ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం.. వారు ఏమన్నారంటే..? | Air India Flight Lands In Delhi From Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం.. భారతీయులు ఏమన్నారంటే..?

Feb 23 2022 11:48 AM | Updated on Feb 23 2022 11:58 AM

Air India Flight Lands In Delhi From Ukraine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల మధ్య భారత పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. 242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. 

అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో భారత ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులను, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉక్రెయిన్‌కు వెళ్లిన ప్రత్యేక విమానంలో భారత్‌కు చెందిన 242 మంది ప్రయాణికులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తరలించేందకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామని విదేశాంగశాఖ సహాయమంతి మురళీధరన్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. 

(ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడు.. పుతిన్‌ సవాల్‌ చేస్తున్నారా అంటూ..)

ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడంఎంతో ఉపశమనంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే వారు ఆనందం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement