AmmaVadi scheme
-
అమ్మఒడిపై ఈనాడు విష కథనాలు
-
ఈ నెల 28 న అమ్మవడి పధకం అమలు
-
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింది
-
థాంక్యూ సీఎం సార్
సోంపేట/ఇచ్ఛాపురం రూరల్/కంచిలి: తిత్లీనష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం అమ్మ ఒడి పథకం ప్రారంభానికి శ్రీకాకుళం వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సుమారు 100 వాహనాల్లో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బయల్దేరి వెళ్లారు. సోంపేట ఫ్లై ఓవర్ వద్ద నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేరుకుని థాంక్యూ సీఏం సార్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణారావు రౌలో, ఇచ్ఛాపురం జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, చాట్ల తులసీదాసురెడ్డి, కారంగి మోహనరావు, దక్కత నూకయ్యరెడ్డి, లోపింటి దీనబంధురెడ్డి, రాంపత్నీ చిట్టిబాబు, సంతోష్ మండలా, కారంగి త్రినాథ్, నీలాపు జగదీష్, పిట్ట మామయ్య, బుడ్డ కళ్యాణ్, చినపాన ఖోగయ్యలు పాల్గొన్నారు. -
అమ్మ ఒడి ఆగదు: మంత్రి సురేష్
సాక్షి, నెల్లూరు: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది దివాళాకోరు రాజకీయమని ధ్వజమెత్తారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టంగా చెప్పారని, ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధులకు హాజరుకాలేమని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.(చదవండి: ఎన్నికల షెడ్యూల్‌ను వెనక్కు తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో) ఎన్ని కుట్రలు చేసినా అమ్మ ఒడి ఎట్టి పరిస్థితుల్లో ఆగదని, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా ఎన్నికల కమిషన్ మారిందన్నారు. నిమ్మగడ్డ రమేష్ నిరంకుశ వైఖరిని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని ఆదిమూలపు తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేస్తారన్నారు. 44 లక్షల 891 మందికి అమ్మఒడి వర్తిస్తుందని.. రెండో విడతలో 1.76లక్షల మందికి అదనంగా లబ్ధి కలగనుందన్నారు. రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.(చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం) సైంధవుడిలా అడ్డుపడుతున్నారు: మంత్రి అనిల్ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా అడ్డుకున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగిస్తారు. మహిళలే చంద్రబాబును తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. హైదరాబాద్‌కే చంద్రబాబు పూర్తిగా మకాం మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లోనే కూర్చున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల కోసం కుట్రలు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవు. ప్రజల కోసమే వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని’’ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీతో కలిసున్నది మీరే కదా?: మంత్రి గౌతమ్‌రెడ్డి పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాకే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టొద్దని, పరిశ్రమల కోసం భూములిచ్చిన వారికి, ఆయా గ్రామాల వారికి మొదటి ప్రాధాన్యతలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య కోర్సులను నిర్వహిస్తున్నాం. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అన్ని అనుమతులు ఉండాల్సిందే. టీడీపీ హయాంలోనే దివీస్ పరిశ్రమకు అనుమతులిచ్చారు. గతంలో టీడీపీతో కలిసున్నది మీరే కదా?. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముందుకెళ్లొద్దని దివీస్‌ను ఆదేశించాం. పరిశ్రమ, మత్స్యశాఖల ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ప్రజల ప్రాణాలపై పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపాలని చెప్పాలని’’ మంత్రి గౌతమ్ రెడ్డి హితవు పలికారు. -
అమ్మఒడిని ప్రశంసించిన జర్మనీ నోబెల్ గ్రహీత
-
పదండి ముందుకు పదండి చదువుకు
-
అమ్మఒడి పథకానికి జగనన్న అమ్మఒడిగా నామకరణం
-
ఇంటర్‌కూ..అమ్మఒడి
-
సంక్షేమ రాజ్యం తెస్తాం: షర్మిల
ఖమ్మంజిల్లా వైఎస్సార్ జనభేరిలో షర్మిల సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. ఎన్నికల ప్రచార యాత్ర వైఎస్సార్ జనభేరిలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె పర్యటించి పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్‌లా రైతును రాజులా తీర్చిదిద్దడం కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. రాజశేఖరరెడ్డిలా ప్రజలను సొంత కుటుంబంలా ప్రేమించే మనసు ఎవరిదని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఓటేసే ముందు మీ గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్‌ను గుర్తుచేసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. వైఎస్ ప్రతి పథకాన్ని అమలు చేస్తాం - వైఎస్ తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసి జనం గుండెల్లో నిలిచారు. -వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు మిగిలిన పథకాలన్నింటినీ తిరిగి అద్భుతంగా అమలు చేస్తాం. - రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రూ.3వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. కరువు, వరదల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2వేల కోట్లతో మరో నిధిని ఏర్పాటు చేస్తాం. - రైతులు, మహిళలు, వికలాంగులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాల న్నింటినీ మాఫీ చేస్తాం. రాష్ట్రంలో అర్హులయిన ప్రతి ఒక్క పేదకుటుంబానికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. - అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో నెలనెలా పదోతరగతి వరకు రూ.500, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీకి రూ.1000 జమచేస్తాం. ఖమ్మం జిల్లాలో ముగిసిన జనభేరి ఖమ్మం జిల్లాలో ఈనెల 13 నుంచి షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్ర జనభేరి బుధవారంతో ముగిసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆమె పర్యటించగా..అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి నుంచి ప్రారంభమైన షర్మిల ప్రచార యాత్ర మధిరలో చివరి సభతో బుధవారం ముగిసింది.