సోంపేట/ఇచ్ఛాపురం రూరల్/కంచిలి: తిత్లీనష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం అమ్మ ఒడి పథకం ప్రారంభానికి శ్రీకాకుళం వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సుమారు 100 వాహనాల్లో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బయల్దేరి వెళ్లారు.
సోంపేట ఫ్లై ఓవర్ వద్ద నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేరుకుని థాంక్యూ సీఏం సార్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణారావు రౌలో, ఇచ్ఛాపురం జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, చాట్ల తులసీదాసురెడ్డి, కారంగి మోహనరావు, దక్కత నూకయ్యరెడ్డి, లోపింటి దీనబంధురెడ్డి, రాంపత్నీ చిట్టిబాబు, సంతోష్ మండలా, కారంగి త్రినాథ్, నీలాపు జగదీష్, పిట్ట మామయ్య, బుడ్డ కళ్యాణ్, చినపాన ఖోగయ్యలు పాల్గొన్నారు.
థాంక్యూ సీఎం సార్
Published Tue, Jun 28 2022 11:01 AM | Last Updated on Tue, Jun 28 2022 11:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment