సాక్షి, హైదరాబాద్ : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ తుపాను ముందు పరిస్థితిని, తర్వాత పరిస్థితిని ఆడియో రూపంలో గవర్నర్‌కు అందించామన్నారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోవడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బృందం తక్షణమే రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, ఏ మూలకు వెళ్లినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని పవన్ తెలిపారు. కిలో మీటర్ల దూరం కాలి నడకన తిరిగి పరిస్థితిని అంచనా వేశామన్నారు. తమ నివేదికను గవర్నర్‌కు అందజేశామని, దానిని కేంద్రానికి పంపుతామని గవర్నర్ చెప్పారన్నారు. మత్య్సకారులను ప్రత్యేక సాయం చేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment