ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు | telangana bill sent to delhi in special flight | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టీ బిల్లు

Published Mon, Feb 3 2014 8:16 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

telangana bill sent to delhi in special flight

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) తెల్లవారుజామున 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లింది. బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదికతో పాటు ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిని కూడా అధికారులు ఢిల్లీకి పంపారు. భారీ భద్రత మధ్య ఈ బిల్లును ఢిల్లీకి తరలిస్తున్నారు. ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇందుకోసం నియమించారు. వారంతా ప్రత్యేక విమానంలో ఈ బిల్లును ఢిల్లీకి తీసుకెళ్లారు.

రెండు విడతలుగా విభజన బిల్లు ఢిల్లీకి వెళ్తోంది. తొలివిడతగా 6.10 గంటలకు ప్రత్యేక విమానంలో కొంత భాగం వెళ్లగా, మళ్లీ ఉదయం 9.40 గంటలకు మరో విమానంలో రెండో భాగం కూడా వెళ్లబోతోంది. అందులో, అసెంబ్లీలో శాసన సభ్యులు ఈ బిల్లుపై వ్యక్తం చేసిన  అభిప్రాయాల నివేదిక ప్రధానంగా ఉండబోతోంది. సాధారణ పరిపాలన శాఖ నుంచి ఢిల్లీకి తెలంగాణ బిల్లుతో పాటు ఏడుగురు అధికారులు బయల్దేరారు. మొత్తం బిల్లుకు సంబంధించిన సమాచారం అంతటినీ కేంద్ర హోం శాఖకు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement