
హైదరాబాద్, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడును ముంచెత్తి, ఏపీని వణికిస్తున్న ఫెంగల్ తుపాను.. తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రభావం శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇక శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం..
.. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. అలాగే చలి తీవ్రతా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇదీ చదవండి: మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం