
ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పెట్రా క్విటోవా
మెల్‌బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ కోసం మెల్‌బోర్న్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్‌గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్‌లో ఒక్కరు పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్‌బోర్న్‌కు తీసుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment