special flight
-
హజ్ యాత్ర ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం)/ఏఎన్‌యూ:విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి బుధవారం పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. 170 మందితో కూడిన హజ్ యాత్రికుల తొలి బృందం ప్రత్యేక విమానంలో జెడ్డాకు బయలుదేరింది. అంతకుముందు గుంటూరు జిల్లా నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో యాత్రికులు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం.. హజ్ యాత్ర విమానాన్ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజమ్, ఇతర మత పెద్దలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందన్నారు. గతంలో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారన్నారు. దీనివల్ల యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు పంపించేందుకు చర్యలు తీసుకుందన్నారు. దీని వల్ల యాత్రికులపై రూ.83 వేల చొప్పున అదనపు భారం పడుతుండటంతో.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం జగన్ వెంటనే స్పందించి వారిపై భారం పడకుండా రూ.14.51 కోట్లు విడుదల చేశారని చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఈసారి మొత్తం 1,814 మంది హజ్ యాత్రకు వెళ్లిరానున్నారని వివరించారు. ఏపీతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హజ్ యాత్రికులను అంజాద్ బాషా కోరారు. తాము ఇబ్బంది పడకుండా అదనపు భారం భరించడంతో పాటు అన్ని హంగులతో ప్రభుత్వం వసతి కేంద్రం ఏర్పాటు చేసిందని యాత్రికులు చెప్పారు. తమకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యాత్రికులకు డిప్యూటీ సీఎం, హజ్ కమిటీ చైర్మన్ తదితరులు డ్రై ఫ్రూట్స్, గొడుగులు అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జఖియా ఖానం, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు రహుల్లా, ఇషాక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సలహాదారు హబీబుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్పోర్ట్ భద్రతాధికారి వెంకటరత్నం, డీఎస్పీ జయసూర్య, హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ బాసిత్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
మణిపూర్ లో ఏపీ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్
-
బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
సాక్షి, న్యూఢిల్లీ: బుకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. విద్యార్థులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్‌కు అధికారులు తరలించారు. వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ భవన్లో వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 219 ముందితో తొలి విమానం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు.. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు: విద్యార్థులు ‘‘పశ్చిమ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. రొమేనియా సరిహద్దు దాటి, బస్సులో బుకారెస్ట్ విమానాశ్రయం చేరుకున్నాం. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు. మా యూనివర్సిటీ అధికారులు ఆందోళన వద్దని, పరీక్షలు రాసిన తర్వాత వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. మేము టికెట్లు బుక్ చేసుకుని కూడా ఉపయోగం లేకపోయింది. అక్కడి వాతావరణం బావుంటుంది. ప్రజలు బావుంటారు. అలాంటి దేశంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. యుద్ధం మొదలైందన్న వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత్‌పై కాలుమోపడం ఆనందంగా ఉంది. ఢిల్లీ నుంచి మా ఇంటికి చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారని’’ విద్యార్థులు అన్నారు. -
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం.. వారు ఏమన్నారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య భారత పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. 242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులను, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉక్రెయిన్‌కు వెళ్లిన ప్రత్యేక విమానంలో భారత్‌కు చెందిన 242 మంది ప్రయాణికులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామని విదేశాంగశాఖ సహాయమంతి మురళీధరన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. (ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడు.. పుతిన్ సవాల్ చేస్తున్నారా అంటూ..) #WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine reaches Delhi pic.twitter.com/ctuW0sA7UY — ANI (@ANI) February 22, 2022 ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడంఎంతో ఉపశమనంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే వారు ఆనందం వ్యక్తం చేశారు. #WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine landed at Delhi airport as tensions escalate pic.twitter.com/HHryuWt7i9 — ANI (@ANI) February 22, 2022 -
అఫ్గన్ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రత్యేక విమానం
సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చింది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపుతామని అధికారులు తెలిపారు. భారతీయుల కిడ్నాప్ కలకలం అఫ్గన్‌లో దాదాపు 150 మందిని తాలిబన్లు అపహరించారని, వారిలో చాలామంది భారతీయులు ఉన్నారంటూ శనివారం వెలువడిన వార్తలు కలకలం రేపాయి. వాస్తవానికి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద విమానం కోసం ఎదురు చూస్తున్న భారతీయులను అఫ్గన్ పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించి, ధ్రువపత్రాలను పరిశీలించి, మళ్లీ వదిలేసినట్లు తేలింది. ప్రస్తుతం వారంతా కాబూల్ ఎయిర్‌పోర్టులో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాబూల్ నగరంలోని భారతీయులెవరికీ ఇప్పటిదాకా ఎలాంటి హాని జరగలేదని స్థానిక అధికారులు చెప్పారు. కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న 150 మందిని తాలిబన్లు అడ్డగించి, అపహరించారని తొలుత ‘కాబూల్ నౌ’ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది. కొన్ని గంటల తర్వాత బందీలంతా విడుదలయ్యారని, ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్తున్నారని ప్రకటించింది. చదవండి : అమెరికా నావికాదళ అధికారుల మానవత్వం.. ఆ పాప మళ్లీ నవ్వింది..! -
క్వారంటైన్‌కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్‌గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
మనసు గెలుచుకున్న ధోని
-
అభిమానుల మనసు గెలుచుకున్న ధోని
దుబాయ్ : భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని అభిమానుల మనసు మరోసారి గెలుచుకున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనేందుకు జట్లన్నీ దుబాయ్‌కు చేరుకుంటున్నాయి. కాగా ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది. జట్టుతో పాటే సీఎస్కే మేనేజర్ కె జార్జ్ జాన్ కూడా వెళ్లారు. అయితే విమాన ప్రయాణంలో ధోనితో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశాన్ని జార్జ్ తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి : 'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం') ధోనికి కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటులో తనను కూర్చోబెట్టి.. ధోని మాత్రం ఎకానమీ సీటులో వెళ్లి కూర్చున్నాడని జార్జ్ పేర్కొన్నాడు. ఇదే విషయం ధోనిని అడిగితే..' మీ కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి.. మీకు ఎకానమీ క్లాస్ సీటు సరిపోదు.. వచ్చి నా బిజినెస్ క్లాస్ సీటులో కూర్చొండి.. నేను వెళ్లి మీ సీటులో కూర్చుంటా అని చెప్పాడు. తన సహచరులతో కలిసి కూర్చునేందుకే ధోని ఇదంతా చేశాడని జార్జ్ ఫన్నీగా పేర్కొన్నాడు. జార్జ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ధోని ఎప్పుడైనా కూల్‌గానే ఉంటాడు.. ధోని లాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు కోల్‌కతా నైటరైడర్స్, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లు ముందే చేరుకోగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్‌కి చేరుకున్నాయి. మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్13వ సీజన్లో మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు.(చదవండి : అతను ఉంటే వరల్డ్‌కప్ గెలిచేవాళ్లం: రైనా) -
సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. (చదవండి: నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను) Phase -2 india ➡️ Phillipines. I hope you are ready to be with your families❣️ I have lined up the flight from Manila to Delhi on 14 Aug at 7:10 pm SG9286. Can’t wait you to board and get you home. Have sent you the link❣️🙏 — sonu sood (@SonuSood) August 12, 2020 ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ ట్వీట్ చేస్తూ.. ‘‘భారత్-పిలిప్పీన్స్.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే సోనూ సూద్ ఫిలిప్పీన్స్‌కు విమానాన్ని పంపించడం ఇది రెండవ సారి. కొన్నిరోజుల కిందట మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కజకస్థాన్లో చిక్కుకున్న మన తెలుగు వారి కోసం కూడా మరోక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్ మరో ట్వీట్లో తెలిపారు. ఇది ఆగస్టు 14న కజకస్థాన్ బయల్దేరడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోనూ సూద్ వెల్లడించారు. (చదవండి: కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్) Kazakhstan to India is happening. Let's get you home. Almaty Friends.. Pack your bags. SG 9520 Almaty to Delhi, 14th August at 2:15pm is set. The wait to meet your families is finally over. @flyspicejet Start packing. Jai hind🇮🇳 — sonu sood (@SonuSood) August 12, 2020 -
యూఎస్‌లో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక విమానం
నెవార్క్ : కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. కాగా ఈ విమానం జూన్ 9(వచ్చే మంగళవారం)నెవార్క్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా యూఎస్- ఇండియా సాలిడారిటీ మిషన్ కింద ప్రైవేట్ ఛార్టర్ విమానానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. కాగా విమానంలోని ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. హైదరాబాద్ చేరుకోగానే క్వారంటైన్ లో ఉంటామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్ రావాలనుకున్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. రిజిస్ట్రేషన్ కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి. http://www.usism.org/register-private-charter-flight.html -
తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది అమెరికాకు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన 120 మంది అమెరికాకు పయనమయ్యారు. గురువారం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తోంది. అదే సమయంలో అత్యవసర పనుల మీద భారత్‌కు వచ్చి.. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన వారిని ఆయా దేశాలకు తరలిస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కనెక్టెడ్ ఫ్లైట్.. అమెరికాకు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి శుక్రవారం తెల్లవారుజామున శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరనుంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఆ విమానంలో భౌతిక దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫేస్ మాస్క్, గ్లోవ్స్, శానిటైజర్‌ను అందజేసినట్లు అమెరికాకు బయలుదేరిన ప్రయాణికుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఈ నెల 23న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు మరో విమానం వెళ్లనుంది. -
మే 16 నుంచి 22 వరకు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రెండో దశ వందేభారత్ మిషన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మే 16 నుంచి 22 వరకు, 31 దేశాలకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. రెండోదశలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, ఉక్రెయిన్, కజికిస్తాన్, ఒమన్, మలేసియా, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిజిస్థాన్, కువైట్, జపాన్, జార్జియా, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్‌లకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విమానాల్లో కేరళకి 31, ఢిల్లీ 22, కర్ణాటక 17, తెలంగాణ 16, గుజరాత్ 14, రాజస్తాన్ 12, ఆంధ్రప్రదేశ్ 9, పంజాబ్‌లో 7 విమానాలు ల్యాండ్ అవుతాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో 6, ఒడిశాలో 3, చండీగఢ్‌లో 2, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్లకు ఒక్కో విమానం చొప్పున చేరతాయి. కొందరు ప్రవాసులకు కష్టాలు! కరోనా కష్టాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ అమెరికాలో కొంతమందికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా కారణంగా విదేశీయుల వీసాలతోపాటు, భారతీయ సంతతి పౌరులు వీసాల అవసరం లేకుండా భారత్‌కు వచ్చేందుకు అవకాశం కల్పించే ఓసీఐ కార్డులనూ తాత్కాలికంగా రద్దు చేయడం ఇందుకు కారణమవుతోంది. దీంతో హెచ్1బీ వీసాలు ఉన్న వారు లేదా గ్రీన్‌కార్డు కలిగి ఉన్నవారు, పుట్టుకతో అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేకుండాపోయింది. హెచ్1బీ వీసాలు ఉన్న వారిలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి.. ఇటు స్వదేశమూ రాలేక నానా అవస్థలూ పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయం కారణంగా వీరందరూ రెండు నెలల్లో భారత్‌కు వెళ్లిపోవాల్సి ఉంది. తల్లిదండ్రులకు భారతీయ వీసా ఉన్నప్పటికీ పిల్లలు అమెరిక పౌరులైనందున వారిని వందేభారత్ మిషన్‌లో భాగంగా భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు తమను అనుమతించాలని కోరుతూ అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. -
నేడు అమెరికా నుంచి..
శంషాబాద్: వందేభారత్ మిషన్‌లో భాగంగా మరో రెండు విమానాలు సోమవారం రానున్నాయి. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి ఓ విమానం వస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తెలుగు ప్రయాణికులను తీసుకురావడానికి శంషాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి ఉదయం 6.45కు అక్కడికి చేరుకోనుంది. అదే విమానంలో ప్రయాణికులు ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అబుదా బి నుంచి వచ్చే మరో ఎయిర్ ఇండియా విమానం రాత్రి 8 గంటలకు నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరు కో నుంది. నిర్ధారించిన సమయాల్లో మార్పులు జరిగే అ వకాశాలు కూడా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలి పాయి. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఒక్కో విమానంలో 150–200లోపు ప్రయాణికులను అనుమతించే అవకాశాలున్నాయి. ఈ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు కస్టమ్స్ తనిఖీలు చేప ట్టిన తర్వాత పెయిడ్ క్వారంటైన్‌కు తరలిస్తారు. -
హైదరాబాద్ నుంచి బ్రిటన్‌కు ప్రత్యేక విమానం
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా నగరంలో చిక్కుకున్న బ్రిటన్ దేశస్తులను శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆ దేశానికి తరలించారు. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానం బీఏ (9116 /బీఏ 9117) శుక్రవారం సాయంత్రం 4.59 గంటలకు బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రం 6.46 గంటలకు 136 మంది యూకే జాతీయులను విమానంలో ఎక్కించుకుని అహ్మదాబాద్‌కు వెళ్లింది. అక్కడ మరికొందరు ఆ దేశానికి చెందిన వారు సైతం అదే విమానంలో ఎక్కారు. అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్ మీదుగా లండన్‌కు బయలుదేరింది. శానిటైజ్ చేసిన టెర్మినల్ సిద్ధం చేశాక.. ఈ ప్రయాణికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తిగా శానిటైజ్ చేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను సిద్ధంగా ఉంచారు.యూకే డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న బ్రిటన్ ప్రయాణికులు మధ్యాహ్నం 3.30 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్.జి.కె. కిశోర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో చిక్కుకున్న వివిధ దేశాలకు చెందిన వారిని ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.యూకే డిఫ్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో ఉన్న తమ దేశానికి చెందిన పౌరులు స్వదేశానికి తరలి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా బ్రిటిష్ పర్యాటకులను తమ దేశానికి పంపించినట్లు చెప్పారు. స్వదేశాలకు తరలిన 600 మంది..... లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన వివిధ దేశాలకు చెందిన 600 మందిని హైదరాబాద్ æ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 ఎవాక్యుయేషన్ విమానాల ద్వారా జర్మనీ, అమెరికా, యూకే, తదితర దేశాలకు తరలించారు. ఒకవైపు నిరంతరం ప్రత్యేక విమానాల ద్వారా ప్రయాణికులను తరలిస్తూనే మరో వైపు నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ విమానాలను నడుపుతున్నారు. -
శంషాబాద్‌లో ప్రత్యేక సేవలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టిస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక సేవలను అందజేస్తోంది. వివిధ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చే యడంతో పాటు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి దేశాలకు చేరవేస్తోంది. లాక్డౌన్ ఎత్తివేస్తే దేశీయ విమానాల రాకపోకలకు సైతం ఎయిర్‌పోర్టు పూర్తిగా సన్నద్ధమైంది. ఈదిశగా ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను నడిపేందుకు బుకింగ్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టు అమెరికా.. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్లను తీసుకుని ప్రత్యేక విమానం మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. అమెరికా కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 1617–ఏ–320 విమానం ముంబై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.20కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 99 మంది ప్రయాణికులకు థర్మల్ పరీక్షలు, ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు.4.15 గంటలకు ఇక్కడి నుంచి తిరిగి ముంబైకి బయల్దేరింది. అక్కడున్న మరికొందరు ప్రయాణికులతో అమెరికాకు వెళ్లనుంది. ప్రత్యేక సేవల్లో ఎయిర్‌పోర్టు 12ఏళ్ల పాటు నిరంతరాయంగా సేవలందిస్తోన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మొట్టమొదటిసారి లాక్డౌన్ కారణంగా సాధారణ సేవలను నిలిపివేసింది. కానీ కార్గో సేవలు కొనసాగుతున్నాయి. మార్చి 31న ఎయిరిండియా ప్రత్యేక విమానం ద్వారా 38 మంది జర్మన్లను వారి స్వదేశానికి తరలించారు. మార్చి 28న ఇండిగోకు చెందిన ప్రత్యేక మెడికల్ ఎవాక్యుకేషన్ విమానం హైదరాబాద్‌లో దిగి, తన ఎనిమిది మంది సిబ్బందిని హైద రాబాద్‌లో దింపి, ఇక్కడ చిక్కుకుపోయిన ఐదుగు రు సిబ్బందితో చెన్నైకు వెళ్లింది. ఫార్మా, ఔషధాలు, ఇతర అత్యవసర సేవలను ఎయిర్‌పోర్టు కొనసాగిస్తోందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ (బోయింగ్ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు వెళ్లనుంది. ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. -
జవానుకు గుండెపోటు.. విమానంలో తరలింపు
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో శిక్షణ పొందుతున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో హైదరాబాద్‌కు విమానంలో తరలిస్తున్నారు. కానిస్టేబుల్ చలమయ్య మంగళవారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని భద్రాచలం తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఆ విమానం చేరుకోనుంది. అక్కడినుంచి ఆ వెంటనే చలమయ్యను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించనున్నట్లు సమాచారం. -
బలవంతంగా హైదరాబాద్‌కు వైఎస్ జగన్ తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తరలించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు నాయకులను కూడా అదే విమానంలో హైదరాబాద్ పంపేశారు. విమానాశ్రయం బయటకు కూడా రానివ్వకుండా దాదాపు మూడు గంటలకు పైగా లోపలే నిర్బంధించిన ఆయనను.. ఒక ప్రత్యేక విమానం రప్పించి, అక్కడకు బలవంతంగా తరలించి, లోపలకు పంపారు. వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. కొవ్వొత్తుల ర్యాలీలో తాను పాల్గొంటానని పోలీసులను జగన్ మోహన్ రెడ్డి కోరినా.. వారు అందుకు అంగీకరించలేదు. ముందునుంచే బీచ్ రోడ్డు మొత్తాన్ని దిగ్బంధించి, అటువైపు ఒక్క పురుగును కూడా అనుమతించని పోలీసులు జగన్ అటువైపు చేరుకుంటే ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అవుతుందని భావించిన ప్రభుత్వం.. ఆయనను అసలు ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా అడ్డుకుంది. అయితే ప్రజలు మాత్రం తమ నాయకుడిని చూసేందుకు భారీ సంఖ్యలో విమానాశ్రయం బయట చేరుకుని, కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు మార్మోగించారు. సీఎం డౌన్ డౌన్.. ప్రత్యేక హోదా మా హక్కు అంటూ నినదించారు. -
ఆమెకు ఏపీలో అంతా 'ప్రత్యేకమే'
రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనల కోసం ఉపయోగించే ప్రత్యేక విమానాన్ని సింధు కోసం పంపారు. ఎప్పుడూ సాధారణ విమానాలు వెళ్లే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాక.. వీఐపీల కోసం మాత్రమే ఉపయోగించే బేగంపేట విమానాశ్రయం నుంచి.. ఈ ప్రత్యేక విమానంలో పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్ అంతా బయల్దేరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వయంగా వాళ్లను తోడ్కొని హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. -
'బాబు-పవన్ ల భేటీ వెనుక హైడ్రామా'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం వెనుక పెద్ద హైడ్రామానే నడిచిందని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. పవన్ రాకకోసం చంద్రబాబే స్వయంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి సిద్ధం చేసిన స్ర్కిప్ట్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ చదివి వినిపించారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీలో బలం ఉందని చెప్పుకోవడానికే పవన్‌ను విజయవాడ రప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో చంద్రబాబు బీజేపీకి దూరమవుతారని పేర్కొన్నారు. -
ఢిల్లీకైనా..విదేశీకైనా స్పెషల్ ప్లైయిట్లోనే
-
రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం కోసం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి వస్తున్నారు. అధికారుల అనధికార సమాచారం మేరకు... ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయనికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకుని రాత్రికి కొలంబోకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం శ్రీలంక నుంచి వచ్చిన భద్రతాధికారుల బృందం తిరుమలలోని పలు ప్రదేశాల్లో పర్యటించింది. తిరుమల విజిలెన్స్ ఏవీఎస్వో, ఇతర అధికారులను కలసి శ్రీలంక అధ్యక్షుడి పర్యటనపై చర్చించారు. -
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం అయ్యారు. అనారోగ్యంతో ఉన్న కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని పరామర్శించనున్నారు. ఇటీవలే జైట్లీ మధుమేహానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా జైట్లీని పరామర్శించటంతో పాటు రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు చంద్రబాబు ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను సందర్శించనున్నారు. ఆ నగర నిర్మాణ తీరును చంద్రబాబు అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. -
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ చేరిన తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. బిల్లుతో పాటు బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు విభజన బిల్లును పోస్ట్‌లోనో.. కొరియర్లోనో కాకుండా.. ప్రత్యేక విమానంలో పంపుతున్నట్లు అధికారులు చెప్పారు. సచివాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించిన అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపారు. తొమ్మిది పెట్టెల్లో 35 బండిల్స్‌తో బిల్లును ఏడుగురు అధికారుల బృందం ఉదయం ఆరు గంటల సమయంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. సచివాలయ ప్రత్యేక అధికారి రామకృష్ణరావు పునర్వ్యవస్థీకరణ బిల్లును ఇండిగో ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్తారు. అనంతరం ఏడున్నర గంటలం సమయంలో మరో 20బాక్సుల్లో బిల్లు ప్రతులను పరిపాలన శాఖ అధికారి రామరాజు నేతృత్వంలో బిల్లును తరలించారు. బిల్లుతో పాటు -బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు పంపారు. -
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) తెల్లవారుజామున 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లింది. బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదికతో పాటు ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిని కూడా అధికారులు ఢిల్లీకి పంపారు. భారీ భద్రత మధ్య ఈ బిల్లును ఢిల్లీకి తరలిస్తున్నారు. ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇందుకోసం నియమించారు. వారంతా ప్రత్యేక విమానంలో ఈ బిల్లును ఢిల్లీకి తీసుకెళ్లారు. రెండు విడతలుగా విభజన బిల్లు ఢిల్లీకి వెళ్తోంది. తొలివిడతగా 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో కొంత భాగం వెళ్లగా, మళ్లీ ఉదయం 9.40 గంటలకు మరో విమానంలో రెండో భాగం కూడా వెళ్లబోతోంది. అందులో, అసెంబ్లీలో శాసన సభ్యులు ఈ బిల్లుపై వ్యక్తం చేసిన అభిప్రాయాల నివేదిక ప్రధానంగా ఉండబోతోంది. సాధారణ పరిపాలన శాఖ నుంచి ఢిల్లీకి తెలంగాణ బిల్లుతో పాటు ఏడుగురు అధికారులు బయల్దేరారు. మొత్తం బిల్లుకు సంబంధించిన సమాచారం అంతటినీ కేంద్ర హోం శాఖకు అందజేయనున్నారు. -
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు
-
కేంద్రం తీరు పై మండిపడిన చంద్రబాబు