'ఇక సెప్పెదేం లేదు.. సేసేదే'.. రిలీజ్‌ టీజర్‌ అదిరిపోయింది! | Tollywood Hero Sudheer Babu's Harom Hara Teaser Release Date Out Now | Sakshi
Sakshi News home page

Harom Hara Release Teaser: సుధీర్ బాబు హరోం హర.. రిలీజ్‌ టీజర్‌ చూశారా?

Published Thu, Jun 13 2024 3:56 PM | Last Updated on Thu, Jun 13 2024 4:19 PM

Tollywood Hero Sudheer Babu's Harom Hara Teaser Release Date Out Now

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం హరోం హర. ఈ సినిమాను జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరెకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హరోం హర ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్ అతిథులుగా హాజరయ్యారు.

తాజాగా హరోం హర మూవీకి సంబంధించిన రిలీజ్‌ టీజర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. విడుదలకు ముందు రోజు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఫైట్స్‌, యాక్షన్ సీన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. కాగా.. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement