
తుఫాన్ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్ సోమవారం సందర్శించారు.
ఇచ్ఛాపురం: మున్సిపాలిటిలోని తుఫాన్ బాధిత ప్రాంతం కండ్రవీధిని సినీనటుడు షకలక శంకర్ సోమవారం సందర్శించారు. తుఫాన్ బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆహార పొట్లాలను అందజేశారు. అనంతరం ఇచ్ఛాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.