
ప్రదీప్ సైనీ , పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకీ
సోంపేట: ఆ వ్యక్తి చేతిలో తుపాకీ.. ఒంటిపై గాయాలు.. దుస్తులపై రక్తపు మరకలు.. ఆపై స్థానికులతో ఘర్షణ. సోంపేట మండలం కొర్లాంలోని ఓ టిఫిన్ షాపు వద్ద ఆదివారం ఉద్రిక్తత రేపిన ఘటన ఇది. జైపూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఒడిశాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో కొర్లాం వద్ద టిఫిన్ల కోసం ఆగింది. అందులో నుంచి దిగిన ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి హొటల్ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లే ప్రయత్నంలో సిబ్బందితో గొడవ పడ్డాడు. తగాదా జరుగుతున్న సమయంలో సినిమా హీరోలా బస్సులోని తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీ తెచ్చి బెదిరించాడు. అతని ఒంటిపై గాయాలు ఉండడం, దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో తోటి ప్రయాణికులు, హొటల్ సిబ్బంది కూడా భయపడ్డారు.
అయితే బారువ పోలీసులు సీన్‌లోకి దిగితే గానీ అసలు విషయం తెలియలేదు. ప్రదీప్‌కుమార్ ఓ సినిమా కార్మికుడు. అతని చేతిలో ఉన్నది నకిలీ తుపాకీ. ఒంటిపై గాయాలు షూటింగ్‌లో కింద పడిపోతే తగిలినవి. పోలీసులు విచారణ తర్వాత అసలు విషయం చెప్పడంతో హొటల్ సిబ్బందితో సహా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. పోలీసులే ప్రదీప్‌కుమార్‌ను బారువ ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
చదవండి: అమ్మో ఆర్సెనిక్!
Comments
Please login to add a commentAdd a comment