శ్రీకాకుళం: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందారు. మండలంలోని జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి(60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు.
ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. అతనికి ఒడిసాలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జూట్ కార్మికుడిగా పనిచేసే గురుమూర్తి.. బాలాసోర్‌లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి సంఖ్య 288కి చేరింది. మరొకవైపు వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment