Grand Slam Tournament
-
సినెర్ సులువుగా...
న్యూయార్క్: ఈ ఏడాది దూకుడు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ) సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సినెర్ ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలవడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సినెర్... యూఎస్ ఓపెన్‌లో తనకు క్లిష్టతరమైన ప్రత్యర్థులు మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)లు ఇంటిముఖం పట్టడంతో టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. సినెర్తోపాటు మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. వరుస సెట్లలో... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినెర్ 6–1, 6–4, 6–2తో గంటా 53 నిమిషాల్లో క్రిస్టోఫర్ ఒ కానెల్ (ఆ్రస్టేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఏకంగా 15 ఏస్‌లు సంధించిన సినెర్, 46 విన్నర్లు కొట్టాడు. మిగతా మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఫ్లావియో కొబొలి (ఇటలీ)పై, పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 6–3, 6–7 (4/7), 6–0, 6–0తో ఇవాన్స్ (బ్రిటన్)పై, తాజా వింబుల్డన్ క్వార్టర్ ఫైనలిస్ట్, 14వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–7 (5/7), 6–3, 6–1, 7–6 (7/3)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్లో పౌలా బదోసా మహిళల సింగిల్స్‌లో 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బదోసా 6–1, 6–2తో యాఫన్ వాంగ్ (చైనా)పై గెలిచి ఐదో ప్రయత్నంలో ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ (2022), టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఐదోసీడ్ జాస్మిన్ పావ్లీని (ఇటలీ), ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–2తో 25వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై సునాయాసంగా గెలిచింది. ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–3, 6–4తో 30వ సీడ్ పుతిన్త్సెవ (కజకిస్తాన్)పై గెలుపొందగా, ఆరో సీడ్ పెగూలా (అమెరికా) 6–3, 6–3తో బోజెస్ మనెరియో (స్పెయిన్)ను ఓడించింది. మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 6–2తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా, 16వ సీడ్ లుడ్మిలా సామ్సోనొవా (రష్యా) 6–1, 6–1తో ఆష్లిన్ క్రుయెగెర్ (అమెరికా)పై నెగ్గింది. ‘మిక్స్డ్’ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియన్ భాగస్వామి అల్దిలా సుత్జియదితో కలిసి ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జంట రెండో రౌండ్లో 0–6, 7–6 (7/5), 10–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–సుత్జియది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా)–క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జంటతో తలపడుతుంది. ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న భాగస్వామి! ఇదివరకే పురుషుల డబుల్స్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ మార్సెల్ గ్రెనోలర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. -
యూఎస్ ఓపెన్‌కు జబర్ దూరం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ నుంచి 2022 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) వైదొలిగింది. భుజం గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న జబర్ వివరించింది. 2022లో కెరీర్ బెస్ట్ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా నిలిచిన జబర్ ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. వరుసగా రెండేళ్లు (2022, 2023) వింబుల్డన్ టోరీ్నలో ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచిన జబర్ ఈ సీజన్లో మొత్తం 15 టోరీ్నలు ఆడింది. అయితే ఆమె ఒక్క టోర్నీలోనూ సెమీఫైనల్ చేరలేకపోయింది.ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిన జబర్... ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో, వింబుల్డన్ టోరీ్నలో మూడో రౌండ్లో ని్రష్కమించింది. ఈనెల 26న న్యూయార్క్‌లో మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ (అమెరికా) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. -
క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు. -
French Open 2024: నేటినుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. పారిస్‌లో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ 9 జూన్ వరకు సాగుతుంది. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అందరి దృష్టీ దిగ్గజ ఆటగాడు, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్)పైనే ఉంది. తొలి రౌండ్లో అతను సోమవారం నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు.ఈ జూన్ 3న 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నాదల్ వరుస గాయాలతో ఇబ్బంది పడుతూ ఒక దశలో టోరీ్నకి దూరమయ్యేలా కనిపించాడు. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నానని, ఇది చివరి ఫ్రెంచ్ ఓపెన్ కాకపోవచ్చని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన మ్యాచ్‌లలో మహిళల సింగిల్స్‌లో లూసియా బ్రాన్జెట్టీతో 4 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నయోమీ ఒసాకా తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో జేజే వుల్ఫ్‌ను మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ ఎదుర్కొంటాడు. అయితే సీనియర్లు ఆండీ ముర్రే, స్టాన్ వావ్రింకా మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది. -
US Open 2023: 24: తగ్గేదేలే...
న్యూయార్క్: 36 ఏళ్ల వయసు వచ్చినా తన ఆటను మరింత పదునెక్కిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన జొకోవిచ్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 7–6 (7/5), 6–3తో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. 3 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. కెరీర్లో 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్‌కు తుది పోరులో మెద్వెదెవ్ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. 30 లేదా 40 షాట్లతో కూడిన ర్యాలీలను చాలాసార్లు జొకోవిచ్ పాయింట్‌తో ఫినిష్ చేయగా... కొన్నిసార్లు మెద్వెదెవ్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని రెండో గేమ్‌లోనే మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
పోటీ ఆ ఇద్దరి మధ్యే!
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ విభాగంపైనే ఉంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర పుటల్లో స్థానం సంపాదించేందుకు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పట్టుదలతో ఉన్నారు. జొకోవిచ్ విజేతగా నిలిస్తే... టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్ నెగ్గి, వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి ఈ స్పెయిన్ స్టార్ నుంచే గట్టిపోటీ ఎదురుకానుంది. కోవిడ్ టీకా వేసుకోని కారణంగా గత ఏడాది జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలు సడలించడంతో జొకోవిచ్ ఈసారి బరిలోకి దిగుతున్నాడు. -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
ముర్రే శుభారంభం
కొన్నేళ్ల క్రితం ‘బిగ్ ఫోర్’లో ఒకడిగా వెలుగొందిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ గాయాల కారణంగా గాడి తప్పింది. ‘గ్రాండ్‌స్లామ్’ విజయాల్లో జొకోవిచ్, నాదల్, ఫెడరర్ దూసుకుపోతుంటే ముర్రే మాత్రం వెనుకబడిపోయాడు. తాను పాల్గొన్న చివరి ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ముర్రే ఒక్కసారి మాత్రమే మూడో రౌండ్ వరకు వెళ్లగలిగాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ముర్రే వరుస సెట్లలో తొలి రౌండ్లో విజయం అందుకున్నాడు. న్యూయార్క్: ఈ ఏడాది ఆడుతున్న మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించాడు. సోమవారం మొదలైన టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో 2016 చాంపియన్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ ముర్రే 7–5, 6–3, 6–3తో ప్రపంచ 27వ ర్యాంకర్, 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరున్‌డొలో (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండు గంటల 41 నిమిషాలపాటు జరిగిన పోరులో ముర్రే ఆరు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చిన ముర్రే 18 సార్లు పాయింట్లు గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. 32 అనవసర తప్పిదాలు చేసిన ముర్రే 25 విన్నర్స్ కొట్టాడు. కెరీర్లో 16వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న ముర్రే 2016లో టైటిల్ సాధించి, 2008లో రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదెవ్ అలవోక విజయం పురుషుల సింగిల్స్‌లో తొలిరోజు జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. స్టెఫాన్ కొజ్లోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 6–4, 6–0తో గెలుపొందాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 10 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన అమెరికా ప్లేయర్ జేజే వుల్ఫ్ 6–4, 6–4, 6–4తో 16వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించాడు. శ్రమించి నెగ్గిన సాకరి మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ మరియా సాకరి (గ్రీస్) రెండో రౌండ్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది. తాత్యానా మరియా (జర్మనీ)తో జరిగిన తొలి రౌండ్లో సాకరి 6–4, 3–6, 6–0తో గెలిచింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–2, 6–4తో రఖిమోవా (రష్యా)పై, అలీసన్ రిస్కీ అమృత్‌రాజ్ (అమెరికా) 6–2, 6–4తో ఎలీనా యు (అమెరికా)పై విజయం సాధించారు. -
US Open 2022: సెరెనాపైనే దృష్టి
న్యూయార్క్: రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైందని ఇటీవల ప్రకటించిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నేడు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెర లేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగుసార్లు సెమీఫైనల్, మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. 2008 నుంచి యూఎస్ ఓపెన్‌లో సెరెనా కనీసం సెమీఫైనల్ దశ వరకు చేరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 80వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)తో ఆడుతుంది. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సిట్సిపాస్ (గ్రీస్), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), అల్కారజ్ (స్పెయిన్) టైటిల్ రేసులో ఉన్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం విజేతలకు 26 లక్షల డాలర్ల చొప్పున (రూ. 20 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 8:30 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మ్యాచ్‌లను సోనీ సిక్స్, సోనీ టెన్–2, సోనీ టెన్–3 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
జొకోవిచ్‌కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. -
సంచలనాలతో షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్‌లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జెబర్ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్‌తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్‌లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్‌కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. -
Australian Open: చరిత్రకు చేరువగా...
ఇద్దరు దిగ్గజాలు రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించేందుకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)తో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ గెలిస్తే... పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్, ఫెడరర్, జొకోవిచ్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతి కష్టమ్మీద గట్టెక్కిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ సెమీఫైనల్ అడ్డంకిని మాత్రం మరీ శ్రమించకుండానే దాటేశాడు. ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 6–3, 6–2, 3–6, 6–3తో నెగ్గి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 35 ఏళ్ల నాదల్ 2009లో ఏకైకసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత 2012, 2014, 2017, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. బెరెటినితో 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు 28 విన్నర్స్ కొట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ కేవలం 19 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. బెరెటిని 14 ఏస్‌లు సంధించినప్పటికీ 39 అనవసర తప్పిదాలు చేశాడు. నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. షపోవలోవ్‌తో నాలుగు గంటలకుపైగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సెట్లో నెగ్గి ఊపిరి పీల్చుకున్న నాదల్ సెమీఫైనల్లో మాత్రం బెరెటినికి ఏదశలోనూ అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో రెండుసార్లు, నాలుగో సెట్లో ఒకసారి బెరెటిని సర్వీస్‌లను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గత ఏడాది రన్నరనప్ మెద్వెదెవ్ (రష్యా) తో నాదల్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు ఒకేసారి (2019 యూఎస్ ఓపెన్ ఫైనల్) తలపడగా నాదల్ నెగ్గాడు. ఈసారీ మెద్వెదెవ్‌దే పైచేయి... ఫిలిక్స్ (కెనడా)తో 4 గంటల 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని గట్టెక్కిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో మాత్రం నాలుగు సెట్లలో విజయం రుచి చూశాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో 25 ఏళ్ల మెద్వెదెవ్ 7–6 (7/5), 4–6, 6–4, 6–1తో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో సిట్సిపాస్నే ఓడించి మెద్వెదెవ్ ఫైనల్ చేరాడు. తొలి మూడు సెట్లలో మెద్వెదెవ్కు పోటీ ఎదురైనా నాలుగో సెట్లో మాత్రం ఈ రష్యా స్టార్ ఒకే గేమ్ కోల్పోయాడు. 13 ఏస్‌లు సంధించిన మెద్వెదెవ్ 39 విన్నర్స్ కొట్టాడు. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) X కొలిన్స్ (అమెరికా) మధ్యాహ్నం గం. 2 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్ 29: ఇప్పటి వరకు తన కెరీర్లో నాదల్ చేరిన గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్. 500: హార్డ్కోర్టులపై నాదల్ నెగ్గిన మ్యాచ్‌లు. ఈ జాబితాలో ఫెడరర్ (783), జొకోవిచ్ (634) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 3: కఫెల్నికోవ్ (1999, 2000), సఫిన్ (2004, 2005) తర్వాత వరుసగా రెండేళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన మూడో రష్యా ప్లేయర్‌గా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. -
ఒసాకా అలవోకగా...
మానసిక ఆందోళనతో గత ఏడాది ఇబ్బంది పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కొత్త సంవత్సరంలో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా తొలి రౌండ్ అడ్డంకిని అలవోకగా దాటింది. అనవసర తప్పిదాలు చేసినా నిరాశకు లోనుకాకుండా నవ్వుతూ ఆడిన ఈ 14వ ర్యాంకర్ కెరీర్లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మెల్బోర్న్: తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించిన నయోమి ఒసాకా (జపాన్), యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్, 13వ సీడ్ ఒసాకా 6–3, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై, టాప్ సీడ్ బార్టీ 6–0, 6–1తో క్వాలిఫయర్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచారు. ఒసోరియాతో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 68 నిమిషాల్లో గెలిచింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఒసాకా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచిన ఒసాకా 28 అనవసర తప్పిదాలు చేసింది. సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో బార్టీ కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయింది. నాదల్ బోణీ... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, ఆరో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన నాదల్ తొలి రౌండ్లో 6–1, 6–4, 6–2తో మార్కోస్ గిరోన్ (అమెరికా)పై నెగ్గగా... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న జ్వెరెవ్ 7–6 (7/3), 6–1, 7–6 (7/1)తో అల్టామెర్ (జర్మనీ)పై గెలిచాడు. గిరోన్తో మ్యాచ్‌లో నాదల్ ఏడు ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన నాదల్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12వ సీడ్ కామెరాన్ నోరి (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతోన్న సెబాస్టియన్ కోర్డా (అమెరికా) 6–3, 6–0, 6–4తో నోరిపై గెలిచాడు. ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 4–6, 6–2, 7–6 (7/5), 6–3తో నకషిమా (అమెరికా)పై, పదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–2, 7–6 (7/3), 6–7 (5/7), 6–3తో జెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గారు. కెనిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2020 చాంపియన్, 11వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), 18వ సీడ్ కోకో గాఫ్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మాడిసన్ కీస్ (అమెరికా) 7–6 (7/2), 7–5తో కెనిన్‌ను ఓడించగా... ప్రపంచ 112వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) 6–4, 6–2తో కోకో గాఫ్‌పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–4, 7–6 (7/2)తో తాత్యానా మరియా (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) 6–4, 6–0తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
జయహో జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో తొమ్మిదోసారి ఫైనల్‌కు..
న్యూయార్క్: ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో తన అది్వతీయ ఫామ్‌ను కొనసాగిస్తూ వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–2, 6–4, 4–6, 6–2తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి తొమ్మిదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు సుదీర్ఘ ర్యాలీలు (53, 19, 22, 31, 16 షాట్లు) సాగాయి. అయితే కీలకదశలో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. ఈ సెర్బియా స్టార్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు జ్వెరెవ్ సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టినా, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ‘ఇంకొక్క మ్యాచే మిగిలి ఉంది. దానినీ జయిద్దాం. ఆ చివరి మ్యాచ్‌లో నా సర్వశక్తులూ ఒడ్డి పోరాడతా’ అని గతంలో మూడుసార్లు యూఎస్ చాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 6–4, 7–5, 6–2తో 12వ సీడ్ ఫిలిక్స్ ఉగర్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గి జొకోవిచ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో మెద్వెదేవ్పై ఆధిక్యంలో ఉన్నాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఒకేరోజు రెండు రికార్డులు సృష్టించేందుకు సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోరీ్నలలో విజేతగా నిలిచిన జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ టైటిల్ సాధిస్తే... రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) 20 చొప్పున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు. రాడుకాను చరిత్ర సృష్టించేనా? మహిళల సింగిల్స్ విభాగంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు టీనేజర్లు, అన్‌సీడెడ్ క్రీడాకారిణులు లేలా ఫెర్నాండెజ్ (కెనడా–19 ఏళ్లు), ఎమ్మా రాడుకాను (బ్రిటన్–18 ఏళ్లు) టైటిల్ పోరుకు అర్హత పొందారు. సెమీఫైనల్స్‌లో లేలా ఫెర్నాండెజ్ 7–6 (7/3), 4–6, 6–4తో రెండో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రాడుకాను 6–1, 6–4తో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఫైనల్‌కు చేరారు. ఓపెన్ శకంలో క్వాలిఫయర్ హోదాలో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా... వర్జీనియా వేడ్ (1977లో వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా రాడుకాను గుర్తింపు పొందింది. ఫైనల్లో లేలాపై రాడుకాను గెలిస్తే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. లేలా, రాడుకాను -
క్వారంటైన్‌కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్‌గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
సబలెంకాకు షాక్
పారిస్: టెన్నిస్ సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీగా జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ పెట్రా మార్టిక్ (చెక్ రిపబ్లిక్)... పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదో సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టారు. ట్యూనిషియా క్రీడాకారిణి, ప్రపంచ 35వ ర్యాంకర్ ఆన్స్ జెబర్ 7–6 (9/7), 2–6, 6–3తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేసింది. సబలెంకా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10లో ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–0తో ఇరీనా బారా (రొమేనియా)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో లెలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గగా... 13వ సీడ్ పెట్రా మార్టిక్ 7–6 (7/5), 3–6, 0–6తో లౌరా సిగెముండ్ (జర్మనీ) చేతిలో, 2017 చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా) 4–6, 3–6తో పౌలా బడోసా (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ ఆల్ట్‌మైర్ సంచలనం పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్, 186వ ర్యాంకర్ డానియల్ ఆల్ట్‌మైర్ సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో ఆల్ట్‌మైర్ 6–2, 7–6 (7/5), 6–4తో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ)పై నెగ్గాడు. తద్వారా 2000 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఐదో క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందాడు. పదో సీడ్ అగుట్ 4–6, 3–6, 7–5, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–0, 6–3, 6–2తో డానియల్ గలాన్ (కొలంబియా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. -
అజరెంకా అదరహో
న్యూయార్క్: ఏడేళ్ల విరామం తర్వాత ప్రపంచ మహిళల టెన్నిస్ వరల్డ్ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. యూఎస్ ఓపెన్ టోర్నీలో ఈ బెలారస్ ‘మమ్మీ’ క్వార్టర్ ఫైనల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 16వ సీడ్ ఎలీసె మెర్టెన్స్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ అజరెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి తన ప్రత్యర్థిని 6–1, 6–0తో చిత్తుగా ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెర్టెన్స్ తన సర్వీస్‌ను ఒక్కసారీ నిలబెట్టుకోలేకపోయింది. ఆమె సాధించిన ఒక్క గేమ్ కూడా తొలి సెట్లో అజరెంకా సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారానే రావడం గమనార్హం. మ్యాచ్ మొత్తంలో అజరెంకా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు సాధించింది. కేవలం 11 అనవసర తప్పిదాలు చేసిన ఆమె 21 విన్నర్స్ కొట్టింది. పునరాగమనం... 2016 డిసెంబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఏడు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్ టోర్నీ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో పునరాగమనం చేసింది. ఆ తర్వాత ఆమె మరో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నా మూడో రౌండ్‌ను దాటలేకపోయింది. సెరెనాను దాటితేనే.... 2012, 2013లలో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా... ఈసారి ట్రోఫీని ముద్దాడాలంటే... ముందుగా శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, ఆరుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్, తన చిరకాల ప్రత్యర్థి సెరెనా విలియమ్స్ (అమెరికా) అడ్డంకిని దాటాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందడం విశేషం. ఈసారి యూఎస్ ఓపెన్‌లో సెరెనా మూడో రౌండ్, ప్రిక్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్లో మూడు సెట్లలో తన ప్రత్యర్థులను ఓడించి తనకు 38 ఏళ్లు వచ్చినా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తోంది. థీమ్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ యూఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ 6–1, 6–2, 6–4తో 21వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచాడు. తద్వారా యూఎస్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ గుర్తింపు పొందాడు. ఫైనల్లో స్థానం కోసం మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో థీమ్ తలపడతాడు. ముఖాముఖి పోరులో థీమ్ 2–1తో ఆధిక్యంలో ఉన్నాడు. థీమ్ తన కెరీర్లో మూడుసార్లు (2018, 2019–ఫ్రెంచ్ ఓపెన్; 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడి రన్నరప్‌గా నిలిచాడు. మెద్వెదేవ్ తన కెరీర్లో ఒకసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో (2019 యూఎస్ ఓపెన్) ఫైనల్ చేరి ఓడిపోయాడు. మెద్వెదేవ్... అదే జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 7–6 (7/5)తో తన దేశానికే చెందిన పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న మెద్వెదేవ్ ఈ మ్యాచ్‌లో 16 ఏస్‌లు సంధించాడు. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మెద్వెదేవ్ రెండో సెట్లో ఒకసారి రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. తన సర్వీస్‌లో ఒక్కసారీ తన ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్ చేరే క్రమంలో మెద్వెదేవ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరో సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కరెనో బుస్టా (స్పెయిన్) తలపడతారు. ముఖాముఖి పోరులో జ్వెరెవ్ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. వీరిలో ఎవరు గెలిచినా తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుతారు. -
సెరెనాకు సువర్ణావకాశం
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో సెరెనాకు ఈ రికార్డును సమం చేసేందుకు సువర్ణావకాశం దక్కింది. కరోనా వైరస్ భయం కారణంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమంటూ మహిళల సింగిల్స్‌లో టాప్–10 ర్యాంకింగ్స్‌లోని ఆరుగురు క్రీడాకారిణులు యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు లేకపోవడంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న సెరెనా తన అనుభవాన్నంతా రంగరిస్తే 24వ గ్రాండ్ స్లామ్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. ‘డ్రా’ ప్రకారం సెరెనాకు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేరు. ఫేవరెట్ జొకోవిచ్... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, మూడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకోలేనంటూ డిఫెండింగ్ చాంపియన్, రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)... గాయం కారణంగా మాజీ చాంపియన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. జొకోవిచ్ టైటిల్ దారిలో రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అడ్డుతగిలే అవకాశం ఉంది. భారత్ నుంచి యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్‌లో సుమీత్ నాగల్... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ బరిలో ఉన్నారు. ఈసారి మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు. సోమవారం టోర్నీ ప్రారంభమవుతుండగా ఆదివారం ఎంట్రీలు ఖరారు చేసిన జాబితాలో ఉన్న ఓ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. ఆ ఆటగాడు ఫ్రాన్స్‌కు చెందిన 17వ సీడ్ బెనోయిట్ పైర్ అని నిర్ధారణ అయింది. -
100 గ్రాండ్ స్లామ్‌లు ఆడటం నా కల
న్యూఢిల్లీ: 100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాలనుకున్న తన కల కరోనా కారణంగా అనిశ్చితిలో పడిందని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. రికార్డుస్థాయిలో వరుసగా ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న తన ఆశయాన్ని కూడా కరోనా చిదిమేసిందని పేర్కొన్నాడు. తన కెరీర్‌కు ఈ ఏడాదే చివరిదని పేస్ గతంలోనే ప్రకటించాడు. ఇప్పటివరకు 97 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన పేస్ మరో మూడింటిలో పాల్గొంటే 100 గ్రాండ్‌స్లామ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే కరోనాతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల నిర్వహణపై అనిశ్చితితోపాటు ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన ఆశలు నెరవేరేలా లేవన్నాడు. ‘100 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ప్రాతినిధ్యం, ఎనిమిది ఒలింపిక్స్ క్రీడల్లో ఆడిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించడం నా ముందున్న లక్ష్యాలు. వాటిని సాధించాలని పట్టుదలతో ఉన్నా. ఒకవేళ అందుకోలేకపోయినా... ఇప్పటివరకు సాధించిన వాటిపట్ల సంతృప్తిగానే ఉంటా. లాక్డౌన్ ఎత్తేశాక 2021లో కూడా ఆడాలా? వద్దా? అనేది నా టీమ్‌తో కలిసి నిర్ణయం తీసుకుంటా’ అని పేస్ వివరించాడు. -
ప్రేక్షకుల్లేకుండా టోర్నీలు ఆడలేను
ప్రాగ్: ఖాళీ స్టేడియాల్లో ఆటకు తాను వ్యతిరేకమని చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా చెప్పింది. కరోనా మహమ్మారి విలయంతో ఇప్పుడంతా గేట్లు మూసే ఆటలపైనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మళ్లీ టెన్నిస్ పునరుద్ధరణ సందర్భంగా రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన క్విటోవా మాట్లాడుతూ ‘నాకు మరో గ్రాండ్‌స్లామ్ ఆడాలనే ఉంటుంది. కానీ ప్రేక్షకుల్లేకుండా ఆడే పరిస్థితి వస్తే... ఆటను రద్దు చేసుకోవడమే మేలని భావిస్తాను. అభిమానులే మా చోదకశక్తి. ఆ శక్తిలేని చోటును చూడాలనుకోను. అది అసలు గ్రాండ్‌స్లామ్ అనిపించుకోదు’ అని తెలిపింది. తాను మళ్లీ టెన్నిస్ క్రీడను ఒక్క చెక్ రిపబ్లిక్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. వైరస్ విస్తరిస్తుండటంతో ఈ సీజన్లో వింబుల్డన్‌ను రద్దు చేయగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. -
‘గోల్డెన్’ గ్రాఫ్...
టెన్నిస్ ప్రపంచంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయం సాధించడమే పెద్ద ఘనత. ఒక్క ట్రోఫీతోనే జీవితకాలం సంతృప్తి పొందేవారు ఎందరో. అలాంటిది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం అంటే దిగ్గజాలకు మాత్రమే సాధ్యం. చరిత్రలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను చేసి చూపించగా... వారిలో జర్మనీ స్టార్ స్టెఫీ గ్రాఫ్ ప్రదర్శన మరింత ప్రత్యేకం. 1988లో స్టెఫీ గ్రాఫ్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు అదే ఏడాది ప్రతిష్టాత్మక సియోల్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించింది. తద్వారా ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించిన ఏకైక ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. స్టెఫీ గ్రాఫ్ సృష్టించిన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ రికార్డుకు మరో ప్రత్యేకత ఉంది. స్టెఫీకి ముందు ఈ ఫీట్ చేసిన మిగతా నలుగురు 1978కి ముందు చేసినవారే. 1978 నుంచే మూడు సర్ఫేస్‌లలో గ్రాండ్‌స్లామ్ జరుగుతోంది. అప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ పచ్చికపై, యూఎస్ ఓపెన్ మట్టి కోర్టులపై జరిగేవి. తర్వాత ఈ రెండు వేదికలు కూడా హార్డ్ కోర్టులుగా (స్వల్ప తేడా ఉంటుంది) మారాయి. అలా అన్ని తరహా కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్ సాధించిన ఘనత స్టెఫీకే చెల్లింది. తర్వాతి రోజుల్లో ఇలా గెలవడం అసాధ్యంగా మారిపోవడంతో ఒకే ఏడాది కాకపోయినా... ఏదో ఒక సమయంలో గ్రాండ్‌స్లామ్ గెలవడమే గొప్పగా మారింది. దానినే టెన్నిస్ ప్రపంచం ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ అంటూ వ్యవహరించడం మొదలుపెట్టింది. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టెఫీ గ్రాఫ్ తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను 1987లో ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో సాధించింది. 1983లో తొలిసారి ‘మేజర్’ బరిలోకి దిగినా తొలి నాలుగేళ్లలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్ మాత్రమే. 1987 ఆగస్టు 17న తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్టెఫీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆపై ఆమె సాధించిన రికార్డులు, ఘనతలకు లెక్కే లేదు. నాలుగుకు నాలుగు... ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఏడాదిని మొదలుపెట్టిన స్టెఫీ ‘గ్రాఫ్’ అమిత వేగంతో ఎదురు లేకుండా దూసుకుపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 6–1, 7–6 (7/3)తో నాటి అమెరికా దిగ్గజం క్రిస్ ఎవర్ట్‌ను ఓడించి టైటిల్ అందుకుంది. టోర్నీలో ఆమె ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ఆపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో కేవలం 34 నిమిషాల్లో 6–0, 6–0తో నటాషా జ్వెరేవా (సోవియట్ యూనియన్)ను చిత్తుచిత్తుగా ఓడించింది. 1911 తర్వాత ‘డబుల్ బేగల్’తో ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. టెన్నిస్ పరిభాషలో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెట్ గెలిస్తే బేగల్ అంటారు. వింబుల్డన్‌లో స్టెఫీకి మరో విజయం దక్కింది. ఫైనల్లో స్టెఫీ 5–7, 6–2, 6–1తో వరుసగా ఆరుసార్లు (1982–87) టైటిల్ సాధించి జోరు మీదున్న మార్టినా నవ్రతిలోవా (అమెరికా)ను బోల్తా కొట్టించడంతో ఈ జర్మనీ అమ్మాయి పేరు మారుమోగిపోయింది. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీ 6–3, 3–6, 6–1తో గాబ్రియెలా సబాటిని (అర్జెంటీనా)పై నెగ్గడంతో ఆమె ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తయింది. ఒలింపిక్ వేటలో... యూఎస్ ఓపెన్ ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత ఇంత తక్కువ వ్యవధి ఉంటే ఈతరం ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో ఒలింపిక్స్‌కే చివరి నిమిషంలో డుమ్మా కొట్టేవారేమో. కానీ స్టెఫీ అలా చేయలేదు. న్యూయార్క్ నుంచి హడావుడిగా స్వదేశం వెళ్లి ఒకే ఒక రోజు విరామం తర్వాత తమ పశ్చిమ జర్మనీ దేశపు ఇతర అథ్లెట్లతో కలిసి ఒలింపిక్స్ వెళ్లే విమానం ఎక్కింది. దేశం కోసం సాధించే పతకానికి తన దృష్టిలో చాలా విలువ ఉందని ఆమె చూపించింది. గ్రాండ్‌స్లామ్ ఫామ్‌ను ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తూ దూసుకుపోయింది. ఒక్క క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఆమెకు కాస్త పోటీ ఎదురైంది. సోవియట్ యూనియన్‌కు చెందిన లారిసా సావ్చెంకోకు ఒక సెట్ చేజార్చుకొని చివరకు మ్యాచ్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమెకు మరోసారి అర్జెంటీనా అందగత్తె సబాటిని ఎదురైంది. కొద్ది రోజుల క్రితమే హోరాహోరీగా సాగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆమెను ఓడించిన గ్రాఫ్‌కు ఈసారి ఎదురులేకుండా పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్టెఫీ 6–3, 6–3తో సబాటినిపై గెలుపొంది శిఖరాన నిలిచింది. స్టెఫీ గ్రాఫ్ సాధించిన అద్భుతాన్ని పొగుడుతూ ప్రపంచ మీడియా తొలిసారి ‘గోల్డెన్ స్లామ్’ అనే పదాన్ని ఉపయోగించింది. అది ఆమె కోసమే పుట్టిందన్నట్లుగా మరో ప్లేయర్ కోసం దానిని వాడాల్సిన అవసరం లేకపోయింది. పురుషులు, మహిళల విభాగాల్లోనూ ఇప్పటికీ మరెవరూ అందుకోలేని ఘనతగా ‘గోల్డెన్‌స్లామ్’ నిలిచిపోయింది. -
క్రీడాకారుల సహాయనిధికి రూ. 45 కోట్లు
పారిస్: కరోనా కారణంగా టోర్నీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్ధమాన క్రీడాకారులను ఆదుకునేందుకు టెన్నిస్ క్రీడా పాలక మండళ్లు నడుం బిగించాయి. వారి సహాయార్థం 60 లక్షల డాలర్ల (రూ. 45.57 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్లతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీ కమిటీలు సంయుక్తంగా ఈ నిధిని ఏర్పాటు చేశాయి. 800 మంది టెన్నిస్ క్రీడాకారులు ఈ నిధితో లబ్ధి పొందే అవకాశముంది. -
క్వీన్ కెనిన్...
టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ నిష్క్రమించిన చోట... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరే క్రమంలో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ తుది సమరంలోనూ ఈ అమెరికా భామ సత్తా చాటుకుంది. తన ప్రత్యర్థి గార్బిన్ ముగురుజా ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయినప్పటికీ... ఆమెకు రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ... ఎంతో ఒత్తిడి ఉండే ‘గ్రాండ్’ టైటిల్ పోరులో తొలి సెట్ కోల్పోయి వెనుకబడినప్పటికీ... 21 ఏళ్ల సోఫియా కెనిన్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ‘నేను గెలవగలను’ అని గట్టిగా విశ్వసిస్తూ అద్భుత ఆటతీరుతో అనూహ్యంగా పుంజుకొని... తదుపరి రెండు సెట్లలో ముగురుజాకు ముచ్చెమటలు పట్టిస్తూ... ‘గ్రాండ్’గా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని విజయ దరహాసం చేసింది. మెల్బోర్న్: చివరిదాకా గెలవాలనే కసి ఉంటే... ప్రత్యర్థి ఏ స్థాయి వారైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... చాంపియన్‌గా అవతరించవచ్చొని అమెరికా యువతార సోఫియా కెనిన్ నిరూపించింది. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్నప్పటికీ... తొలి సెట్ చేజార్చుకున్నప్పటికీ... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తుదకు సోఫియా కెనిన్ ‘గ్రాండ్’ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. విజేత సోఫియా కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►తాజా ‘గ్రాండ్’ విజయంతో సోఫియా సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకుతుంది. ఇప్పటివరకు అమెరికా నంబర్‌వన్‌గా ఉన్న సెరెనా విలియమ్స్‌ను వెనక్కి నెట్టి సోఫియా ఆ స్థానాన్ని ఆక్రమించనుంది. ►ముగురుజాతో జరిగిన ఫైనల్లో కెనిన్ తొలి సెట్లో తడబడింది. 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా సుదీర్ఘంగా సాగిన మూడో గేమ్‌లో మూడో ప్రయత్నంలో కెనిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అదే జోరులో 52 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకొని కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సాగింది. ►అయితే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కెనిన్ తొలి సెట్ చేజార్చుకున్నా కంగారు పడలేదు. తొలి సెట్లో చేసిన తప్పిదాలను సరిచేసుకున్న కెనిన్ రెండో సెట్లో ముగురుజాను తన శక్తివంతమైన గ్రౌండ్షాట్లతో ఇబ్బంది పెట్టింది. నాలుగో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌లను బ్రేక్ చేసిన కెనిన్ 32 నిమిషాల్లో రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. ►నిర్ణాయక మూడో సెట్లో కెనిన్ ఆటతీరు మరింత మెరుగు పడగా... ముగురుజా ఆట అనవసర తప్పిదాలతో గాడి తప్పింది. ఆరో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెనిన్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన కెనిన్ సెట్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ►ఈ విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. రన్నరప్ ట్రోఫీతో ముగురుజా నా కల నిజమైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మీరూ కలలు కనండి. ఎందుకంటే కలలు నిజమవుతాయి. గత రెండు వారాలు నా జీవితంలోనే అత్యుత్తమ క్షణాలు. నా గుండె లోతుల్లోంచి చెబుతున్నా మీరంటే (ప్రేక్షకులు) నాకెంతో ప్రేమాభిమానాలు. మీ అందరికీ ధన్యవాదాలు. నేను గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించేందుకు నాన్న, కోచ్ అలెగ్జాండర్, ఆయన శిక్షణ బృందం ఎంతగానో కష్టపడింది. ఆఖరికి మా ఇన్నేళ్ల కష్టం ఫలించింది. మా అమ్మకు మూఢనమ్మకాలెక్కువ. అందుకే తను నా మ్యాచ్‌ల్ని చూడదు. చూస్తే ఏదైనా కీడు జరుగుతుందనే బెంగ ఆమెకు... అందుకే మ్యాచ్ అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్పా. నేను గెలిచానని! అప్పుడే ఆమె మనసు కుదుటపడుతుంది. అమ్మా నేను కప్‌తో ఇంటికొస్తున్నాను. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వని హగ్ (ఆలింగనం) ఇవ్వాలి. –సోఫియా కెనిన్ -
సెరెనా సాఫీగా...
కొన్ని నెలలుగా ‘కంగారూ’ను దహించి వేస్తున్న కార్చిచ్చు సెగ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కూ తగిలింది. దీంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ముందు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. ఇది చాలదన్నట్లు తర్వాత వర్షం కూడా ఓ చేయి వేయడంతో కోర్టులు వెలవెలబోయాయి. స్టార్ ప్లేయర్లు ఫెడరర్, సెరెనా సాఫీగా తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ యాష్లే బార్టీ మాత్రం శ్రమించాల్సి వచ్చింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆట ఆగమయ్యేలా ఉంది. ఏస్‌లు, విన్నర్స్లతో హోరెత్తాల్సిన కోర్టుల్లో ఆటగాళ్లు దగ్గు, ఆస్తమాతో విలవిలలాడే పరిస్థితి రావొచ్చు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో దిగ్గజ క్రీడాకారులంతా తొలి రౌండ్లో సాఫీగానే ముందంజ వేశారు. కానీ మ్యాచ్‌లే ముందుముందు సాఫీగా సాగవేమో! మహిళల సింగిల్స్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో ఉన్న అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ కేవలం 58 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. సెరెనా 6–0, 6–3తో అనస్తాసియా పొటపొవా (రష్యా)ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెరెనాకిది 350వ విజయం కావడం విశేషం. సెరెనా మొత్తం తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–4తో చెక్ రిపబ్లిక్కు చెందిన మేరి బౌజ్కొవాను ఓడించింది. టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 5–7, 6–1, 6–1తో సురెంకొ (ఉక్రెయిన్)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–0తో తన దేశానికే చెందిన సినియకోవాపై, వొజ్నియాకి (డెన్మార్క్) 6–1, 6–3తో క్రిస్టీ అన్ (అమెరికా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–3, 6–2, 6–2తో స్టీవ్ జాన్సన్ (అమెరికా)పై అలవోక విజయం సాధించాడు. రెండో సీడ్, జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/5), 6–2, 2–6, 6–1తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై శ్రమించి నెగ్గాడు. కోరి గౌఫ్ మళ్లీ... అమెరికా వెటరన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ 15 ఏళ్ల టీనేజర్ గండాన్ని ఇక్కడా గట్టెక్కలేకపోయింది. అమెరికా యువ క్రీడాకారిణి కోరి గౌఫ్ తొలి రౌండ్లో 7–6 (7/5), 6–3తో 39 ఏళ్ల వీనస్‌కు మళ్లీ షాకిచ్చింది. గతేడాది వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లోనూ గౌఫ్ తొలి రౌండ్లోనే వీనస్‌ను కంగుతినిపించింది. ఇప్పుడు ఇక్కడా... అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 1998లో వీనస్ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడినపుడు కోరి గౌఫ్ ఇంకా పుట్టనే లేదు. ప్రజ్నేశ్ మ్యాచ్ నేటికి వాయిదా భారత టాప్ ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్ మ్యాచ్ మంగళవారానికి వాయిదా పడింది. జపాన్ ప్రత్యర్థి తత్సుమా ఇటోతో సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల నేటికి వాయిదా పడింది. జపాన్ ప్లేయర్‌పై గెలిస్తే ప్రపంచ 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌కు రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జొకోవిచ్ ఎదురుపడనున్నాడు. క్వాలిఫయర్స్‌లో లక్కీ లూజర్‌గా భారత ఆటగాడు మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. సవ్యంగా సాగేది అనుమానమే! సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కార్చిచ్చు దావానలంలా అంతకంతకూ వ్యాపిస్తోంది. పట్టణాలను, నగరాలను పొగ కమ్మేస్తోంది. మంగళవారం కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు వాయిదాలు తప్పవు. అధికారుల నిర్వాకం కూడా ఆటగాళ్లను చిర్రెత్తిస్తోంది. టోర్నీ అధికారుల తీరుపై ఫెడరర్ మండిపడ్డాడు. సరైన సమాచారం ఎవరూ ఇవ్వడం లేదని విమర్శించాడు. దట్టమైన పొగ, ప్రతికూల వాతావరణం వల్ల ఫెడరర్ గత వారం ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. క్వాలిఫయింగ్‌లోనే ఈ పరిస్థితి తలెత్తినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించలేదు. స్లోవేనియాకు చెందిన దలీలా జకుపోవిచ్ దగ్గుతో ఆడలేక క్వాలిఫయింగ్ మ్యాచ్ నుంచి రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకుంది. ముందు పొగ... తర్వాత వాన... అసలే కార్చిచ్చు పొగతో మ్యాచ్‌లు ఆలస్యమయ్యాయంటే... కొన్ని మ్యాచ్‌లు జరిగాయోలేదో ఈసారి వర్షం ముంచెత్తింది. దీంతో కొన్ని కోర్టుల్లో మ్యాచ్‌లే జరగలేదు. షెడ్యూలు ప్రకా రం మొదటి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 18 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. తొలిరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులతో దిగ్గజ క్రీడాకారులు ఫెడరర్, సెరెనా, డిఫెండింగ్ చాంపియన్ ఒసాకా తదితరులు ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల కాసేపు ఫెడరర్ కోర్టును వీడాల్సి వచ్చింది. కోర్టు తడిసి పోకుండా స్టేడియం పైకప్పును మూసి వేయించారు. -
ఒకరి వెంట ఒకరు...
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. యూఎస్ ఓపెన్‌లో ఆదివారం ఒక్కరోజే మహిళల సింగిల్స్ టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఓడిపోయారు. నాలుగో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గిన కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ గార్సియా (ఫ్రాన్స్), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లో... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. మూడో రౌండ్లో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 3–6, 6–3, 6–3తో కెర్బర్‌పై, 22వ సీడ్ షరపోవా (రష్యా) 6–3, 6–2తో ఒస్టాపెంకోపై, 30వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 5–7, 6–4, 7–6 (7/4)తో గార్సియాపై, 26వ సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–1తో క్విటోవాపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లో నిష్క్రమించగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. జర్మనీ ప్లేయర్ కోల్‌ష్రైబర్ 6–7 (1/7), 6–4, 6–1, 6–3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. ఫెడరర్ 6–4, 6–1, 7–5తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, జొకోవిచ్ 6–2, 6–3, 6–3తో గాస్కే (ఫ్రాన్స్)పై గెలిచారు. -
ఒస్టాపెంకో నిష్క్రమణ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో కాటరీనా కొజ్లోవా (ఉక్రెయిన్) 7–5, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 13 డబుల్ ఫాల్ట్‌లు, 48 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించడం 2005 (మిస్కినా–రష్యా) తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా తొలి రౌండ్లోనే ఓడింది. వాంగ్ కియాంగ్ (చైనా) 6–4, 7–5తో వీనస్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) రెండో రౌండ్‌కు చేరారు. -
సిబుల్కోవా అవుట్
పురుషుల డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు ∙వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)... పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్లో ఇంటిదారి పట్టారు. సిబుల్కోవా 6–7 (3/7), 6–3, 4–6తో 27వ సీడ్ అనా కొంజూ (క్రొయేషియా) చేతిలో... నిషికోరి 4–6, 6–7 (3/7), 6–3, 3–6తో 18వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. ప్రిక్వార్టర్స్‌లో నాదల్ పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో నాదల్ 6–1, 6–4, 7–6 (7/3)తో 30వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, సిలిచ్ 6–4, 7–6 (7/3), 6–4తో 26వ సీడ్ జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. గురువారం ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/0), 6–3, 6–2తో లాజోవిక్ (సెర్బియా)పై గెలిచాడు. హలెప్ ముందంజ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–4, 7–6 (9/7)తో షుయె పెంగ్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–5తో వితోయిఫ్ట్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–1తో సకారి (గ్రీస్)పై, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 13వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 7–5తో కామిల్లా గియోర్గి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 3–6, 6–1, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శరణ్ జంట పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా ద్వయం 3 గంటల 31 నిమిషాల్లో 3–6, 4–6, 6–4, 7–6 (8/6), 8–10తో ఏడో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7 (6/8), 3–6, 7–6 (7/5), 3–6తో కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–యిఫాన్ జు (చైనా) జోడీ 7–5, 3–6, 2–6తో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–రలూకా ఒలారూ (రొమేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
అటు ముర్రే... ఇటు కెర్బర్
ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్స్‌కు చుక్కెదురు l మిషా, కోకో వాండెవె సంచలన విజయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం పెను సంచలనాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 5–7, 6–2, 6–4తో ఆండీ ముర్రేను బోల్తా కొట్టించగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 35వ ర్యాంక్ కోకో వాండెవె 6–2, 6–3తో కెర్బర్‌ను మట్టికరిపించింది. 2004లో ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులు ప్రిక్వార్టర్స్లోపే ఓడిపోవడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని ఐదుసార్లూ రన్నరప్ట్రోఫీతోనే సరిపెట్టుకున్న ముర్రేకు ఈసారి కూడా ఈ టోర్నీ కలిసిరాలేదు. జొకోవిచ్ రెండో రౌండ్లోనే ఓడిపోవడంతో ముర్రేకు ఈసారి టైటిల్ మార్గం సుగమం అయిందని భావించినా... మిషా జ్వెరెవ్ రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. ముర్రేతో 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన మిషా ఏకంగా 118 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 65 సార్లు పాయింట్లు సాధించడం విశేషం. కేవలం 26 అనవసర తప్పిదాలు చేసిన మిషా ఎనిమిదిసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. కెర్బర్తో 68 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కోకో ఏదశలోనూ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రెండు సెట్లలో రెండేసిసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో తన కెరీర్లో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఫెడరర్... మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మరోసారి స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఫెడరర్ 6–7 (4/7), 6–4, 6–1, 4–6, 6–3తో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 24 ఏస్‌లు సంధించి, ఏడుసార్లు నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/2), 7–6 (7/4), 7–6 (7/4)తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6–7 (4/7), 6–2, 6–4, 6–4తో ఇవాన్స్ (బ్రిటన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ముగురుజా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), 13వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగురుజా 6–2, 6–3తో సొరాని క్రిస్టియా (రొమేనియా)పై, వీనస్ 6–3, 7–5తో మోనా బార్తెల్ (జర్మనీ)పై, పావ్లీచెంకోవా (రష్యా) 6–3, 6–3తో కుజ్నెత్సోవాపై గెలిచారు. సానియా–స్ట్రికోవా జంటకు షాక్ మహిళల డబుల్స్ విభాగం మూడో రౌండ్లో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్)–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 3–6, 6–2, 2–6తో ఎరి హోజుమి–మియు కాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6–4, 6–3తో డెస్టానీ ఐయివా– పోల్మన్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. -
అయ్యో... నాదల్
పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోని ఈ స్పెరుున్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదు సెట్ల మ్యాచ్‌లో ఓడిపోయాడు. 4 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్, 22 ఏళ్ల లుకాస్ పురుు (ఫ్రాన్స) 6-1, 2-6, 6-4, 3-6, 7-6 (8/6)తో నాదల్‌ను ఓడించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఓటమితో నాదల్ 2004 తర్వాత తొలిసారి ఒకే ఏడాది ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోకుండా గ్రాండ్‌స్లామ్ సీజన్‌ను ముగించడం జరిగింది. ‘నేను కుర్రాడిగా ఉన్నపుడు ఆర్థర్ యాష్ స్టేడియంలో నాదల్ ఆడిన అన్ని మ్యాచ్‌లను చూశాను. ఈరోజు అతణ్నే ఓడించాను’అని పురుు అన్నాడు. పురుు విజయంతో 1947 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముగ్గురు ఫ్రాన్స ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఫ్రాన్సకే చెందిన సోంగా, మోన్ఫిల్స్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. 25 ఏళ్ల తర్వాత...: ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6-3, 3-2తో ఆధిక్యంలో ఉన్న దశలో థీమ్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో 25 ఏళ్ల తర్వాత డెల్‌పొట్రో (142వ ర్యాంక్) రూపంలో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరిసారి 1991లో జిమ్మీ కానర్స్ (174వ ర్యాంక్) ఈ ఘనత సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-2, 6-2తో 22వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-1, 6-7 (5/7), 6-3తో మర్చెంకో (ఉక్రెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 7-6 (7/4)తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. భారత్‌కు రానున్న నాదల్ స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ఈనెల 16 నుంచి 18 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడే స్పెరుున్ జట్టును మంగళవారం ప్రకటించారు. -
సరి లేరు 'సెరెనా' కెవ్వరూ!
►గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా రికార్డు ►308 విజయాలతో అగ్రస్థానంలోకి ఫెడరర్‌ను దాటిన అమెరికన్ స్టార్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 307 విజయాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సెరెనా 308వ విజయంతో బద్దలు కొట్టింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి రికార్డుస్థారుులో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. న్యూయార్క్: కొత్త మ్యాచ్... కొత్త ప్రత్యర్థి.. అరుునా ఫలితంలో మార్పు లేదు. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ జోరులో పదును తగ్గలేదు. రికార్డుస్థారుులో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-3తో యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)పై గెలిచింది. కేవలం 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ష్వెదోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన ఈ అమెరికన్ స్టార్ ప్రత్యర్థికి ఒక్కసారి కూడా బ్రేక్ పారుుంట్ అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా నెట్‌వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పారుుంట్లు నెగ్గి పైచేరుు సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా)తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. గత తొమ్మిదేళ్లలో సెరెనా యూఎస్ ఓపెన్‌లో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం: గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఎవరికీ సాధ్యంకాని విజయాల రికార్డును సాధించిన సెరెనా ‘గ్రాండ్’ ప్రస్థానం 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలైంది. ఆ ఏడాది జనవరి 19న జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6-7 (5/7), 6-3, 6-1తో ఇరీనా స్పిర్లియా (రొమేనియా)పై గెలిచి తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని నమోదు చేసింది. అరుుతే తర్వాతి మ్యాచ్‌లోనే సెరెనాకు తన అక్క వీనస్ చేతిలో పరాజయం ఎదురుకావడం గమనార్హం. గత 18 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన సెరెనా పలు రికార్డులను తిరగరాసి ఇప్పటికీ తన కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. వీనస్‌కు ప్లిస్కోవా షాక్: ఒకవైపు చెల్లెలు సెరెనా ‘గ్రాండ్’ రికార్డు విజయం నమోదు చేయగా... మరోవైపు అక్క వీనస్ విలియమ్స్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వీనస్ 6-4, 4-6, 6-7 (3/7)తో ఓడిపోరుుంది. ప్లిస్కోవా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్)కు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ అనా కొంజు (క్రొయేషియా) 6-4, 6-4తో రద్వాన్స్కాపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6-2, 7-5తో 11వ సీడ్ కార్లా నవారో (స్పెరుున్) పై గెలిచింది. సెమీస్‌లో కెర్బర్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గతేడాది రన్నరప్, ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ)తో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 7-5, 6-0తో గెలిచింది. యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి చేరడం కెర్బర్కిది రెండోసారి. ‘మరిన్ని విజయాలు సాధిస్తా’ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ రికార్డు ఎవరి పేరు మీద నిలుస్తుందో వేచి చూడాలని సెరెనా అంటోంది. ‘నాకై తే తెలియదు. వేచి చూద్దాం. నాతోపాటు ఫెడరర్‌కు కూడా ఈ అవకాశం ఉంది. నేను ఓ ప్రణాళికతో ముందుకు సాగుతాను. ఫెడరర్ కూడా అలాగే చేస్తాడేమో’ అని సెరెనా వ్యాఖ్యానించింది. గత ఆగస్టులో ఫెడరర్ 35 ఏళ్లు పూర్తి చేసుకోగా... ఈనెల 26న సెరెనాకు 35 ఏళ్లు నిండుతారుు. ‘నా వరకై తే 308 సంఖ్య చాలా గొప్పది. ఇంతకాలంపాటు టెన్నిస్ ఆడతానని ఊహించలేదు. ఇంత నిలకడగా ఆడుతున్నందుకు గర్వంగా అనిపిస్తోంది. నా ఆటను ఎప్పుడు నిలిపేస్తానో కచ్చితంగా చెప్పలేను. ఈ క్షణాలను నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను’ అని సెరెనా తెలిపింది. -
అతడు... ఆమె... వింబుల్డన్
► మరో టైటిల్‌పై జొకోవిచ్ కన్ను ►రికార్డు విజయం సెరెనా లక్ష్యం ►నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకున్న ఉత్సాహంలో ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత దిశగా అడుగులు వేస్తున్న జొకోవిచ్... కొత్త తరం రాకతో కనుమరుగు కాకముందే రికార్డు టైటిల్ వేటలో సెరెనా... పూర్వ వైభవం కోసం ఫెడరర్, సొంతగడ్డపై మరో విజయం కోసం ఆండీ ముర్రే... సంచలనాలపై ఆశతో జూనియర్లు... అందరికీ పచ్చటి పచ్చిక కోర్టు స్వాగతం పలుకుతోంది. మేజర్ టోర్నీలలో అందరూ మనసు పడే వింబుల్డన్ సమయం వచ్చేసింది. లండన్: ఏడాదిలో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌కు రంగం సిద్ధమైంది. గ్రాస్‌కోర్టు వేదికగా తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సై అంటున్నారు. నేడు (సోమవారం) ప్రారంభం కానున్న ఈ చరిత్రాత్మక టోర్నీ జూలై 10 వరకు సాగుతుంది. డిఫెండింగ్ చాంపియన్లు జొకోవిచ్, సెరెనా విలియమ్స్ మరోసారి టాప్ సీడ్లుగా బరిలోకి దిగుతున్నారు. నం. 13 కోసం... వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ మరోసారి టోర్నీలో ఫేవరెట్‌గా నిలిచాడు. 2014, 2015లలో ఇక్కడ టైటిల్ సాధించిన అతను హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టాడు. తాజా ఫామ్, గత రెండు గ్రాండ్‌స్లామ్‌లలో అద్భుత విజయాల అనంతరం జొకోవిచ్‌ను అడ్డుకోవడం ఏ ఆటగాడి వల్లా అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే 12 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన సెర్బియా స్టార్ వేగంగా ఆల్‌టైమ్ గ్రేట్ ఫెడరర్ (17) టైటిల్స్‌కు చేరువవుతున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం 1969లో రాడ్ లేవర్ తర్వాత ఎవరి వల్లా కాలేదు. తన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్, ప్రపంచ 177వ ర్యాంకర్ జేమ్స్ వార్డ్తో తలపడుతున్నాడు. ఏ మాత్రం ఒత్తిడిలో లేని జొకోవిచ్ ఆదివారం లండన్‌లో పబ్లిక్ ట్రైన్లలో విహరిస్తూ సరదాగా గడపడం విశేషం. ముర్రే ఆశలు... మూడేళ్ల క్రితం వింబుల్డన్ నెగ్గి సొంత అభిమానుల చిరకాల కల నెరవేర్చిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత రెండుసార్లు ఇక్కడ అతను క్వార్టర్స్, సెమీస్‌లో నిష్ర్కమించాడు. జొకోవిచ్‌కు పోటీ ఇవ్వగల సత్తా ఉన్నా ఇటీవల అతని చేతిలో వరుసగా ఓడటం ఆత్మవిశ్వాసం దెబ్బ తీసింది. జొకోవిచ్‌తో జరిగిన గత 15 మ్యాచ్‌లలో అతను 13 సార్లు ఓడాడు. అయితే స్వదేశంలో మరో విజయం కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాత కోచ్ లెండిల్‌తో మరో సారి ముర్రే జతకట్టాడు. గత వారం సన్నాహక టోర్నీ క్వీన్స్ క్లబ్ గెలవడంతో అతనిలో కాస్త జోష్ పెరిగింది. మొదటి రౌండ్లో బ్రిటన్‌కే చెందిన లియామ్ బ్రాడీ ని అతను ఎదుర్కొంటాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్ మణికట్టు గాయంతో టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకోగా... వావ్రింకా, నిషికోరి, గాస్కే, రావ్‌నిచ్ టాప్-10 సీడిం గ్లో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆటగాళ్లు. సెరెనా సాధించేనా... రొబెర్టా విన్సీ, కెర్బర్, ముగురుజా... గత మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెరెనా విలియమ్స్‌ను చిత్తు చేసిన క్రీడాకారిణులు. సరిగ్గా ఏడాది క్రితం వింబుల్డన్ గెలిచాక సెరెనా విలియన్స్ గ్రాండ్‌స్లామ్ విజయాల సంఖ్య 21కి చేరింది. మరో టైటిల్ గెలిస్తే సెరెనా ఆల్‌టైమ్ రికార్డు స్టెఫీగ్రాఫ్‌ను సమం చేసేది. కానీ అనూహ్యంగా తర్వాతి మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఆమె ఓటమి పాలైంది. ఇప్పుడు 34 ఏళ్ల వయసులో సెరెనా మరోసారి రికార్డు కోసం పోరాడుతోంది. ఫామ్ గొప్పగా లేకపోవడంతో పాటు యువ తరంగాల రాకతో ఆమె వెనుకబడింది. పైగా ఫ్యాషన్ ప్రపంచంలో ఎక్కువగా కనిపించడం, పాప్ ఆల్బంలో భాగం కావడంతో ఆమెకు ఆటపై ఆసక్తి తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి సత్తా చాటాల్సి ఉంది. ఈసారి ఓడితే ఇక పవర్ గేమ్‌కు దాదాపు ముగింపు వచ్చినట్లే. సెరెనా విలియ మ్స్‌కు ప్రధానంగా రద్వాన్‌స్కా, ముగురుజా, కెర్బర్, హలెప్, క్విటోవాల నుంచి పోటీ ఎదురవుతోంది. ఫెడరర్ సంగతేంటి... రోజర్ ఫెడరర్ అంటే ఒకప్పుడు వింబుల్డన్‌కు పర్యాయపదం. గ్రాస్‌కోర్టుపై అతని వైట్డ్రస్లాగే ఆట కూడా వెలిగిపోయేది. ఏకంగా ఏడు సార్లు అతను ఇక్కడ విజేతగా నిలిచాడు. అయితే 2012లో ఇక్కడ టైటిల్ నెగ్గిన తర్వాత మూడేళ్లు అతనికి చుక్కెదురైంది. గత రెండు సార్లు అతను ఫైనల్లోనే జొకోవిచ్ చేతిలో ఓడాడు. 34 ఏళ్ల వయసులో ఫెడరర్ మరో టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను ఫిట్నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. ఇదే కారణంగా గత ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా దూరమయ్యాడు. అసలు 2012 వింబుల్డన్ తర్వాత అతను మరో గ్రాండ్‌స్లామ్ గెలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు అతని సన్నాహాలు కూడా బాగా లేవు. వరుసగా రెండు గ్రాస్‌కోర్టు టోర్నీలు స్టట్గార్ట్, హాలేలలో సెమీఫైనల్స్‌లో ఇద్దరు అనామకుల చేతిలో ఓడాడు. ఈ పరిస్థితుల్లో అతను ఏ మాత్రం పోటీ ఇవ్వగలడనేది చూడాలి. తొలి మ్యాచ్‌లో అతను గైడో పెలా (అర్జెంటీనా)తో తలపడతాడు. -
16 ఏళ్ల తర్వాత...
ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం దెబ్బ సోమవారం మ్యాచ్‌లన్నీ రద్దు పారిస్: వారం రోజులుగా సంచలన ఫలితాలతో సాగుతోన్న టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో సోమవారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక రోజు ఒక్క మ్యాచ్ కూడా సాధ్యపడకపోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2000లో మే 30వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్‌లో వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ జరగలేదు. నిషికోరి కూడా అవుట్: ఆదివారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరో సంచలనం నమోదైంది. ఐదో సీడ్ కీ నిషికోరి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-2, 4-6, 6-2తో నిషికోరిని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో గాస్కే; రామోస్ (స్పెయిన్)తో వావ్రింకా తలపడతారు. -
ఇవనోవిచ్ ఇంటికి...
► మూడో రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్ ► ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా, వీనస్ పారిస్: కొంతకాలంగా ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశే మిగిలింది. గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా బ్యూటీ ఈసారి మాత్రం మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 2008 చాంపియన్, 14వ సీడ్ ఇవనోవిచ్ శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 4-6, 4-6తో 24వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఇవనోవిచ్, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 29 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 7-6 (12/10)తో 26వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో పార్మెంటియర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7-6 (7/5), 1-6, 6-0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 6-4, 3-6, 6-1తో 22వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై, పుతింత్సెవా (కజకిస్తాన్) 6-1, 6-1తో కరీన్ (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), 13వ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెరర్ 6-4, 7-6 (8/6), 6-1తో 21వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, థీమ్ 6-7 (4/7), 6-3, 6-3, 6-3తో జ్వెరెవ్ (జర్మనీ)పై నెగ్గారు. మరోవైపు ఆరో సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) గాయంతో మూడో రౌండ్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. గుల్బిస్ (లాత్వియా)తో జరి గిన మూడో రౌండ్లో సోంగా తొలి సెట్లో 5-2తో ఆధిక్యంలో ఉన్నపుడు గాయం కారణంగా నిష్ర్కమించాడు. క్వార్టర్ ఫైనల్లో పేస్-హింగిస్ జంట మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్) -హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో పేస్-హింగిస్ ద్వయం 2-6, 7-5, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’ లో నాలుగో సీడ్ ష్వెదోవా (కజకిస్తాన్)- మెర్జియా (రుమేనియా) జోడీపై గెలిచింది. -
మళ్లీ గట్టెక్కిన ముర్రే
► రెండో రౌండ్లోనూ ఐదు సెట్ల పోరులో నెగ్గిన బ్రిటన్ స్టార్ ► మూడో రౌండ్లో వావ్రింకా, నిషికోరి ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: క్లే కోర్టులపై కూడా సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడి, విజయం సాధించే సత్తా తనలో ఉందని బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే మరోసారి నిరూపించుకున్నాడు. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రెండో సీడ్ ప్లేయర్ వరుసగా రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరులో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ‘వైల్డ్ కార్డు’ ఆటగాడు మథియాస్ బుర్గూతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 6-2, 2-6, 4-6, 6-2, 6-3తో నెగ్గి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు 45 అనవసర తప్పిదాలు చేశాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. రాడెక్ స్టెపానెక్‌తో జరిగిన తొలి రౌండ్లోనూ ముర్రే ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ నిషికోరి (జపాన్), తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో వావ్రింకా 7-6 (9/7), 6-3, 6-4తో డానియల్ (జపాన్)పై, నిషికోరి 6-3, 6-3, 6-3తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై, గాస్కే 6-1, 7-6 (7/3), 6-3తో ఫ్రాటెన్జెలో (అమెరికా)పై గెలిచారు. ముగురుజా ముందుకు మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ హలెప్ (రుమేనియా), రెండో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ముగురుజా 6-2, 6-0తో మిర్టిలి జార్జెస్ (ఫ్రాన్స్)పై, హలెప్ 7-6 (7/5), 6-2తో దియాస్ (కజకిస్తాన్)పై, రద్వాన్‌స్కా 6-2, 6-4తో గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-1తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై, 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 6-1, 6-3తో హితెర్ వాట్సన్ (బ్రిటన్)పై నెగ్గారు. -
నాదల్కు షాక్
తొలి రౌండ్లోనే ఓడిన స్పెయిన్ స్టార్ * మారథాన్ మ్యాచ్‌లో వెర్డాస్కో సంచలనం * రెండో సీడ్ హలెప్‌కు చుక్కెదురు * వీనస్, అండర్సన్ కూడా ఇంటిముఖం * ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్: గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు కొత్త ఏడాదీ కలసిరాలేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ మాజీ చాంపియన్ అనూహ్యంగా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. స్పెయిన్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారుడు ఫెర్నాండో వెర్డాస్కో అద్వితీయ ఆటతీరును కనబరిచి ఐదో సీడ్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. 4 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఈ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ వెర్డాస్కో 7-6 (8/6), 4-6, 3-6, 7-6 (7/4), 6-2తో నాదల్‌ను కంగుతినిపించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో నాదల్‌తో 5 గంటల 14 నిమిషాలపాటు పోరాడి ఓడిపోయిన వెర్డాస్కో ఈసారి చిరస్మరణీయ ప్రతీకారం తీర్చుకున్నాడు. * తన కెరీర్లో ఇప్పటివరకు 44 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన నాదల్ రెండోసారి మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో నిష్ర్కమించాడు. ఇంతకుముందు అతను 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోయాడు. * నాదల్‌తో జరిగిన పోరులో 33 ఏళ్ల వెర్డాస్కో 20 ఏస్‌లు సంధించి, 10 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన వెర్డాస్కో తర్వాతి రెండు సెట్లను కోల్పోయాడు. నాలుగో సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో వెర్డాస్కో ఆరంభంలోనే సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనుకబడ్డాడు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వెర్డాస్కో ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి నాదల్ ఓటమిని ఖాయం చేశాడు. * కెరీర్లో వరుసగా 51వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతోన్న వెర్డాస్కో ఈ మ్యాచ్‌లో 90 విన్నర్స్ కొట్టడంతోపాటు నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ఏకంగా 91 అనవసర తప్పిదాలు చేసినా వెర్డాస్కో విజయాన్ని దక్కించుకోవడం విశేషం. నాదల్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 38 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. * నాదల్‌తోపాటు 11వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), 20వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. రాజీవ్ రామ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 6-7 (4/7), 7-6 (7/4), 3-6, 0-3తో వెనుకబడిన దశలో మోకాలి గాయం కారణంగా వైదొలిగాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న అండర్సన్ ఈ మ్యాచ్‌లో పలు తప్పిదాలు చేసి అసహనంతో తన రాకెట్‌ను నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. చెన్నై ఓపెన్‌లో చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మరో మ్యాచ్‌లో ముల్లర్ (లక్సెంబర్గ్) 7-6 (8/6), 7-6 (9/7), 6-7 (5/7), 7-6 (7/1)తో ఫాగ్నినిపై గెలిచాడు. ముర్రే, వావ్రింకా ముందంజ మరోవైపు రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), పదో సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 13వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ముర్రే 6-1, 6-2, 6-3తో జ్వెరెవ్ (జర్మనీ)పై, ఫెరర్ 6-4, 6-4, 6-2తో గొజోసిక్ (జర్మనీ)పై, ఇస్నెర్ 6-3, 7-6 (9/7), 6-3తో జనోవిక్ (పోలండ్)పై, రావ్‌నిక్ 6-1, 6-4, 6-4తో పౌలీ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... వావ్రింకా 7-6 (7/2), 6-3తో రెండు సెట్లు గెలిచాక అతని ప్రత్యర్థి తుర్సునోవ్ (రష్యా) వైదొలిగాడు. జాంగ్ షుయె సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఎనిమిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) అనూహ్యంగా తొలి రౌండ్లోనే పరాజయాన్ని చవిచూశారు. చైనా క్వాలిఫయర్ జాంగ్ షుయె 6-4, 6-3తో ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్‌ను కంగుతినిపించగా... జోనా కొంటా (బ్రిటన్) 6-4, 6-2తో వీనస్‌ను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-0, 6-4తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఏడో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-7 (4/7), 7-6 (8/6), 6-3తో మిసాకి దోయ్ (జపాన్)పై, తొమ్మిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 6-4తో బిరెల్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. 14వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-0, 6-0తో వాన్ ఉట్వాంక్ (బెల్జియం)ను చిత్తు చేయగా... 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-3, 7-5తో సినియాకోవా (చెక్ రిపబ్లిక్)పై, 19వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-3, 6-3తో హెర్కాగ్ (స్లొవేనియా)పై, 20వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-2, 6-3తో తామీ ప్యాటర్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. -
మ్లాడెనోవిచ్ మెరుపులు
ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు అంతగా పేరులేని ప్రత్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. యువతారల ధాటికి టాప్-20 సీడింగ్స్ నుంచి కేవలం నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. అనామక క్రీడాకారిణులను తక్కువ అంచనా వేయకూడదని నిరూపిస్తూ... ఫ్రాన్స్ అమ్మాయి క్రిస్టినా మ్లాడెనోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ ఎకతెరీనా మకరోవాను ఇంటిదారి పట్టించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. - 13వ సీడ్ మకరోవాపై సంచలన విజయం - తొలిసారి ‘గ్రాండ్‌స్లామ్’ క్వార్టర్స్‌లోకి వీనస్‌తో సెరెనా అమీతుమీ - యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: సమకాలీన మహిళల టెన్నిస్‌లో సీడింగ్ లేకున్నా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసే పరిస్థితి కనిపించడంలేదు. యూఎస్ ఓపెన్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈసారి అన్‌సీడెడ్ క్రీడాకారిణులు అదరగొట్టే ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా 22 ఏళ్ల క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) అద్భుత పోరాటంతో ఆకట్టుకొని 13వ సీడ్ మకరోవా (రష్యా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మ్లాడెనోవిచ్ 7-6 (7/2), 4-6, 6-1తో మకరోవాపై గెలిచింది. తొలి రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించిన మ్లాడెనోవిచ్ అదే జోరును కొనసాగిస్తూ తన కెరీర్లో 20వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. రెండు గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మ్లాడెనోవిచ్ నిర్ణాయక మూడో సెట్లో చెలరేగి ఆడింది. మకరోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-3, 6-4తో లెప్చెంకో (అమెరికా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ వేటలో టాప్ సీడ్ సెరెనా (అమెరికా) దూసుకుపోతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6-3, 6-3తో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా)తో సెరెనా తలపడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వీనస్ 6-2, 6-1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై గెలిచింది. జొకోవిచ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్), 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6-3, 4-6, 6-4, 6-3తో అగుట్ (స్పెయిన్)పై, లోపెజ్ 6-3, 7-6 (7/5), 6-1తో ఫాగ్నిని (ఇటలీ)పై, సోంగా 6-4, 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. క్వార్టర్స్‌లో సానియా ద్వయం మహిళల డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 6-3, 6-0తో మిచెల్లా క్రాయిసెక్ (నెదర్లాండ్స్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 6-7 (4/7), 6-4, 6-3తో నెస్టర్ (కెనడా)-వాసెలిన్ (ఫ్రాన్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. -
తొలిరౌండ్లోనే ఓడిన ఇవనోవిచ్
- ఏడో సీడ్‌కు షాక్ ఇచ్చిన సిబుల్కోవా - యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 3-6, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిబుల్కోవా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ... ఇనోవిచ్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ఇవనోవిచ్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడటం ఇవనోవిచ్కిది రెండోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఈ సెర్బియా సుందరి తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 13వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-3తో తెలియానా పెరీరా (బ్రెజిల్)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 14వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 17వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో గాఫిన్ 6-4, 6-1, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, దిమిత్రోవ్ 6-4, 6-2, 6-4తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. నేటి మ్యాచ్‌లు రాత్రి గం. 8.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెరెనాను ఆపతరమా!
వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి గెలిస్తే రెండోసారి ఈ ఘనత నేటి నుంచి వింబుల్డన్ టోర్నమెంట్ మూడు పదుల వయసు దాటినా వన్నె తగ్గని ఆటతీరుతో అలరిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టింది. సోమవారం మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో ఈ నల్లకలువ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మూడు వారాల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తి ఫిట్‌గా లేకున్నా... ప్రతికూల పరిస్థితులను అధిగమించి సెరెనా టైటిల్ నెగ్గిన తీరు అబ్బురపరిచింది. చివరిసారి 2012లో వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన సెరెనా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి మాత్రం ఆమె విన్నర్స్ ట్రోఫీతో తిరిగి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లండన్: గతేడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూ ఎస్ ఓపెన్... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన సెరెనా విలియమ్స్ రెండోసారి అరుదైన ఘనత సాధించేందుకు సంసిద్ధమైంది. నేడు మొదలయ్యే వింబుల్డన్ టోర్నమెంట్లో ఈ అమెరికా స్టార్ విజేతగా నిలిస్తే రెండోసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుం ది. తొలి రౌండ్లో క్వాలిఫయర్ మార్గరీటా గ్యాస్పర్యాన్ (రష్యా)తో ఆడనున్న 33 ఏళ్ల సెరెనాకు ఈ టోర్నీలో నాలుగో సీడ్ షరపోవా (రష్యా), రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ క్వి టోవా (చెక్ రిపబ్లిక్)ల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. అయితే తన కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆమె అదే జోరును కొనసాగిస్తే మాత్రం ఆరోసారి విం బుల్డన్ చాంపియన్‌గా నిలిచే అవకాశాలున్నాయి. సెరెనా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేని యా), ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఆరో సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), 18వ సీడ్ లిసికి (జర్మనీ)లను కూడా తక్కువ అంచనా వేయలేము. ఆ నలుగురిపైనే...: పురుషుల సింగిల్స్ విభాగానికొస్తే మళ్లీ ఆ నలుగురు (జొకోవిచ్, ఫెడరర్, నాదల్, ఆండీ ముర్రే) అగ్రశ్రేణి క్రీడాకారులపైనే అందరి దృష్టి ఉంది. 2012లో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించలేకపోయాడు. ఈ ఏడాది ఈ స్విస్ దిగ్గజం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఫెడరర్ అన్ని రకాల కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) ఆడి ఐదు టైటిల్స్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు, వింబుల్డన్‌కు మధ్య తగినంత విరామం దొరకడంతో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పూర్తిస్థాయిలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమయ్యానని ఫెడరర్ అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అనూహ్యంగా ఓడి ‘కెరీర్ స్లామ్’ ఘనతను అందుకోలేకపోయిన జొకోవిచ్ వింబుల్డన్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. తన కెరీర్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ వింబుల్డన్‌తో పూర్వ వైభవాన్ని అందుకోవాలని... సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకోవాలని ఆండీ ముర్రే పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ నలుగురిని కాదని ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) వింబుల్డన్‌లోనూ సంచలనం సృష్టిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ వింబుల్డన్‌లో వావ్రింకా రికార్డు అంత గొప్పగా లేదు. 30 ఏళ్ల ఈ స్విస్ స్టార్ గతంలో ఏనాడూ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన వావ్రింకా అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను వింబుల్డన్‌లో ఏదశ వరకు దూసుకెళ్తాడో వేచి చూడాలి. ఈ ఐదుగురు కాకుండా నిషికోరి (జపాన్), బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), రావ్‌నిక్ (కెనడా), సోంగా (ఫ్రాన్స్)లు కూడా సంచలనం సృష్టించే అవకాశముంది. నేటి ముఖ్య మ్యాచ్‌లు (తొలి రౌండ్) పురుషుల సింగిల్స్ జొకోవిచ్ (1) కోల్‌ష్రైబర్ వావ్రింకా (4) జోవో సౌసా నిషికోరి (5) సిమోన్ బొలెలీ రావ్‌నిక్ (7) డానియల్ ట్రావెర్ మహిళల సింగిల్స్ సెరెనా (1) మార్గరీటా షరపోవా (4) జోనా కోంటా సఫరోవా (6) అలీసన్ రిస్కీ ఇవనోవిచ్ (7) యి ఫాన్ జు ఈ ఏడాది వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 18 లక్షల 80 వేల పౌండ్ల (రూ. 18 కోట్ల 79 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. రెండు వారాలపాటు జరిగే ఈ టోర్నీలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 662 మ్యాచ్‌లు జరుగుతాయి. వింబుల్డన్ ఆవరణలో మొత్తం 41 గ్రాస్కోర్టులు ఉన్నాయి. మ్యాచ్‌లకు 19 కోర్టులు వాడతారు. మిగతా 22 కోర్టులను ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. ఫైనల్ మ్యాచ్‌లు జరిగే వేదిక సెంటర్ కోర్టులో ప్రేక్షకుల సామర్థ్యం 15 వేలు టోర్నీ సమయంలో క్రీడాకారుల కోసం 15 వేల అరటి పండ్లను అందుబాటులో ఉంచుతారు. టోర్నీ సందర్భంగా మొత్తం 54,250 కొత్త టెన్నిస్ బంతులను వినియోగిస్తారు. టోర్నీ కోసం 250 మంది బాల్ బాయ్స్‌ను ఎంపిక చేస్తారు. ప్రేక్షకుల కోసం దాదాపు లక్షన్నర స్ట్రాబెర్రీలను అందుబాటులో ఉంచుతారు. -
నొవాక్ ‘జై’కొట్టేనా!
►కెరీర్ స్లామ్‌పై సెర్బియా స్టార్ గురి ►ఫేవరెట్‌గా బరిలోకి నాదల్ నుంచే అసలు ముప్పు ►నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి ‘కెరీర్ స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును తగ్గలేదని నిరూపించుకునేందుకు రోజర్ ఫెడరర్... ఈ ముగ్గురు స్టార్లకు తానేమీ తీసిపోనని చాటిచెప్పేందుకు ఆండీ ముర్రే... ఈ నేపథ్యంలో టెన్నిస్ సీజన్‌లోని రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారం తెరలేవనుంది. ► గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన రాఫెల్ నాదల్‌ను కాకుండా ఈసారి ఫేవరెట్‌గా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను పరిగణిస్తుండటం విశేషం. ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉండటం, క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌నే ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన వారికే ఈసారి టైటిల్ ఖాయమని టెన్నిస్ పండితులు అంచనా వేస్తున్నారు. ► ఇప్పటికే తన కెరీర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఖాతాలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మాత్రమే చేరాల్సి ఉంది. పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియా స్టార్ రెండు సార్లు రన్నరప్ (2014, 2012)గా నిలువడంతోపాటు నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్ ఐదు టైటిల్స్ సాధించడమే కాకుండా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ► మరోవైపు పదేళ్ల తర్వాత తొలిసారి టాప్-5 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయిన నాదల్ ఈ ఏడాది కేవలం ఒక టైటిల్ మాత్రమే సాధించాడు. ఫామ్‌ను లెక్కలోకి తీసుకొని నాదల్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ► జొకోవిచ్, నాదల్, ముర్రే ఒకే పార్శ్వంలో ఉండటంతో 2009 చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు ఈసారి సునాయాసమైన ‘డ్రా’ పడిందనే చెప్పాలి. స్థాయికి తగ్గట్టు ఆడితే ఫెడరర్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ అలెజాంద్రో ఫలా (కొలంబియా)తో ఫెడరర్ తలపడనున్నాడు. మిగతా తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్సెల్ (టర్కీ)తో ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), పాల్ హెన్రీ మాథ్యూ (ఫ్రాన్స్)తో ఐదో సీడ్ నిషికోరి (జపాన్), లిండెల్ (స్వీడన్)తో 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) ఆడనున్నారు. ► మహిళల విభాగానికొస్తే కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా (రష్యా), మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. ► ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 18 లక్షల యూరోల (రూ. 12 కోట్ల 58 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. -
క్విటోవా, హలెప్ అవుట్
అదే దారిలో కెర్బర్, వీనస్ - యూఎస్ ఓపెన్ న్యూయార్క్: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మూడో రౌండ్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల విభాగంలో టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్న రెండో సీడ్ సిమోన హలెప్, మూడో సీడ్ పెట్రా క్విటోవాతో పాటు ఆరో సీడ్ ఆంజెలిక్ కెర్బర్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ (19వ సీడ్) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. దీంతో టాప్-10 సీడెడ్ క్రీడాకారిణుల నుంచి ఐదుగురు ఇంటిముఖం పట్టినట్లయింది. ఇప్పటికే రద్వాన్‌స్కా, ఇవనోవిచ్ కూడా ఓడారు. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో క్విటోవా 4-6, 3-6 తేడాతో అలెగ్జాండ్రా క్రూనిక్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఈ ఏడాది వింబుల్డన్ గెలుచుకున్న క్విటోవా... కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న 143వ ర్యాంకర్ క్రూనిక్పై తన స్థాయికి తగ్గ ఆటతీరును చూపలేకపోయింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హలెప్ (రొమేనియా) 6-7 (6/8), 2-6తో 32 ఏళ్ల క్వాలిఫయర్ మిర్జానా లూసిక్-బరోని (క్రొయేషియా)పై వరుస సెట్లలో ఓడింది. 17 ఏళ్ల స్విస్ సంచలనం బెలిండా బెన్సిక్ 6-1, 7-5తో ఆరో సీడ్ కెర్బర్ (జర్మనీ)ను కంగుతినిపించింది. 13వ సీడ్ సారా ఎర్రానీ 6-0, 0-6, 7-6 (7/5)తో వీనస్ విలియమ్స్‌ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో రష్యా బ్యూటీ షరపోవా 6-2, 6-4తో లిసికి (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-0 లార్సన్ (స్వీడన్)పై, 10వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-2తో పెట్కోవిక్ (జర్మనీ)పై నెగ్గారు. మూడో రౌండ్‌కు జకోవిచ్, ఫెడరర్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విస్) తమ జోరును కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో మాజీ చాంప్ ఫెడరర్ 6-4, 6-4, 6-4తో గ్రోత్ (ఆసీస్)పై గెలిచి మూడో రౌండ్లో ప్రవేశించాడు. ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్) 6-3, 4-6, 6-2, 3-6, 6-3 కిజాన్ (స్లొవేకియా)పై, ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-1, 6-2, 6-2తో సేల (ఇజ్రాయిల్)పై గెలిచారు. జకోవిచ్ 6-1, 6-3, 6-0 మథియు (ఫ్రాన్స్)పై, ఆండీ ముర్రే 6-3, 6-3, 6-4 బాచింగర్ (జర్మనీ)పై, ఐదో సీడ్ రవోనిక్ (కెనడా) 7-6 (7/4), 5-7, 6-4, 7-6 (7/3) గోజోవిజిక్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4 నెడొవ్యెసోవ్ (కజకిస్థాన్)పై పైచేయి సాధించారు. పేస్, స్టెఫానెక్ ముందంజ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, స్టెఫానెక్ (చెక్) జోడి 7-6, 6-3 తేడాతో లు (తైపీ), వెసెలీ (చెక్)పై నెగ్గింది. మూడో రౌండ్‌కు సానియా జోడి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి మూడో రౌండ్లోకిప్రవేశించింది. రెండో రౌండ్లో ఈ మూడో సీడ్ జంట 6-1, 6-2 తేడాతో గార్సియా (ఫ్రాన్స్)-నికోలెస్క్యూ (రొమేనియా)పై సునాయాసంగా నెగ్గింది. రెండు సెట్లలోనూ ప్రత్యర్థి నుంచి సానియా జోడికి ఏమాత్రం ప్రతిఘటన ఎదురులేదు.