
సాక్షి, సోంపేట: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిరియా సాయిరాజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ బుధవారం తెలిపారు.
మంగళవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఆత్మాహత్యాయత్నం చేసుకున్నందుకు గాను సాయిరాజ్‌పై 309, 341, 353 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతపై కేసులు పెట్టడం దారుణమని తుపాన్ బాధితులు మండిపడుతున్నారు. సాయిరాజ్‌పై కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment