నవ్వుల రాముడు | shakalaka shankar Driver Ramudu Teaser | Sakshi
Sakshi News home page

నవ్వుల రాముడు

Published Wed, May 23 2018 12:35 AM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

shakalaka shankar Driver Ramudu Teaser - Sakshi

రాజ్‌ సత్య, సుధీర్‌బాబు, ఎమ్‌.ఎల్‌. రాజు

డ్రైవర్‌ రాముడు అనగానే 1979లో ఎన్టీఆర్, జయసుధ నటించిన ‘డ్రైవర్‌ రాముడు’ సినిమా  గుర్తు రావడం సహజం. ఇప్పుడు అదే పేరుతో ‘షకలక’ శంకర్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. రాజ్‌ సత్య దర్శకుడు. సినిమా పీపుల్‌ పతాకంపై మాస్టర్‌ ప్రణవ్‌ తేజ్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని వేణుగోపాల్‌ కొడమగుళ్ల, ఎమ్‌.ఎల్‌. రాజు, ఆర్‌.ఎస్‌. కిషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే మూడో షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం టీజర్‌ను హీరో సుధీర్‌ బాబు చేతుల మీదగా విడుదల చేశారు చిత్రబృందం.

ఈ సందర్భంగా సుధీర్‌ బాబు మాట్లాడుతూ – ‘‘ఏ సినిమాలో అయినా ‘షకలక’ శంకర్‌ ఉన్నాడంటే ఆ సినిమాలో కామెడీ బావుంటుంది. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత వినోదాన్ని పంచుతుందో ఊహించవచ్చు. ఈ చిత్రదర్శక–నిర్మాతలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రాజ్‌ సత్య మాట్లాడుతూ – ‘‘డ్రైవర్‌ రాముడు’ చిత్రం ద్వారా శంకర్‌లోని మరో కోణాన్ని, ఆయన మార్క్‌ కామెడీనే కాకుండా, ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే ఓ ఎమోషనల్‌స్టోరీని చూపించబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, ఆర్ట్‌: రఘు కులకర్ణి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement