సాక్షి,న్యూఢిల్లీ: క్రిప్టో బిలియనీర్,ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఒక బిలియన్ డాలర్ల విలువైన(సుమారు రూ. 7400 కోట్లు) క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు. తాజా నివేదికల ప్రకారం తన సొంత క్రిప్టో కరెన్సీ 500 ఈథర్ని, 50 ట్రిలియన్ డాలర్లకు పైన (షిబా ఇను)మెమె డిజిటల్ కరెన్సీను దానం చేశాడు.
బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్‌లో బుటెరిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎథీరియంను ప్రారంభించింది నెయిల్‌వాల్. దేశంలోని కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు బుటెరిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే షిబా ఇను పెట్టుబడిదారులకు కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే భారత్‌లో క్రిప్టో కర్సెన్సీ రద్దు కాలేదని, 60 లక్షల డాలర్లు క్రిప్టో కర్సెన్సీ విరాళాలు అందాయని వివరించారు. అయితే డిజిటల్ కరెన్సీ విరాళంగా ప్రకటించడంతో కొంతమంది పెట్టుబడిదారులలో భయాందోళనలకు దారితీసింది. ఫలితంగా గత 24 గంటల్లో షిబాఇను ధర 35శాతం పైగా క్షీణించింది. ప్రస్తుతం నష్టాలనుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. బిట్‌కాయిన్ తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథీరియం. దీని ధర మే 10న 3000 డాలర్లకు చేరుకున్నప్పుడు బుటెరిన్ నికర విలువ సుమారు 21 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈథర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 376 బిలియన్ డాలర్లుకుపై మాటే.ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈథర్ విలువ 325 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. దీంతో గత నెలలో ప్రపంచంలోనే 27 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలియనీర్‌గా విటాలిక్ బుటెరిన్ అవతరించిన సంగతి తెలిసిందే.
చదవండి: గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి
Thanks @VitalikButerin
— Sandeep - Polygon(prev Matic Network) (@sandeepnailwal) May 12, 2021
One thing we have learnt from Ethereum and @VitalikButerin is importance of community
We will not do anything which hurts any community specially the retail community involved with $SHIB
We will act responsibly!
Plz dont worry $SHIB holders. https://t.co/M4GxTR0JAn
Comments
Please login to add a commentAdd a comment