షకలక శంకర్
హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించకున్న షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకం పై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్‌ఎల్ రాజు, ఆర్‌ఎస్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శంకర్‌లో మరో కొత్త కోణాన్ని చూపించే చిత్రం ఇది. శంకర్ మార్క్ కామెడీతో, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రకథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు, ఒక్క పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. ఇప్పటికే టైటిల్‌కి, పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: అమర్‌నాథ్, ఆర్ట్: రఘు కులకర్ణి.
Comments
Please login to add a commentAdd a comment