
ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. పారిస్‌లో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ 9 జూన్ వరకు సాగుతుంది. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అందరి దృష్టీ దిగ్గజ ఆటగాడు, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్)పైనే ఉంది. తొలి రౌండ్‌లో అతను సోమవారం నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు.
ఈ జూన్ 3న 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నాదల్ వరుస గాయాలతో ఇబ్బంది పడుతూ ఒక దశలో టోరీ్నకి దూరమయ్యేలా కనిపించాడు. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నానని, ఇది చివరి ఫ్రెంచ్ ఓపెన్ కాకపోవచ్చని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన మ్యాచ్‌లలో మహిళల సింగిల్స్‌లో లూసియా బ్రాన్‌జెట్టీతో 4 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నయోమీ ఒసాకా తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో జేజే వుల్ఫ్‌ను మూడో సీడ్ కార్లోస్ అల్‌కరాజ్ ఎదుర్కొంటాడు. అయితే సీనియర్లు ఆండీ ముర్రే, స్టాన్ వావ్రింకా మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment