తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది.