తమ్మినేని సీతారాం (ఫైల్ ఫోటో)
సాక్షి, శ్రీకాకుళం: టిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎక్కడాకూడా కనబడటంలేదనీ, సాయం చేయమని అడిగితే ప్రజలపై అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు వైఫ్యల్యాన్ని ఎండగట్టారు. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తుపానుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
మంత్రి అచ్చెన్నాయుడు తనకు ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని.. బాధితులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని తమ్మినేని ప్రశ్నించారు.
తమ్మినేని ఇంకా ఏమన్నారంటే..
- చంద్రబాబు నీవు ముఖ్యమంత్రివా.. రౌడీవా? బాధితులను నోర్ముయ్ అంటావా
- నీళ్లు ,పాలు ,ఆహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులతోకేసులు పెట్టిస్తావా?
- తుపాను ప్రాంతంలో నీవు చెప్పిది ప్రజలు వినాలని రుసరుసలాడటం కాదు
- ప్రజలు చెప్పిన బాధలను వినడం చేయ్
- తుపానులో ప్రజలను ఎలా ఆదుకోవాలో ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ ను చూసి తెలుసుకో
- తుపాను సహాయకబృందాలను నియమించి చక్కగా పరిస్దితిని ఎదుర్కొన్నారు
- ఆయన నీలాగా తుపానును కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయలేదు
- అంతానువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తావా
- నీవు ఇక్కడే ఉంటే ఐఏఎస్ లంతా నీ చుట్టు ఉండి బాబు..బాబు..అంటూ భజనకే సరిపోతుంది
- వారం దాటినా ఎన్యుమరేషన్ కూడా చేయలేకపోయారు..నష్టం అంచనాలు తీసుకోలేదు.
- చంద్రబాబు నీవు, నీ మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోండి.
- బాధితులు చెట్టుకు 5 వేల అడుగుతుంటే 1500 ఇస్తానంటావా? చెట్టు తొలగించేందుకే వేయిరూపాయలవుతుంది
- ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సింది పోయి తుపాను భాదితులను అవమానిస్తావా?
- చంద్రబాబు పద్దతి మార్చుకుని హుందాగా వ్యవహరించు
- పోలీసులు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
- సాయం అఢిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తావా?
- శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ..ఎంతమందిపై కేసులు పెడతావ్
- కేసులను ఎదుర్కొనే సత్తా శ్రీకాకుళం వాసులకు ఉంది
- ప్రజలు కష్టాలలో ఉంటే నిలదీస్తారు...అంతమాత్రానా కేసులు పెడతారా...చంద్రబాబు అసహనం వీడండి.
- శ్రీకాకుళం వాసులకు వార్నింగ్ లు ఇస్తారా...బెదిరిస్తారా....అరెస్ట్ లు చేయ్ ,చూస్తాం...
- మేము పోరాడే సమయం ఆసన్నమైంది.
- ప్రత్యేక పరిస్దితులు నెలకొన్నాయ్.సహాయం అందిస్తారనే ఆశించాం.
- చంద్రబాబునీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం
- నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా
- 23 మండలాలు ఎఫెక్ట్ అయితే 18 మండలాలు అని ప్రకటిస్తారా.
- ఇలాంటి సమయంలో పక్షపాతం చూపడం ఏంటి
- నీ నిర్వాహకం వల్ల నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
- ఈ ఆత్మహత్యకు కారకులైన మీపై ఏ కేసు నమోదు చేయాలి
- అచ్చెన్నాయుడు వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు
- తుపాను బాదితుల దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడతావ్ అచ్చెన్నాయుడూ.అక్కడ ఓట్లు అడుగుతావా.
Comments
Please login to add a commentAdd a comment