
రామ్ చరణ్
‘తిత్లీ’ తుఫాను బాధితులకు సినీ ఇండస్ట్రీ సాయంగా నిలుస్తోంది. పలువురు హీరోలు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్ వరద బాధిత గ్రామాల్లో ఒకదాన్ని దత్తత తీసుకుంటానని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరంలోని వరద బాధిత ప్రదేశాలను బాబాయ్ పవన్‌కల్యాణ్ సందర్శించారు. ఒక బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోమని నాకు చెప్పారు. ఒకరికి సహాయం చేసి, చిన్న మార్పు తీసుకురాగలిగే స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ ఇలాంటి ఆలోచనతో రావడం సంతోషంగా అనిపించింది. ఈ దిశగా మా టీమ్‌తో చర్చలు జరుపుతున్నాను. ఏ గ్రామాన్ని దత్తత తీసుకుని సహాయం చేయబోతున్నామో మా టీమ్ సర్వే జరిపి, త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాం’’ అన్నారు.