
శంషాబాద్: వందేభారత్ మిషన్‌లో భాగంగా మరో రెండు విమానాలు సోమవారం రానున్నాయి. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి ఓ విమానం వస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తెలుగు ప్రయాణికులను తీసుకురావడానికి శంషాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి ఉదయం 6.45కు అక్కడికి చేరుకోనుంది. అదే విమానంలో ప్రయాణికులు ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అబుదా బి నుంచి వచ్చే మరో ఎయిర్ ఇండియా విమానం రాత్రి 8 గంటలకు నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరు కో నుంది. నిర్ధారించిన సమయాల్లో మార్పులు జరిగే అ వకాశాలు కూడా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలి పాయి. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఒక్కో విమానంలో 150–200లోపు ప్రయాణికులను అనుమతించే అవకాశాలున్నాయి. ఈ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు కస్టమ్స్ తనిఖీలు చేప ట్టిన తర్వాత పెయిడ్ క్వారంటైన్‌కు తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment