న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో అందరి దృష్టి పురుషుల సింగిల్స్ విభాగంపైనే ఉంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)... 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర పుటల్లో స్థానం సంపాదించేందుకు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పట్టుదలతో ఉన్నారు.
జొకోవిచ్ విజేతగా నిలిస్తే... టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్ నెగ్గి, వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి ఈ స్పెయిన్ స్టార్ నుంచే గట్టిపోటీ ఎదురుకానుంది. కోవిడ్ టీకా వేసుకోని కారణంగా గత ఏడాది జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలు సడలించడంతో జొకోవిచ్ ఈసారి బరిలోకి దిగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment