తుఫాన్‌గా మారిన అల్పపీడనం, తీరం అల్లకల్లోలం.. భారీ వర్ష సూచన | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌గా మారిన అల్పపీడనం, తీరం అల్లకల్లోలం.. భారీ వర్ష సూచన

Published Fri, May 5 2023 2:02 AM | Last Updated on Fri, May 5 2023 7:30 PM

- - Sakshi

గోపాల్‌పూర్‌లో ఉవ్వెత్తున ఎగిసి పడుతున్ను సముద్ర కెరటాలు

బరంపురం (ఒడిశా): ఉత్తర బంగాళాఖాతం అండమాన్‌ దీవిలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 6 నుంచి 9వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. తాజా సమాచారం అందే సమయానికి గోపాల్‌పూర్‌ తీరానికి 700కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.

మూడు రోజుల క్రితం బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం సైక్లోన్‌గా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షంతో పాటు గంటకు సుమారు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే గంజాం, గజపతి, రాయగడ, ఖుర్దా, జగత్సింగపూర్‌, పారాదీప్‌ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరప్రాంతాల్లో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గంజాం జిల్లా ఛత్రపూర్‌లో కలెక్టర్‌ దివ్యజ్వోతి పరిడా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు తుఫాన్‌ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

గోపాల్‌పూర్‌లో..
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గోపాల్‌పూర్‌ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పారాదీప్‌ నుంచి కళింగపట్నం మధ్య తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరించగా.. సైక్లోన్‌ జోన్‌గా గుర్తింపు పొందిన గోపాలపూర్‌ సైతం ఇదే ఆందోళన కొనసాగుతోంది. దీని కారణంగా తీరంలో 5 మీటర్లకు పైగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మోటార్‌ బోట్లతో చేపల వేటపై నిషేధం ఉండగా.. సంప్రదాయ బోట్లు సైతం తీరానికే పరిమితమయ్యాయి. జిల్లాలోని సముద్ర తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే పనిలో ఉన్నారు.

తుఫాను బాధితులను ఆదుకోవాలి
జయపురం:
ఇటీవల విరుచుకుపడిన పెనుగాలులతో కూడిన అకాల వర్షాలు, తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, ఇల్లు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జయపురం సమితి బాధితులు కోరారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో పలువురు బాధితులు జయపురం సబ్‌ కలెక్టర్‌ దేవధర ప్రదాన్‌ను ఆయన కార్యాలయంలో గురువారం కలిసి, వినతిపత్రం అందించారు.

అధికారులు కేవలం టార్పాన్లు ఇచ్చి, చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎవరికి భూమి పట్టాలు ఉన్నాయో వారికి మాత్రం కొంత ఆర్థికసాయం అందించారని, మిగతా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై దృష్టి సారించి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్‌ జాని, సాను ఖొర, బలరాం జాని తదితరులు పాల్గొన్నారు.

తీరంలో వలలు సర్దుకుంటున్న మత్స్యకారులు 1
1/2

తీరంలో వలలు సర్దుకుంటున్న మత్స్యకారులు

 సబ్‌ కలెక్టర్‌కు అందిస్తున్న హరిరావు, బాధితులు 2
2/2

సబ్‌ కలెక్టర్‌కు అందిస్తున్న హరిరావు, బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement