స్కార్లెట్ విల్సన్, షకలక శంకర్
‘డ్రైవర్ రాముడు’ అనగానే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రం రూపొందుతోంది. మాస్టర్ ప్రణవ్‌తేజ్ సమర్పణలో కె.వేణుగోపాల్, ఎమ్.ఎల్. రాజు, టి. కీరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. ‘శంభో శంకర’ తర్వాత షకలక శంకర్ హీరోగా చేస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు.
ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’తో పాటు పలువురు స్టార్ హీరోల సరసర పలు పాటలకు కాలు కదిపిన స్కార్లెట్ విల్సన్ ఈ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. శంకర్, స్కార్లెట్‌పై చిత్రీకరించిన ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment