హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
నాలుగు రోజులు ఇలా..
🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది.
🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment