
కలెక్టర్ ధనంజయరెడ్డికి చెక్కును అందజేస్తున్న శరత్‌బాబు
శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం సినీనటుడు శరత్‌బాబు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు. సంబంధిత చెక్‌ను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని ఆయన బంగ్లాలో గురువారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ తన సొంత జిల్లా శ్రీకాకుళంలో తుపాను బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని చూసి చాలా బాధపడ్డానన్నారు. కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ తుపానుతో ఉద్దానం ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయావన్నారు. జిల్లా వాసిగా శరత్‌బాబు స్పందించడం సంతోషకరమంటూ ఆయన్ని అభినందించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా వ్యవసాయరంగంలో మరింత అభివృద్ధి చెందాలని, అందుకు అధికారులు, మీడియా సహకారం అందించాలని కోరారు.