సాక్షి, న్యూఢిల్లీ: బుకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. విద్యార్థులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్‌కు అధికారులు తరలించారు. వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ భవన్‌లో వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 219 ముందితో తొలి విమానం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు..
ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు: విద్యార్థులు
‘‘పశ్చిమ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. రొమేనియా సరిహద్దు దాటి, బస్సులో బుకారెస్ట్ విమానాశ్రయం చేరుకున్నాం. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు. మా యూనివర్సిటీ అధికారులు ఆందోళన వద్దని, పరీక్షలు రాసిన తర్వాత వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. మేము టికెట్లు బుక్ చేసుకుని కూడా ఉపయోగం లేకపోయింది. అక్కడి వాతావరణం బావుంటుంది. ప్రజలు బావుంటారు. అలాంటి దేశంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. యుద్ధం మొదలైందన్న వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత్‌పై కాలుమోపడం ఆనందంగా ఉంది. ఢిల్లీ నుంచి మా ఇంటికి చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారని’’ విద్యార్థులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment