Clay court
-
French Open 2024: నేటినుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. పారిస్‌లో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ 9 జూన్ వరకు సాగుతుంది. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అందరి దృష్టీ దిగ్గజ ఆటగాడు, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్)పైనే ఉంది. తొలి రౌండ్లో అతను సోమవారం నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు.ఈ జూన్ 3న 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నాదల్ వరుస గాయాలతో ఇబ్బంది పడుతూ ఒక దశలో టోరీ్నకి దూరమయ్యేలా కనిపించాడు. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నానని, ఇది చివరి ఫ్రెంచ్ ఓపెన్ కాకపోవచ్చని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన మ్యాచ్‌లలో మహిళల సింగిల్స్‌లో లూసియా బ్రాన్జెట్టీతో 4 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నయోమీ ఒసాకా తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో జేజే వుల్ఫ్‌ను మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ ఎదుర్కొంటాడు. అయితే సీనియర్లు ఆండీ ముర్రే, స్టాన్ వావ్రింకా మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది. -
మళ్లీ ఓడిన నాదల్
రోమ్: గాయంనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టిన తర్వాత రాణించలేకపోతున్న టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు మరో పరాజయం ఎదురైంది. గత వారమే మాడ్రిడ్ ఓపెన్‌లో ఓడిన నాదల్ ఇప్పుడు ఇటాలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ క్లే కోర్టు టోర్నీలో 10 సార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్‌పై 6–1, 6–3 స్కోరుతో వరల్డ్ నంబర్ 9 హ్యూబర్ట్ హర్కాజ్ (పోలండ్) ఘన విజయం సాధించాడు.గత ఏడాదిన్నర కాలంలో నాదల్ టాప్–10 ర్యాంకుల్లో ఉన్న ఆటగాడితో తలపడటం ఇదే మొదటిసారి. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4 గేమ్‌లే గెలవడం అతని పరిస్థితిని చూపిస్తోంది. తాజా ప్రదర్శన తాను ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే విషయంపై సందేహాలు లేవనెత్తుతోందని మ్యాచ్ ముగిసిన తర్వాత నాదల్ వ్యాఖ్యానించాడు. -
14వ టైటిల్ వేటలో...‘స్టెయిన్లెస్ స్టీల్’ నాదల్
పారిస్: 100 విజయాలు, కేవలం 2 పరాజయాలు, 13 టైటిల్స్... ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ సాధించిన అత్యద్భుత ఘనత ఇది. ఎర్రమట్టిపై తనకే సాధ్యమైన జోరును కొనసాగించి మరో టోర్నీ గెలిస్తే అతను టెన్నిస్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాడు. 20 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో ఫెడరర్గా సమంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్...21వ టైటిల్‌తో ఒక్కడే శిఖరాన నిలుస్తాడు. అయితే తనకు అచ్చొచ్చిన మైదానంలో కూడా ఓటమి ఎదురు కావచ్చని, ఆటలో ఎక్కడా, ఎవరూ అజేయులు కాదని నాదల్ వ్యాఖ్యానించాడు. ‘కొద్ది రోజుల క్రితమే క్లే కోర్టుపైనే మాంటెకార్లో, మాడ్రిడ్ టోర్నీలలో నేను ఓడాను. రోలండ్ గారోస్‌లో మాత్రం ఓడిపోరాదని కోరుకుంటున్నా. నా శక్తి మేరకు పోరాడటమే నేను చేయగలిగింది’ అని చెప్పాడు. జూన్ 3న 35వ పుట్టిన రోజు జరుపుకోనున్న నాదల్... ఇంత కాలం ఆడగలనని పదేళ్ల క్రితం అనుకోలేదన్నాడు. ‘పదేళ్ల క్రితం నేను వరుస గాయాలతో బాధపడ్డాను. అసలు ఎంత కాలం ఆడతానో చెప్పలేని పరిస్థితి. అయితే రెండేళ్ల క్రితం మాత్రం నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. కెరీర్‌ను మరికొన్నేళ్లు పొడిగించుకోవచ్చని అనిపించింది. 2005నుంచి ఇప్పటి వరకు ఇంత సుదీర్ఘ కాలం టాప్–10 కొనసాగడం గర్వంగా అనిపిస్తోంది’ అని ఈ స్పెయిన్ స్టార్ గుర్తు చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 2009 రాబిన్ సొదర్లింగ్ చేతిలో పరాజయం పాలైన నాదల్, 2015లో జొకోవిచ్ చేతిలో ఓడాడు. తర్వాతి ఏడాది గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. ‘రోలండ్ గారోస్‌కు నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన 13 టైటిల్స్‌లో ఏది ఇష్టమంటే చెప్పలేను. ప్రతీ దానికి ఒక్కో విశిష్టత ఉంది. మళ్లీ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నెగ్గాలని అనుకుంటున్నా’ అని ఈ దిగ్గజ ఆటగాడు తన మనసులో మాట చెప్పాడు. ఒకే పార్శ్వంలో ముగ్గురు దిగ్గజాలు 14వ టైటిల్ వేటలో నాదల్కు కఠినమైన డ్రా ఎదురైంది. టాప్ సీడ్ నాదల్‌తో పాటు వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్, స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ కూడా ఒకే పార్శ్వంలో ఉండటం విశేషం. ముందంజ వేయాలంటే నాదల్ ఇటీవల క్లే కోర్టుల్లో విశేషంగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను దాటాల్సి ఉంటుంది. ఎలాంటి సంచలనాలు లేకుండా అంతా సాఫీగా సాగితే పురుషుల క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో రుబ్లెవ్ తలపడే అవకాశం ఉండగా...జొకోవిచ్, ఫెడరర్ మధ్య క్వార్టర్స్‌లోనే పోరు జరగనుంది. ఫ్రెంచ్ ఓపెన్‌కు పర్యాయపదంగా మారిన రాఫెల్ నాదల్‌ను నిర్వాహకులు సముచిత రీతిలో గౌరవించారు. రోలండ్ గారోస్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నాదల్ స్టెయిన్లెస్ స్టీల్ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. నాదల్ ప్రధాన బలమైన ‘ఫోర్ హ్యాండ్’ షాట్ పోజులో ఈ 3 మీటర్ల విగ్రహం కనిపిస్తుంది. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ శిల్పి జోర్డీ డి ఫెర్నాండెజ్ దీనిని రూపొందించారు. రాతి, ఇనుము, చెక్క, మట్టి తదితర వస్తువులతో ప్రయత్నించిన తర్వాత చివరకు నాదల్ విగ్రహాన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేయాలని ఆయన నిర్ణయించారు. -
హిట్.. హిట్.. ముర్రే
మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ సొంతం ⇒ ‘క్లే కింగ్’ నాదల్‌పై ఘనవిజయం ⇒ రెండు వారాల్లో రెండో టైటిల్ మాడ్రిడ్: క్లే కోర్టులపై తొలి టైటిల్ సాధించేందుకు పదేళ్లపాటు నిరీక్షించిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఊహించనివిధంగా వారం తిరిగేలోపు రెండో టైటిల్ సాధించి ఆశ్చర్యపరిచాడు. ‘క్లే కోర్టు’లపై తిరుగులేని రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి నెగ్గడం ఇక్కడ విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-2తో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై నెగ్గి విజేతగా నిలిచాడు. గతవారం మ్యూనిచ్ ఓపెన్‌లోనూ ముర్రే చాంపియన్‌గా నిలిచి తన కెరీర్లో తొలిసారి క్లే కోర్టులపై టైటిల్ సాధించాడు. ఏప్రిల్ 11న తన చిన్ననాటి స్నేహితురాలు కిమ్ సియర్స్‌ను వివాహం చేసుకున్నాక ముర్రే ఆడిన రెండు టోర్నీల్లోనూ టైటిల్స్ నెగ్గ డం విశేషం. విజేతగా నిలిచిన ముర్రేకు 7,99,450 యూరోల (రూ. 5 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పదేళ్ల తర్వాత ‘ఐదు’ బయటకు నాదల్ మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయిన రాఫెల్ నాదల్ ర్యాంకింగ్స్‌లోనూ పడిపోయాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ స్పెయిన్ స్టార్ నాలుగు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోయాడు. 2005 తర్వాత నాదల్ టాప్-5 ర్యాంకుల్లో లేకపోవడం ఇదే తొలిసారి. జొకోవిచ్ (సెర్బియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆండీ ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.