రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు | Mahinda Rajapaksa to worship at Tirumala, Tamil groups protest | Sakshi
Sakshi News home page

రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు

Published Mon, Dec 8 2014 6:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

Mahinda Rajapaksa to worship at Tirumala, Tamil groups protest

 సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం కోసం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స  కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి వస్తున్నారు. అధికారుల అనధికార సమాచారం మేరకు... ఉదయం  ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయనికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకుని రాత్రికి కొలంబోకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం శ్రీలంక నుంచి వచ్చిన భద్రతాధికారుల బృందం తిరుమలలోని పలు ప్రదేశాల్లో పర్యటించింది. తిరుమల విజిలెన్స్ ఏవీఎస్‌వో, ఇతర అధికారులను కలసి శ్రీలంక అధ్యక్షుడి పర్యటనపై చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement