
పారిస్: కరోనా కారణంగా టోర్నీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ధమాన క్రీడాకారులను ఆదుకునేందుకు టెన్నిస్ క్రీడా పాలక మండళ్లు నడుం బిగించాయి. వారి సహాయార్థం 60 లక్షల డాలర్ల (రూ. 45.57 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్‌లతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీ కమిటీలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. 800 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ నిధితో లబ్ధి పొందే అవకాశముంది.