![Chinarajappa Comments On Titli Cyclone - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/24/Chinarajappa.jpg.webp?itok=U8Csm_io)
హోం మంత్రి చినరాజప్ప
సాక్షి, అమరావతి: తిట్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని, రూ. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తిట్లీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.
అక్టోబర్ 26 నుంచి 30 వరకు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరోసారి పర్యటించి నష్టపరిహారం అందజేస్తారని చినరాజప్ప పేర్కొన్నారు. తుపాన్ బాధితులకు సాయంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గవర్నర్ నరసింహన్‌ను కలిస్తే ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. తను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment