సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిక్కోలు జిల్లాను కకావికలం చేసిన తిత్లీ విలయం పొరుగునే ఉన్న ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మొ త్తం 17 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. వీటిలో గజపతి, గంజాం, రాయగడ జిల్లాలు బా గా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో తొమ్మిది మం ది చనిపోగా, ఒడిశాలో 61 మంది మృత్యువాత పడ్డారు. 57 వేల ఇళ్ళు కూలిపోగా, ఎక్కడికక్కడ రహదారులు కోతకు గురయ్యాయి. తాగు నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్, వ్యవసాయ రం గాలు దెబ్బతిన్నాయి. ఇంతటి పెను నష్టం సంభవించినా ఒడిశా కేవలం వారంలోపే కోలుకుంది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి రెండురోజుల కిందటే ప్రకటిం చారు.
ముందు జాగ్రత్తతో తప్పిన తిత్లీ ముప్పు
తుపాను సమాచారంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగురోజులు ముం దుగానే ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాలకు పంపారు. 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో వేర్వే రు చోట్ల ఏర్పాటు చేసిన 1,112 ఆశ్రయ కేం ద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించారు. బియ్యం, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను సిద్ధం చేశారు. ‘ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశాం. పవర్ కట్ చేయకపోతే మంటలు రేగే ప్రమాదం ఉండటంతో అన్ని చోట్లా సరఫరా నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీంతో ఆ రంగంలో పెనునష్టం తప్పింది. అదేవిధంగా లక్షలాదిమందిని ముం దుగానే తరలించడంతో పాటు వారికి భోజన వసతి, వైద్య సౌకర్యాలను కల్పించాం. మంచినీటి సరఫరాకు ప్రత్యేక ట్యాంకర్లు ముందుగానే ఏర్పాటు చేశాం..’అని గంజాం జిల్లా కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి సాక్షి ప్రతినిధికి తెలిపారు.
రూ.750 కోట్లతో తక్షణ సహాయచర్యలు
తుపాను దరిమిలా వెంటనే రాష్ట్ర విపత్తు స్పం దన నిధి నుంచి ఒడిశా ప్రభుత్వం రూ.750 కో ట్లు విడుదల చేసింది. ఆ నిధులతో సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. గంజాం, గణపతి, రాయగడ జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ పునరుద్ధరించినట్టు ఆ రాష్ట్ర సీఎస్ వెల్ల డించారు. బాగా దెబ్బతిన్న గంజాం జిల్లాలోని సురడా–దరింగబడి మార్గం కూడా పునరుద్ధరించారు. 650 గ్రామీణ ప్రాంతాల్లో 570 గ్రామాలకు తాగు నీటి సరఫరా పునరుద్ధరణ పూర్తి కాగా గ్రామీణ ప్రాం తాల్లో గొట్టపు బావుల మరమ్మతు, పునరుద్ధరణ కూడా పూర్తయింది. గజపతి జిల్లా మినహా మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. పంటనష్టానికి గురైన బాధిత రైతాంగానికి రూ.270 కోట్లకు పైబడి పెట్టుబడి సబ్సిడీ ముం జూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీఎస్ తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మా త్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు’అని చెప్పారు.
సీఎం హడావుడి లేదు
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మాత్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోసారి గంజాం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో పర్యటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు..’ అని చెప్పారు. కాగా రాష్ట్రానికి రూ.2,765 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసి ప్రధానమంత్రికి పట్నాయక్ లేఖ రాశారు. రూ.750 కోట్లు రాష్ట్ర విపత్తు నిధి నుంచి ఖర్చు చేస్తున్నామని మిగిలిన రూ.2,015 కోట్లు జాతీయ విపత్తు నిధి నుంచి విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
సిక్కోలులో తొలగని చిక్కులు
తుపాను సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం అడుగులు ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ ప్రభావానికి అన్ని రంగాలూ కుదేలవ్వగా.. ఇప్పటికీ ఏ ఒక్క రంగం కూడా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని 4,319 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం వాటిల్లగా ఆదివారం నాటికి కూడా 1,492 గ్రామాల్లో పునరుద్ధరణ కాలేదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ గ్రామాలే అంధకారంలో ఉన్నాయని సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తుంటే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలంటే కనీసం మరో రెండు వారాలైనా పడుతుందని ఈపీడీసీఎల్ వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment