ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది.
అయితే రెండోసెట్‌లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్‌ఓపెన్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది.
THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD
— Roland-Garros (@rolandgarros) June 10, 2023
Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K
— Roland-Garros (@rolandgarros) June 10, 2023
Comments
Please login to add a commentAdd a comment