![Former finalist Jabeur withdraws from US Open](/styles/webp/s3/article_images/2024/08/24/1212.jpg.webp?itok=euAKD-XU)
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ నుంచి 2022 రన్నరప్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) వైదొలిగింది. భుజం గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న జబర్ వివరించింది. 2022లో కెరీర్ బెస్ట్ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా నిలిచిన జబర్ ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. వరుసగా రెండేళ్లు (2022, 2023) వింబుల్డన్ టోరీ్నలో ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచిన జబర్ ఈ సీజన్‌లో మొత్తం 15 టోరీ్నలు ఆడింది. అయితే ఆమె ఒక్క టోర్నీలోనూ సెమీఫైనల్ చేరలేకపోయింది.
ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో ఓడిన జబర్... ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో, వింబుల్డన్ టోరీ్నలో మూడో రౌండ్‌లో ని్రష్కమించింది. ఈనెల 26న న్యూయార్క్‌లో మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ (అమెరికా) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment