Jelena Ostapenko
-
US Open: వరల్డ్ నంబర్ 1కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి అవుట్
న్యూయార్క్: పోలండ్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్-20 సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముందడుగు వేసింది. పూర్తిగా తనదే ఆధిపత్యం కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్ 6-3తో తొలి సెట్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమెతో పోటీ ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్ స్టార్ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్ టెన్నిస్ తార అరియానా సబలెంక నంబర్ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్.. మాజీ వరల్డ్ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది. క్వార్టర్స్‌లో ముకోవా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది. చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Make your prediction. What's the semifinal here? pic.twitter.com/xxrXmYXkIv — US Open Tennis (@usopen) September 4, 2023 Jelena Ostapenko reaches the #USOpen quartefinals for the first time in her career! pic.twitter.com/QzSWObVJYE — US Open Tennis (@usopen) September 4, 2023 Well, well, well 💅 There will be a deciding set between Jelena Ostapenko and Iga Swiatek. pic.twitter.com/3iIYIG0MLs — US Open Tennis (@usopen) September 4, 2023 -
ఒస్టాపెంకో ముందంజ
మూడేళ్ల క్రితం అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన జెలెనా ఒస్టాపెంకో తనకు అచ్చొచ్చిన వేదికగా మళ్లీ రాణిస్తోంది. 2020లో కూడా అన్‌సీడెడ్‌గా వచ్చిన ఈ లాత్వియా అమ్మాయి టోర్నీ రెండో సీడ్ ప్లిస్కోవాకు షాక్ ఇచ్చి మరో అడుగు ముందుకు వేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్ కొంత పోరాడి మూడో రౌండ్‌కు చేరగా, పురుషుల విభాగంలో నంబర్‌వన్ జొకోవిచ్ కూడా తన జోరు ప్రదర్శించగా, గురువారం టోర్నీలో ఇతర సంచలనాలేమీ నమోదు కాలేదు. పారిస్: మాజీ చాంపియన్, అన్‌సీడెడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మూడో రౌండ్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 6–4, 6–2 స్కోరుతో 2వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన ఆమె 27 విన్నర్లు కొట్టింది. ఇటీవల జరిగిన రోమ్ ఓపెన్‌కు ఫైనల్‌కు చేరి గాయంతో తప్పుకున్న ప్రపంచ 8వ ర్యాంకర్ ప్లిస్కోవా 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నాలుగో సీడ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ కూడా ముందంజ వేసింది. రెండో రౌండ్లో ఆమె 3–6, 6–3, 6–2 తేడాతో అనా బోగ్డెన్ (రొమేనియా)ను ఓడించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో ఏడో సీడ్ పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ అరైనా సబలెంకా (బెలారస్)పై, పావ్లా బడోసా (స్పెయిన్) 6–4, 4–6, 6–2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై విజయం సాధించారు. ఓటమి తప్పించుకున్న జ్వెరేవ్... పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ)కి అదృష్టం కలిసొచ్చింది. పియరీ హ్యూజెస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో అతను చివరకు విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 59 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జ్వెరేవ్ 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో గెలుపొందాడు. 45 విన్నర్లు కొట్టిన జ్వెరేవ్ 10 ఏస్‌లు సంధించాడు. 3 గంటల 53 నిమిషాలు సాగిన మరో మ్యాచ్‌లో స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) 6–4, 2–6, 7–6 (9/7), 4–6, 6–2తో నిషికొరి (జపాన్)పై విజయం సాధించాడు. టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు రెండో రౌండ్లో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. కేవలం 83 నిమిషాల్లో ముగిసి మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 6–2, 6–2తో బెరాంకిస్ (లిథువేనియా)ను చిత్తుగా ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–4, 6–2తో పాబ్లో క్వాస్ (ఉరుగ్వే)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. దివిజ్ జోడి ఓటమి... పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. శరణ్–సూన్‌వూ క్వాన్ (కొరియా) జంట 2–6, 6–4, 4–6తో ఫ్రాంకో స్కుగర్ (క్రొయేషియా)–అస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది. -
ఒస్టాపెంకో నిష్క్రమణ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజే పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, ఐదో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో కాటరీనా కొజ్లోవా (ఉక్రెయిన్) 7–5, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 13 డబుల్ ఫాల్ట్‌లు, 48 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించడం 2005 (మిస్కినా–రష్యా) తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా తొలి రౌండ్లోనే ఓడింది. వాంగ్ కియాంగ్ (చైనా) 6–4, 7–5తో వీనస్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) రెండో రౌండ్‌కు చేరారు. -
ఒస్టాపెంకో సంచలనం
► మహిళల సింగిల్స్ ఫైనల్లోకి అన్‌సీడెడ్ క్రీడాకారిణి ► రేపు మూడో సీడ్ హలెప్‌తో టైటిల్ పోరు పారిస్: కెరీర్లో ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లు ఆడినా ఏనాడూ రెండో రౌండ్ దాటలేకపోయిన జెలెనా ఒస్టాపెంకో ఎనిమిదో ప్రయత్నంలో సంచలనమే సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 ఏళ్ల ఈ లాత్వియా క్రీడాకారిణి మహిళల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో 1983లో మిమా జౌసోవెచ్ (యుగోస్లావియా) తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఒస్టాపెంకో 7–6 (7/4), 3–6, 6–3తో 30వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. గురువారమే తమ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఒస్టాపెంకో, బాసిన్స్కీలు హోరాహోరీగా పోరాడినా తుదకు ఒస్టాపెంకోనే విజయం వరించింది. రెండో సెమీఫైనల్లో మూడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 3–6, 6–3తో రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది.