మళ్లీ ఓడిన నాదల్‌ | Nadal lost again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన నాదల్‌

Published Sun, May 12 2024 4:36 AM | Last Updated on Sun, May 12 2024 4:36 AM

Nadal lost again

రోమ్‌: గాయంనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టిన తర్వాత రాణించలేకపోతున్న టెన్నిస్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌కు మరో పరాజయం ఎదురైంది. గత వారమే మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఓడిన నాదల్‌ ఇప్పుడు ఇటాలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఈ క్లే కోర్టు టోర్నీలో 10 సార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్‌పై 6–1, 6–3 స్కోరుతో వరల్డ్‌ నంబర్‌ 9 హ్యూబర్ట్‌ హర్కాజ్‌ (పోలండ్‌) ఘన విజయం సాధించాడు.

గత ఏడాదిన్నర కాలంలో నాదల్‌ టాప్‌–10 ర్యాంకుల్లో ఉన్న ఆటగాడితో తలపడటం ఇదే మొదటిసారి.  93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ 4 గేమ్‌లే గెలవడం అతని పరిస్థితిని చూపిస్తోంది. తాజా ప్రదర్శన తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే విషయంపై సందేహాలు లేవనెత్తుతోందని మ్యాచ్‌ ముగిసిన తర్వాత నాదల్‌  వ్యాఖ్యానించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement