సాక్షి, న్యూఢిల్లీ: తిత్లీ తుఫాన్‌తో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చింది. తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ తుఫాన్ సాయం కింద ఏపీకి రూ.539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.
అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లాలో తుఫాన్ తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చింది. జిల్లాలోని అనేక చోట్ల తుఫాన్ ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీత్లి బాధితులు చాలామంది ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment