, పెద్దకొజ్జీరియాలలో పర్యటించారు. తుపాను ప్రభావంతో జాడుపూడిలో ధ్వంసమైన జీడిమామిడి తోటలను పరిశీలించారు. తుపాను బాధితులను పరామర్శించిన సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. -
కొబ్బరి నీటికీ అంటిన ‘విషం’
సాక్షి, చెన్నై: రసాయనిక ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల వ్యవసాయోత్పత్తులు విషతుల్యంగా మారిపోతాయనడానికి ఇదొక తాజా నిదర్శనం. తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలైలో 4,500 ఎకరాల్లో కొబ్బరి చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇటీవల అక్కడి చెట్ల నుంచి సేకరించిన కొబ్బరి కాయలు, కొబ్బరి బొండాలలోని నీళ్లు విషతుల్యంగా మారినట్లు తేలింది. రైతులే సమస్యను గుర్తించి స్థానిక వ్యవసాయూధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల సూచనలతో నిమిత్తం లేకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్లనే కొబ్బరి నీళ్లు విషతుల్యంగా మారాయని ఉడుమలై వ్యవసాయశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ చిన్నవేల్ నిర్ధారించారు. నిపుణుల సలహా మేరకు రసాయనాలను పరిమితంగా వినియోగించడం శ్రేయస్కరమని ఆయన రైతాంగానికి సూచించారు.