![తుపాను బాధితులకు అండగా ఉంటాం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51413662857_625x300.jpg.webp?itok=h6Jq4DFd)
తుపాను బాధితులకు అండగా ఉంటాం
ఏలూరు (టూటౌన్) : హుదూద్ తుపాను బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆయన స్పందించి జిల్లా నుంచి రూ.5 లక్షల విలువైన నిత్యావసర వస్తువులను విశాఖపట్టణానికి పంపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విశాఖ వెళ్లి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శుక్ర, శనివారాల్లో విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వెయ్యి కుటుంబాలకు సరిపడా బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, మంచినూనె, చింతపండుతో పాటు ఒక్కో దుప్పటి చొప్పున అందచేశారు. పార్టీ తరఫున ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆళ్ల నాని బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు. విశాఖ జిల్లాలో తీవ్రంగా నష్టం జరిగిన మధురవాడ గ్రామంతో పాటు కొండపైనున్న ప్రజలను కలిసి వారిని ఓదార్చారు.
అంతేకాకుండా వేంబో కాలని, వీఎం పాలెం, చాకలిగడ్డ కాలనీ, స్వాతంత్ర నగర్, రిక్షా కాలని, ధర్మపురి కాలని, పులకవాని గ్రామం, చంద్రంపాలెం, శివశక్తినగర్, టైలస్ కాలనీ, దోబికాలనీ, బాపూజీ నగర్, వికలాంగుల కాలనీ, టీవీఆర్ కాలనీ వాసులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆళ్ల నానితో పాటు విశాఖపట్నం వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సీతారాం, ఏలూరు నియోజకవర్గ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఎన్.సుధీర్‌బాబు, మంచెం మైబాబు, సుంకర చంద్రశేఖర్, కంచన రామకృష్ణ, కర్రి శ్రీనివాస్, వేగి ప్రసాద్, బోడా కిరణ్, కలవకొల్లు సాంబశివరావు, మజ్జి కాంతారావు, మున్నల జాన్‌గురునాథ్, మాకినేని వెంకటేశ్వరరావు, బుద్దాల రాము, కోమర్తి మధు, మంగం ఆది తదితర నాయకులు, కార్యకర్తలు ఆయనతో పాటు పాల్గొన్నారు.
మరిన్ని విరాళాలు సేకరిస్తాం
జిల్లా కార్యకర్తలు, నాయకులను సమన్వయపరిచి ప్రజల సహకారంతో రోడ్లపైకి వచ్చి జోలె పట్టి బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆళ్ల నాని తెలిపారు. విశాఖపట్నంలో ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దగ్గరుండి గమనించిన నాని పెద్ద ఎత్తున జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులతో చర్చిస్తున్నట్టు చెప్పారు.