అయ్యో... నాదల్
పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోని ఈ స్పెరుున్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదు సెట్‌ల మ్యాచ్‌లో ఓడిపోయాడు. 4 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్, 22 ఏళ్ల లుకాస్ పురుు (ఫ్రాన్‌స) 6-1, 2-6, 6-4, 3-6, 7-6 (8/6)తో నాదల్‌ను ఓడించి తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఓటమితో నాదల్ 2004 తర్వాత తొలిసారి ఒకే ఏడాది ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోకుండా గ్రాండ్‌స్లామ్ సీజన్‌ను ముగించడం జరిగింది. ‘నేను కుర్రాడిగా ఉన్నపుడు ఆర్థర్ యాష్ స్టేడియంలో నాదల్ ఆడిన అన్ని మ్యాచ్‌లను చూశాను. ఈరోజు అతణ్నే ఓడించాను’అని పురుు అన్నాడు. పురుు విజయంతో 1947 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముగ్గురు ఫ్రాన్‌స ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఫ్రాన్‌సకే చెందిన సోంగా, మోన్‌ఫిల్స్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
25 ఏళ్ల తర్వాత...: ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6-3, 3-2తో ఆధిక్యంలో ఉన్న దశలో థీమ్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో 25 ఏళ్ల తర్వాత డెల్‌పొట్రో (142వ ర్యాంక్) రూపంలో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. చివరిసారి 1991లో జిమ్మీ కానర్స్ (174వ ర్యాంక్) ఈ ఘనత సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-2, 6-2తో 22వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-1, 6-7 (5/7), 6-3తో మర్చెంకో (ఉక్రెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 7-6 (7/4)తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
భారత్‌కు రానున్న నాదల్
స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు రానున్నాడు. ఈనెల 16 నుంచి 18 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడే స్పెరుున్ జట్టును మంగళవారం ప్రకటించారు.