
ఏపీలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుపాను ప్రభావంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో సంభవించింది. తిత్లీ తుపాను బాధితులకు సహాయంగా ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఆపద సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.
అయితే తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ విపత్తు పై స్పందించారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తానని తెలిపాడు. ఇప్పటికే తిత్లీ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ సెలబ్రెటీలు అల్లు అర్జున్ 25 లక్షలు, ఎన్టీఆర్ 15లక్షలు, విజయ్ దేవరకొండ 5లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ 5లక్షలు, వరుణ్ తేజ్ 5లక్షలు, కొరటాల శివ 3లక్షలు, అనిల్ రావిపూడి లక్ష, సంపూర్ణేష్ బాబు యాభై వేలు ప్రకటించిన విషయం తెలిసిందే.