పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన మొదటి రౌండ్‌లో కాటరీనా కొజ్లోవా (ఉక్రెయిన్) 7–5, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 13 డబుల్ ఫాల్ట్‌లు, 48 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం 2005 (మిస్కినా–రష్యా) తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా తొలి రౌండ్‌లోనే ఓడింది. వాంగ్ కియాంగ్ (చైనా) 6–4, 7–5తో వీనస్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) రెండో రౌండ్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment