relief fund
-
అగ్గిపెట్టెలకు 23 కోట్లు.. ప్రశ్నించినందుకు సాక్షిపై కేసు
-
తెలంగాణ సీఎం సహాయ నిధికి రిలయన్స్ భారీ విరాళం
-
జూ.ఎన్టీఆర్ రూ.1 కోటి విరాళం
-
ఒడిశాలో దారుణం..డబ్బుకోసం ఆఖరికి మృతదేహాలను..
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం హృదయాన్ని కలిచివేస్తే..అక్కడ జరగుతున్న కొన్ని ఘటనలు అత్యంత విస్తుపోయేలా ఉన్నాయి. తమ వాళ్లను కోల్పోయి వారిని కనుగొనడం, గుర్తుపట్టడంతో నరకయాతన చూస్తుంటే..కొందరు వాటినే క్యాష్ చేసుకోవాలనే దురాలోచనతో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ఫండ్ కోసం కక్కుర్తి పడి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే తెగబడి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకుంది. వివరాల్లోకెళ్తే..కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా జూన్ 2న జరిగిన ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడంటూ అక్కడ ఉన్న మృతదేహాన్ని తన భర్తగా గుర్తించినట్లు చెప్పింది. ఐతే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఆమె వాదన తప్పు అని తేలింది. దీంతో పోలీసులు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఆమె భర్త మానియబంధ్ మాత్రమే ఊరుకోలేదు. ఏకంగా పోలీస్టేషన్‌కు వచ్చి ఆమెపై ఫిర్యాదు చేశాడు. గత 13 ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నట్లు అతను పోలీసులకు తెలిపాడు. ప్రజాధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు, పైగా తననే చనిపోయినట్లు ప్రయత్నించినందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ డిమాండ్ చేశారు. ఐతే ఘటన బాలోసోర్ జిల్లాలో బహనాగా పోలీస్టేషన్లో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని గీతాంజలి భర్తకు తెలిపినట్లు మణిబండ పోలీస్టేషన్ ఇన్చార్జ్ బసంత్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా మృతదేహాలపై నకిలీ హక్కుదారుల ముసుగులో వచ్చే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వేస్‌ని, ఒడిశా పోలీసులను కోరారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. (చదవండి: ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు) -
ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం
Prabhas Donating 1 Crore Rupees To AP CM Relief Fund: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు వింటే చాలు అభిమానులు 'అన్నయ్య', 'డార్లింగ్' అంటూ గుండెల్లో గుడి కట్టుకుంటారు. తన యాక్టింగ్ స్టైల్, మంచి మనసుతో ఎందరో అభిమానులు సంపాదించుకున్నాడు ఈ డార్లింగ్. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత వచ్చిన 'సాహో'తో మరింత పాపులర్ అయ్యాడీ మిస్టర్ ఫర్ఫెక్ట్. ఫైటింగ్‌లు, రొమాన్స్‌లు కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలోనూ ప్రభాస్ బాహుబలినే. ఇందుకు తాజా నిదర్శనం ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను తన మంచి మనసుతో ఆదుకోవడం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. Rebel Star #Prabhas Donated Rupees 1 CRORE Towards “AP CM Relief Fund”for #AndhraPradesh flood victims @AndhraPradeshCM . pic.twitter.com/Vduo1GI8T2 — BA Raju's Team (@baraju_SuperHit) December 7, 2021 -
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు.. అల్లు అర్జున్ రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వరదల కారణంగా నష్టపోయినవారికి తన వంతు సాయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.25 లక్షల విరాళం అందించారు. వరదల కారణంగా నష్టపోయిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. (చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం) -
తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలతోపాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగింది. సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ దొరకలేదు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల అంశాన్ని విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తుతూ తక్షణ సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయి. వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయి. చదవండి: (Jagananna Vidya Deevena: 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు) ప్రాధమిక అంచనాల ప్రకారం 6,054 కోట్ల రూపాయల పంట, ఆస్తి నష్టం జరిగిందని విజయసాయి రెడ్డి వివరించారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. వరదలతో అతలాకుతలమైపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం అర్ధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కోవిడ్ పరిహార నిబంధనలపై మరో 4 వారాల గడువు
న్యూఢిల్లీ: కోవిడ్–19తో చనిపోయిన వారి కుటుం బాలకు పరిహారం విషయంలో నిబంధ నలను రూపొందించేందుకు గడువును సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో నాలుగు వారాలు పెంచింది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తి కావొస్తోందనీ, వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిం చేందుకు మరి కొంత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు సోమవారం జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. జూన్ 30వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి నివేదించారు. మరి కొన్ని ఆదేశాల అమలు తీరును పూర్తి స్థాయిలో వివరిస్తూ, దాన్ని కోర్టు ఎదుటకు తీసుకొచ్చి అఫిడవిట్ రూపంలో దాఖలు చేసేందుకు రెండు వారాలు కావాలని కోరారు. దీంతో, కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో మార్గదర్శకాల రూపకల్పనకు 4 వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. -
కోవిడ్ ఫండ్: క్రిప్టో కరెన్సీ బిలియనీర్ భారీ విరాళం
సాక్షి,న్యూఢిల్లీ: క్రిప్టో బిలియనీర్,ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఒక బిలియన్ డాలర్ల విలువైన(సుమారు రూ. 7400 కోట్లు) క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు. తాజా నివేదికల ప్రకారం తన సొంత క్రిప్టో కరెన్సీ 500 ఈథర్ని, 50 ట్రిలియన్ డాలర్లకు పైన (షిబా ఇను)మెమె డిజిటల్ కరెన్సీను దానం చేశాడు. బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్లో బుటెరిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎథీరియంను ప్రారంభించింది నెయిల్వాల్. దేశంలోని కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు బుటెరిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే షిబా ఇను పెట్టుబడిదారులకు కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే భారత్‌లో క్రిప్టో కర్సెన్సీ రద్దు కాలేదని, 60 లక్షల డాలర్లు క్రిప్టో కర్సెన్సీ విరాళాలు అందాయని వివరించారు. అయితే డిజిటల్ కరెన్సీ విరాళంగా ప్రకటించడంతో కొంతమంది పెట్టుబడిదారులలో భయాందోళనలకు దారితీసింది. ఫలితంగా గత 24 గంటల్లో షిబాఇను ధర 35శాతం పైగా క్షీణించింది. ప్రస్తుతం నష్టాలనుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. బిట్‌కాయిన్ తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథీరియం. దీని ధర మే 10న 3000 డాలర్లకు చేరుకున్నప్పుడు బుటెరిన్ నికర విలువ సుమారు 21 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈథర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 376 బిలియన్ డాలర్లుకుపై మాటే.ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈథర్ విలువ 325 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. దీంతో గత నెలలో ప్రపంచంలోనే 27 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలియనీర్‌గా విటాలిక్ బుటెరిన్ అవతరించిన సంగతి తెలిసిందే. చదవండి: గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి Thanks @VitalikButerin One thing we have learnt from Ethereum and @VitalikButerin is importance of community We will not do anything which hurts any community specially the retail community involved with $SHIB We will act responsibly! Plz dont worry $SHIB holders. https://t.co/M4GxTR0JAn — Sandeep - Polygon(prev Matic Network) (@sandeepnailwal) May 12, 2021 -
‘వరద సాయం: మీసేవా కేంద్రాలకు వెళ్లద్దు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద సాయం రూ. 10 వేల కోసం బాధితులు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు మీసేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మీసేవా కేంద్రాల నిర్వాహకులు తెలియాజేస్తున్నారు. వరద సాయం బాధితులు భారీగా రావడంతో నిర్వాహకులు మీసేవా కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాల వద్ద ఆందోళన నేలకొంది. మీసేవా కేంద్రాల వద్ద బాధితుల క్యూ పెరగడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పందించారు. వరద సాయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. వరద సాయం కోసం బాధితుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరించిన తర్వాత వరద బాధితుల అకౌంట్లో డబ్బు జమఅవుతాయిని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరద సాయం అందజేస్తామన్న సంగతి తెలిసిందే. -
క్రీడాకారుల సహాయనిధికి రూ. 45 కోట్లు
పారిస్: కరోనా కారణంగా టోర్నీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ధమాన క్రీడాకారులను ఆదుకునేందుకు టెన్నిస్ క్రీడా పాలక మండళ్లు నడుం బిగించాయి. వారి సహాయార్థం 60 లక్షల డాలర్ల (రూ. 45.57 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్లతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీ కమిటీలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. 800 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ నిధితో లబ్ధి పొందే అవకాశముంది. -
‘పెద్దాపురం నుంచే పోటీ చేస్తా’
సాక్షి, అమరావతి: తిట్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని, రూ. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తిట్లీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరోసారి పర్యటించి నష్టపరిహారం అందజేస్తారని చినరాజప్ప పేర్కొన్నారు. తుపాన్ బాధితులకు సాయంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గవర్నర్ నరసింహన్‌ను కలిస్తే ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. తను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. -
పనికిమాలిన పిల్: కోర్టు వినూత్న జరిమానా
సాక్షి, బెంగళూరు: కర్నాటక హైకోర్టు వినూత్న తీర్పునిచ్చింది. టెర్రరిస్తుల దాడిపై తాను చేసిన హెచ్చరికను పట్టించుకోలేదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినకోర్టు పిటిషనరుకు జరిమానా విధించింది. శివమోగ జిల్లా తుడూర్ గ్రామానికి చెందిన హరీశ్చంద్ర గౌడ అనే పిటిషన్‌దారు నవంబరు 26, 2008 ముంబై ఉగ్రదాడిపై తాను అందించిన సమాచారాన్ని పట్టించుకోలేదంటూ పిటిషన్దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పనికిమాలిన పిల్‌గా బెంచ్ కొట్టిపారేసింది. రూ.5వేలను కొడగు వరద బాధితులకు అందించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. 30రోజులలోపు ముఖ్యమంత్రి సహాయనిధి ఈ సొమ్మును డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన మెమోను కూడా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే ఇకపై ఇలాంటి వ్యర్థమైన పిటిషన్లు దాఖలు చేయవద్దని, నిజమైన సమస్యలపై స్పందించాలని కోరారు. కాగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవాడిననీ, 42 సంవత్సరాలు పాటు ఏఐసీసీలో కొనసాగినట్టు గౌడ చెప్పుకున్నారు. 2005లో కూడా తాను అధికారులను హెచ్చరించానని అయినా అధికారులు పటక్టించుకోలేదని వాదించారు.ఈ నేపథ్యంలో 2010జూన్‌లోఅప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు లేఖ రాయగా ఆమె మహారాష్ట్ర మంత్రిత్వశాఖకు రాశారని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి చర్యతీసుకోలేదని గౌడ వాదించారు. -
వైఎస్ జగన్ పిలుపుతో కేరళకు కదిలిన కార్యకర్తలు
సాక్షి, చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వారు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10 లక్షల రూపాయలు, 14 టన్నుల బియ్యం, పప్పు ధాన్యాలు, చీరలు సేకరించారు. పుత్తూరు నుంచి 30 మందితో కూడిన పార్టీ బృందం.. సేకరించిన సరుకులు, నగదును తీసుకుని కేరళకు పయనమైందని రోజా తెలిపారు. కాగా, తన వంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని ప్రకటించి ఎమ్మెల్యే రోజా బాధితులకు బాసటగా నిలిచారు. -
తక్షణ సాయం100 కోట్లు
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ తెలిపారు. అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్‌తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్‌నాథ్‌కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లిలో గ్రామానికి చెందిన ఎడవెల్లి స్రవంతి, గాయత్రిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, పీఆర్డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సాంబశివరావు, పీఆర్ ఏఈ సుగుణాకర్, వంగపల్లి సర్పంచ్ చంద్రగాని నిరోష, ఉపసర్పంచ్ రేపాక స్వామి తదితరులున్నారు. -
సహాయ నిధి స్వాహా!
సీఎం రిలీప్ఫండ్ గోల్మాల్ చికిత్సలు లేకుండానే నకిలీ బిల్లులు జిల్లా నుంచే ఎక్కువ! గుర్తించిన సీఎంఆర్ఎఫ్ అధికారులు విచారణకు త్వరలో జిల్లాకు రానున్న సీఐడీ సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి సహాయ నిధిలో నకిలీ బిల్లుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి కూడా చాలా వరకు బిల్లులు ఉండడంతో నకిలీల బండారం బయటపడనుంది. సూత్రధారులెవరో.. పాత్రధారులెవరో తేలనుంది. ఈ విషయంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, నకిలీ బిల్లులు సృష్టించిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ప్రమాదవశాత్తు, లేక ఇతర ఆరోగ్య పరమైన చికిత్సలు చేయించుకుని ఆర్థికసాయం కోసం వస్తే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతిపాదనలు పంపుతారు. అయితే.. చికిత్స చేయకున్నా చేయించినట్లు నకిలీ బిల్లులు పెట్టి కొందరు రిలీఫ్ ఫండ్ తీసుకున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు గుర్తించారు. ఇలా నల్లగొండ, వరంగల్ జిల్లాతోపాటు మన జిల్లా నుంచి ఇలా నకిలీ బిల్లులు అందాయి. అంతేకాకుండా చికిత్సకు అయిన బిల్లు స్వల్పంగా ఉంటే భారీగా చూపుతూ బిల్లులు పంపారు. ప్రజాప్రతినిధులే సీఎంఆర్ఎఫ్కు ఈ బిల్లులను సిఫార్సు చేశారు. తెలంగాన ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా బిల్లులు మంజూరు కాగా ఇందులో జిల్లాలో వందల సంఖ్యలో బిల్లులు ఉన్నాయి. నకిలీ బిల్లుల్లో మన జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు సీఎంఆర్ఎఫ్ అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ఈ బృందం జిల్లాకు వచ్చి అసలు బిల్లు మంజూరైన లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారు.. వారు ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారు.. ఆస్పత్రి యాజమాన్యం ఎంత బిల్లు వేసింది..? తదితర వివరాలు అన్ని సేకరించనుంది. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో ప్రజప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం వచ్చే వారికి సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, బిల్లులు నకిలీవని ఎలా గుర్తుపట్టాలని వారు పేర్కొంటున్నారు. సీఐడీ విచారణ చేస్తే జిల్లా వ్యాప్తంగా నకిలీ బిల్లుల వ్యవహారం గుట్టురట్టు కానుంది. ఈ వ్యవహారంలో ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్నట్లు తేలితే ఇక నుంచి వారు సీఎం కార్యాలయానికి వైద్యం కోసం సహాయం అందించే ప్రతిపాదలను తిరస్కరించే అవకాశం ఉంది. అయితే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 362 బిల్లులకు వైద్యం కోసం సహాయం అందింది. ఇందులో ఇంకా 11 బిల్లులు పంపిణీ చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చే బిల్లుల వ్యవహారంలోనే నకిలీవి వచ్చినట్లు కార్యాలయ అధికారులు గుర్తించారు. -
తుపాను బాధితులకు సినిమా రంగ ప్రముఖుల విరాళాలు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన నేపధ్యంలో సినిమా రంగానికి చెందిన వారు వెంటనే స్పందించారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు అందరూ నిన్నటి నుంచి బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ రోజు తాజాగా మరి కొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ సమంత ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ప్రకటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఏడు లక్షల రూపాయలు, రచయిత చిన్నికృష్ణ లక్షల రూపాయల నగదుతోపాటు ఐదు లక్షల విలువైన బియ్యం, తన పిల్లల పేరిట మరో యాభైవేల రూపాయలు, దర్శకుడు శ్రీను వైట్ల, హీరో గోపిచంద్, హాస్య నటుడు సునీల్, హీరోయిన్ కాజల్ ఒక్కొక్కరు అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు. హాస్యనటుడు ఆలీ, నవీన్ చంద్ర, రాహుల్ ఒక్కొక్కరు లక్ష రూపాయలు విరాళాలు ప్రకటించారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్సీసీ) 10లక్షల రూపాయల చెక్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు కె.ఎస్.రామరావు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాక, ఎఫ్ఎన్సీసీకి చెందిన ఉద్యోగులు 350 మంది తమ ఒకరోజు వేతనాన్ని తుఫాను బాధితుల సహాయార్ధం అందించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారు: పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు బాలకృష్ణ రూ.30 లక్షలు సూర్య రూ.25 లక్షలు మహేష్ బాబు రూ.25 లక్షలు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి రూ. 25 లక్షలు ఎన్టీఆర్ రూ. 20 లక్షలు అల్లు అర్జున్ రూ. 20 లక్షలు రేణుదేశాయ్ రూ.20 లక్షలు ప్రభాస్ రూ.20 లక్షలు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు విశాల్ రూ.15 లక్షలు రామ్‌చరణ్ రూ.15 లక్షలు కార్తీ రూ.12.5 లక్షలు జ్ఞాన్వేల్ రాజా రూ.12.5 లక్షలు కృష్ణ రూ.15 లక్షలు విజయనిర్మల రూ.10 లక్షలు నితిన్ రూ.10 లక్షలు రవితేజ రూ.10 లక్షలు రామ్ రూ. 10 లక్షలు వివి వినాయక్ రూ. 10 లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 10 లక్షలు కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు సమంత రూ. 10 లక్షలు బోయపాటి శ్రీను రూ7 లక్షలు హరీశ్ శంకర్ రూ.3 లక్షలు ప్రకాశ్‌రాజ్ రూ.5 లక్షలు అల్లరి నరేష్ రూ.5 లక్షలు శ్రీను వైట్ల రూ.5 లక్షలు గోపిచంద్ రూ.5 లక్షలు సునీల్ రూ.5 లక్షలు కాజల్ రూ.5 లక్షలు పాప్ గాయని స్మిత రూ.5లక్షలు బ్రహ్మానందం రూ.3లక్షలు సందీప్ కిషన్ రూ.2.5లక్షలు సంపూర్ణేష్ బాబు రూ. లక్ష రకుల్ ప్రీత్ రూ.లక్ష నిఖిల్ రూ. 2 లక్షలు పూరి ఆకాశ్ రూ. లక్ష 50 వేలు ప్రతాప్ కొలగట్ల రూ. లక్ష నందూ రూ. లక్ష ఆలీ రూ. లక్ష నవీన్ చంద్ర రూ. లక్ష రాహుల్ రూ. లక్ష రావురమేష్ రూ. లక్ష రచయిత కోన వెంకట్ రూ. లక్ష రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ** -
ఇదీ పోలీస్ న్యాయం!
పోలీస్ జీపు ఢీకొని విరిగిన కాలు పట్టించుకోని పోలీసులు ఆరు నెలలు ఇక మంచమే గతి ఆవేదనలో బాధితుడు తిరుపతి క్రైం: ఏదైనా వాహనం ఢీకొని కాలు విరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు వాహనం ఢీకొని కాలు విరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పెట్రోలింగ్ వాహనంలో వెళుతున్న పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆటో డ్రైవర్ కాలు విరిగింది. ఆరు నెలలు అతను మంచానికే పరిమితం కావలసి వస్తోంది. అతని కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. పోలీసులు ఆదుకోకపోగా కేసు కూడా నమోదు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే సైతం వీరి గోడు పట్టించుకోలేదు. దీంతో వీరి కుటుంబం ఆవేదన చెందుతోంది. బాధితుడు గుణశేఖర్ కథనం మేరకు.. గుణశేఖర్, మునెమ్మ దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి తిరుపతి రాజీవ్‌నగర్ క్రాంతినగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. గుణశేఖర్ ఆటోను అద్దెకు నడిపేవాడు. జూన్ 25వ తేదీ ఆరోగ్యం బాగోలేక గుణశేఖర్ ఆస్పత్రికి వెళ్లాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. సత్యనారాయణపురం సర్కిల్ వద్ద ఏపీ 03ఎజి. 3092 నెంబరు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ముందుకెళ్లింది. అందులోని కానిస్టేబుళ్లు కుడివైపు డోరు తీయడంతో వెనకే వస్తున్న గుణశేఖర్‌కు తగిలి పక్కనే ఉన్న పెద్ద బండరాయిపైన పడ్డాడు. అతని కుడికాలు విరిగింది. పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. భార్య మునెమ్మ భర్తను రుయా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కుడికాలుకు 26 కుట్లు పడ్డాయి. ఆరు నెలలపాటు గుణశేఖర్ బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. మరుసటి రోజు గుణశేఖర్ భార్య అలిపిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మీ భర్తను ఢీకొంది పోలీస్ జీపే కదా.. మీరు ఫిర్యాదు ఇచ్చినా కాగితాన్ని చింపేస్తాం. వెళ్లు ఇక్కడి నుంచి’’ అంటూ విధుల్లో ఉన్న ఎస్ఐ గణేష్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. డీ ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకుంది. మాట్లాడి న్యాయం చేస్తామంటూ ఆయన జీపెక్కి వెళ్లిపోయారు. పోలీసులు పట్టించు కోకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్రను బాధితులు ఆశ్రయించారు. వారు అలిపిరి పోలీసులను కలసి పోలీస్ జీపు ఢీకొని గాయపడిన గుణశేఖర్‌కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయమై గుణశేఖర్, భార్య మునెమ్మ ఎమ్మెల్యే వెంకటమరణ వద్దకు వెళ్లారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇవ్వన్నీ ఎందుకంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పా రు. ఇప్పటికైనా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
‘నీలం’ పరిహారం ఇంకెంత దూరం?
సాక్షి, రాజమండ్రి :లోకపుటాకలి తీర్చే అన్నదాతంటే అందరికీ, అన్నింటికీ లోకువే. ప్రకృతి ప్రకోపించినా, ప్రభుత్వాలు అలసత్వం వహించినా, మార్కెట్ మాయాజాలం పేట్రేగినా తొలుత బాధితులయ్యేది రైతులే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విపత్తులు కబళించినప్పుడు..నిస్సహాయులైన రైతులు- గోరంత సాయం కోసం కొండంత ఆశతో ప్రభుత్వాల వైపు చూస్తారు. 2012 నవంబర్‌లో నీలం తుపాను ఖరీఫ్ పంటను తుడిచి పెట్టినప్పుడు.. జిల్లాలోని అన్నదాతలు అలాగే ప్రభుత్వంపై ఆశ పెట్టుకున్నారు. అయితే వారందరి కన్నీటిని తుడవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంచనాలు, నివేదికలు, కేంద్ర బృందాల పరిశీలనల అనంతరం ఎట్టకేలకు గత ఏడాది మేలో నీలం పరిహారం నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అక్టోబరు నాటికి నిధులు జిల్లా అధికారుల ఖాతాల్లోకి చేరాయి. అన్ని విభాగాల పరిశీలనల అనంతరం జిల్లాలో 3.90 లక్షల మంది రైతులను నీలం బాధితులుగా తేల్చిన ప్రభుత్వం వారికి పరిహారంగా పంపిణీ చేసేందుకు రూ.144 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబరు నాటికి పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనారంభించారు. ఈ ఏడాది జనవరి నాటికి 2.92 లక్షల మంది ఖాతాలకు పరిహారం జమైంది. అయితే అధికారుల అలసత్వం కారణంగా సుమారు 98 వేల మందికి నేటికీ పరిహారం సుదూరంగానే నిలిచింది. బ్యాంకు ఖాతాల్లో తేడాలు, రైతుల పేర్లలో దొర్లిన తప్పుల వంటివి సరిదిద్దడంలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ఉసూరుమనిపిస్తోంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం మారుతుండడంతో అసలు పరిహారం అందుతుందా, ఎన్నటికీ అందని మానిపండవుతుందా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవకతవకలు అనేకం.. నిబంధనల ప్రకారం పరిహారం సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. రైతుల ఖాతాల వివరాలను మండల వ్యవసాయ అధికారులు సేకరించి నివేదికలు పంపారు. అయితే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లు రైతులు పరిహారం పొందడంలో ప్రతిబంధకాలయ్యాయి. బ్యాంకులకు రైతుల ఖాతాల నంబర్లను సమర్పించే సమయంలో సున్నాలను ‘ఓ’ అనే ఇంగ్లీషు అక్షరాలుగా పేర్కొన్నారు. దాంతో ఆ ఖాతాలు చెల్లవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. ఖాతాల నంబర్ల ముందు రైతుల అసలు పేర్లను కాకుండా వ్యవహార నామాలనే పేర్కొనడం, ఇంటిపేరు లేకుండా కేవలం పేర్లనే ఉదహరించడం, తండ్రి పేర్లలో తేడాల వల్ల అలాంటి వారి ఖాతాలకు కూడా బ్యాంకులు సొమ్ములు జమ చేయలేదు. కొందరు రైతుల ఖాతాలు చాలాకాలం నుంచి లావాదేవీలు లేక నిలిచిపోయాయి. అలాంటి ఖాతాల స్థానంలో కొత్తవి తెరిచేలా రైతులను చైతన్యపరచడంలో అధికారులు అలసత్వం వహించారు. ఇలా అనేక కారణాల వల్ల.. పరిహారంగా విడుదలైన సొమ్ము రైతులకు పంపిణీ కాక బ్యాంకుల్లో నిరర్థక నిధులుగా ఉండిపోయింది. ఇక పలువురు రైతులు ఇచ్చిన ఖాతా నంబర్లు వేరే వారివి కావడంతో పరిహారం వేరే వారి ఖాతాలకు జమైంది. ఈ చిక్కును కూడా అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. జరిగిన పొరబాట్లను సహనంతో, సమన్వయంతో చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెడుతూనే ఆరునెలలు గడిపేశారు. వ్యవసాయాధికారులు ఖాతాల వివరాలు సవ్యంగా సమర్పించలేదని బ్యాంకు అధికారులు అంటుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల సిబ్బంది తాము పొరపాట్లను సవరించినా మార్పు చేసేందుకు సహకరించడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇస్తారా..? అవకతవకలకూ, ఆలస్యానికీ ఎవరి బాధ్యత ఎంతనేది అలా ఉంచితే సుమారు 98 వేల మంది అన్నదాతలకు అందాల్సిన రూ.తొమ్మిది కోట్ల పరిహారం ఆరు నెలలుగా బ్యాంకుల్లో మూలుగుతోంది. నిబంధనల ప్రకారం దీనిపై వడ్డీ కూడా జమ అవుతుంది. ఈ వడ్డీని అటు వ్యవసాయాధికారులు, ఇటు బ్యాంకు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. కాగా కొన్ని లోతట్టు గ్రామాల్లో రైతులకు అందాల్సిన పరిహారం నిధులను గుట్టుగా స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన జాప్యం ఎలాగూ జరిగింది. ఇప్పటికైనా అన్నదాతల అలనాటి భారీ నష్టానికి చిరుసాయాన్ని అందించడానికి ఉన్నతాధికారులు సంకల్పించాలి. -
మీరు పాడేసే ముష్టి మాకు అక్కర్లేదు: అసోం సీఎం
అవన్నీ పెద్ద పెద్ద టీ కంపెనీలు. కోట్లకు కోట్ల లాభాలు ఆర్జిస్తుంటాయి. కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అవన్నీ కలిపి మరీ ఇచ్చిన విరాళం మాత్రం 15.23 లక్షల రూపాయలు మాత్రమే!! దీంతో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. మీరు పారేసే ముష్టి నాకు అక్కర్లేదంటూ ఆ సొమ్మును తిప్పి పంపేశారు. ఇండియన్ టీ అసోసియేషన్ అనే పేరుతో మొత్తం 25 ప్రధాన టీ కంపెనలన్నీ కలిసి మరీ ఇంత తక్కువ మొత్తం ఇవ్వడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ, ఈ కంపెనీలన్నీ భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మాత్రం ఇవి అస్సలు పట్టించుకోవడంలేదని సీఎంవో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అందుకే ఆ చెక్కులను మొత్తం 25 కంపెనీలకు తిప్పి పంపేస్తున్నారు. మొత్తం అన్ని కంపెనీలలో అత్యల్పంగా 6,675 రూపాయలు పంపగా, అత్యధికంగా 3,88,700 రూపాయలు పంపారు.