iga swiatek
-
సెమీస్‌లో స్వియాటెక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది. మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు. షెల్టన్ తొలిసారి... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 వినర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
సినెర్, స్వియాటెక్ అలవోకగా...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.మెల్బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు. వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్కు చెక్ పెట్టాడు. సినెర్ జోరు... డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. స్వితోలినా ముందంజ మోన్ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. బాలాజీ జోడీ అవుట్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
ఎందుకీ వివక్ష.. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు?!
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్(Jannik Sinner), స్వియాటెక్(Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. ఐటీఐఏ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్ ఈవెంట్ కోసంఅదే విధంగా.. టాప్ స్టార్ల డోపింగ్ మరకలపై గోప్యతను పాటించి టెన్నిస్ సమాజం నుంచి నిజాన్ని దాచడంపై సరికాదని పేర్కొన్నాడు. తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్.. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. 2009 తర్వాత బ్రిస్బేన్ ఈవెంట్ ఆడేందుకు వచ్చిన అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘సినెర్ ఉద్దేశ పూర్వకంగా నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నాడా లేదంటే ప్రమేయం లేకుండా తీసుకున్నాడా అనే విషయంపై నేను చర్చించడం లేదు.ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదుఎందుకంటే గతంలో డోపీగా తేలితే సస్పెన్షన్‌కు గురైన ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు. కొందరు దిగువ ర్యాంకు ప్లేయర్లు తమ డోపింగ్ కేసు–నిషేధం పరిష్కారమవ్వాలని ఏడాదిగా చూస్తున్నారు. కానీ వీళ్ల (సినెర్, స్వియాటెక్) విషయాన్నేమో ప్రపంచానికి తెలీకుండా గోప్యత పాటించడం, తూతూ మంత్రపు నిషేధం చర్యలతో సరిపెట్టడం, మొత్తం టెన్నిస్ సమాజానికి కళ్లకు గంతలు కట్టడం వంటివి చేస్తున్న టెన్నిస్ ఇంటిగ్రిటీ వ్యవహారశైలీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.ఇది ఆటకున్న ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉంది. ఒక సమాఖ్య అందరు ఆటగాళ్లను సమానంగా చూడదా? ఒక్కొక్కరికి ఒక్కో నిబంధనలు ఉంటాయా? ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు’ అని జొకోవిచ్ సమాఖ్య తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. తానైతే ప్రస్తుతం కొత్తసీజన్పై తాజాగా దృష్టి సారించినట్లు చెప్పాడు.ఘనమైన రికార్డుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో ఫైనల్ చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియన్ సూపర్‌స్టార్‌కు చక్కని రికార్డు ఉంది. ఇక్కడ అతడు 10 టైటిల్స్ సాధించాడు. -
స్వియాటెక్ ‘డోపీ’
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లో అగ్ర స్థాయిలో మరోసారి డోపింగ్ ఉదంతం కలకలం రేపింది. ఇటీవలే పురుషుల నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) డోపింగ్‌లో పట్టుబడగా ఈసారి మహిళల స్టార్ ప్లేయర్ వంతు వచ్చిoది. ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలండ్) డోపింగ్‌లో పట్టుబడింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె తక్కువ శిక్షకే పరిమితమైంది. స్వియాటెక్‌పై కేవలం నెల రోజుల నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) ప్రకటించింది. ఈ ఉదంతంలో స్వియాటెక్‌పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించారు. ఆమె దీనిని సవాల్ చేయడానికి ముందు ఈ ఏడాది సెపె్టంబర్ 22 నుంచి అక్టోబర్ 4 మధ్య కాలంలో సస్పెన్షన్‌లోనే ఉంది. ఆ సమయంలో స్వియాటెక్ మూడు టోర్నీలో కొరియా ఓపెన్, చైనా ఓపెన్, వుహాన్ ఓపెన్లకు దూరమైంది. దాంతో మరో ఎనిమిది రోజులు మాత్రమే ఆమె శిక్ష మిగిలి ఉండగా... ఇది డిసెంబర్ 4తో ముగుస్తుంది. గత రెండు సీజన్లలో ఎక్కువ భాగం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న స్వియాటెక్ వరుస విజయాలతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టోర్నీలో లేని సమయంలో ఆగస్టులో ఆమె ఇచ్చిన శాంపిల్స్‌లో డోపీగా తేలింది. నిషేధిత ఉత్ప్రేరకం ‘ట్రైమెటాజిదైన్’ను ఆమె వాడినట్లు పరీక్షలో బయటపడింది. అయితే ఇది తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని పేర్కొంది. జెట్ లాగ్, నిద్రలేమి వంటి సమస్యల కోసం వాడిన మందులో ఇది ఉందని, దీని వాడకం తమ దేశంలో చాలా సాధారణమని ఆమె వివరణ ఇచ్చిoది. విచారణ సమయంలో స్వియాటెక్ వివరణపై సంతృప్తి చెందిన ఐటీఐఏ ఆమె తప్పేమీ లేదంటూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. నెల రోజుల నిషేధంతో పాటు 1,58,944 డాలర్లు (రూ. 1 కోటి 34 లక్షలు) జరిమానాగా విధించింది. 23 ఏళ్ల స్వియాటెక్ ఇప్పటి వరకు కెరీర్లో మొత్తం 21 సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ఇందులో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఫ్రెంచ్ ఓపెన్–2024, 2023, 2022, 2020; యూఎస్ ఓపెన్–2022) కూడా ఉండటం విశేషం. -
స్వియాటెక్ శుభారంభం
రియాద్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ శుభారంభం చేసింది. ఆరెంజ్ గ్రూప్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ 4–6, 7–5, 6–2తో ఎనిమిదో సీడ్ బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ పది ఏస్‌లు సంధించింది. ఆరెంజ్ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–2తో అమెరికాకే చెందిన జెస్సికా పెగూలాను ఓడించింది. పర్పుల్ గ్రూప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) 7–6 (7/5), 6–4తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. -
స్వియాటెక్ కొత్త కోచ్‌గా విమ్ ఫిసెట్
వాషింగ్టన్: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కొత్త కోచ్‌ను నియమించుకుంది. వచ్చే నెలలో సౌదీ అరేబియా వేదికగా జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విమ్ ఫిసెట్ మార్గనిర్దేశకత్వంలో స్వియాటెక్ బరిలోకి దిగనుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న స్వియాటెక్... త్వరలో తిరిగి కోర్టులో అడుగు పెట్టనుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు, గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హాలెప్ (రొమేనియా), అజరెంకా (బెలారస్), ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) వంటి మేటి ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిసెట్... ఇకపై స్వియాటెక్‌కు శిక్షణ ఇవ్వనున్నాడు. ‘కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నా. దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసుకున్నా. ఫిసెట్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అత్యుత్తమ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఫిసెట్ సొంతం’ అని స్వియాటెక్ శుక్రవారం వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా విక్టరోస్కీ వద్ద శిక్షణ తీసుకున్న స్వియాటెక్ తొలిసారి విదేశీ కోచ్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అందులో యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022, 2023, 2024) టైటిళ్లు ఉన్నాయి. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో స్వియాటెక్ కాంస్య పతకం గెలుచుకుంది. -
జెస్సికా జోరు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.సినెర్, డ్రేపర్ తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్‌స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు. ఏడో ప్రయత్నంలో...కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది. 88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు. -
స్వియాటెక్‌పై సబలెంకా పైచేయి
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ నుంచి మహిళల టెన్నిస్ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) నిష్క్రమించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వియాటెక్‌తో 12వ సారి తలపడిన సబలెంకా నాలుగోసారి విజయాన్ని అందుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సీజన్లో ఐదో టోర్నీలో ఫైనల్ చేరిన సబలెంకా తదుపరి ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది. జెస్సికా పెగూలా (అమెరికా), పౌలా బదోసా (స్పెయిన్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో సబలెంకా తలపడతుంది. -
Paris Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్‌కు (పోలాండ్) షాక్ తగిలింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన క్విన్వెన్ ఝెంగ్ స్వియాటెక్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించింది. గంటా 51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో క్విన్వెన్ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. Qinwen Zheng becomes the 1st Chinese player in history to reach the final of the Olympics in singles. No man or woman has ever done it before today. Megastar in the making. 🇨🇳❤️🇨🇳 pic.twitter.com/24f1WkwBcz— The Tennis Letter (@TheTennisLetter) August 1, 2024ఒలింపిక్స్ టెన్నిస్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి చైనా క్రీడాకారిణిగా క్విన్వెన్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో రొలాండ్ గారోస్‌లో 1149 రోజుల పాటు సాగిన స్వియాటెక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2021 నుంచి రొలాండ్ అండ్ గారోస్‌లో స్వియాటెక్‌కు ఓటమనేదే లేదు. డొన్నా వెకిక్, అన్నా కరోలినా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విన్నర్‌తో క్విన్వెన్ ఫైనల్లో పోటీపడుతుంది. -
వొండ్రుసోవాకు షాక్
లండన్: జెస్సికా బౌజస్ మనెరో వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో బౌజస్ పేరు మార్మోగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)కు తొలి రౌండ్లోనే షాకిచ్చి సంచలన విజయంతో వింబుల్డన్‌ను ఆరంభించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జెస్సికా బౌజస్ (స్పెయిన్) 6–4, 6–2తో ఆరో సీడ్ వొండ్రుసోవాను వరుస సెట్లలోనే ఇంటిదారి పట్టించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనలిస్టుగా నిలిచిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్... ఈ పరాభవంతో మూడు దశాబ్దాల తర్వాత వింబుల్డన్ గడ్డపై ఓ డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే ఓడిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. మహిళల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరైన స్టెఫీగ్రాఫ్ (జర్మనీ) 1994లో డిఫెండింగ్ చాంపియన్ హోదాతో వింబుల్డన్ బరిలోకి దిగి అనామక ప్లేయర్ లోరీ మెక్నీల్ (అమెరికా) చేతిలో ఓడింది. జొకోవిచ్ సులువుగా... పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ సూపర్‌స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ సులువుగా ముందంజ వేశాడు. జొకో 6–1, 6–2, 6–2తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై అలవోక విజయం సాధించాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–2తో కార్బలెస్ బేన (స్పెయిన్)పై గెలుపొందగా, రష్యన్ స్టార్, ఆరో సీడ్ రుబ్లెవ్ ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. కామెసన (అర్జెంటీనా) 6–4, 5–7, 6–2, 7–6 (7/5)తో రుబ్లెవ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ నంబర్‌వన్, జానిక్ సినెర్ (ఇటలీ) 6–3, 6–4, 3–6, 6–3తో యానిక్ హఫ్‌మన్ (జర్మనీ)పై, ఏడో సీడ్ హుర్కాజ్ (పొలాండ్) 5–7, 6–4, 6–3, 6–4తో అల్బాట్ (మాల్దొవా)పై గెలుపొందారు. తొమ్మిదో సీడ్ డి మినౌర్ (ఆ్రస్టేలియా) 7–6 (7/1), 7–6 (7/3), 7–6 (7/4)తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై ప్రతి సెట్ కోసం ఓ యుద్ధమే చేసి గెలిచాడు. సూపర్ స్వియాటెక్ మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పొలాండ్) 6–3, 6–4తో అమెరికా చెందిన సోఫియా కెనిన్‌పై వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–3 6–1తో గాబ్రియెలా రూస్ (రుమేనియా)పై, ఐదో సీడ్ పెగులా (అమెరికా) 6–2, 6–0తో అష్లిన్ క్రూగెర్ (అమెరికా)పై, 15వ సీడ్ సామ్సోనొవా (రష్యా) 6–3, 4–6, 6–2తో రెబెకా మసరొవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) 6–1, 6–2తో టామ్జనోవిక్ (ఆ్రస్టేలియా)పై సులువైన విజయంతో శుభారంభం చేసింది. నగాల్ అవుట్ భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఆట వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో ముగిసింది. 72వ ర్యాంక్ భారత ప్లేయర్ 2–6 6–3, 3–6, 4–6తో ప్రపంచ 53వ ర్యాంకర్ కెక్మనొవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 26 ఏళ్ల నగాల్ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి ఆరు ఏస్‌లు సంధించి కేవలం రెండుసార్లు మాత్రమే డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
చాంపియన్ స్వియాటెక్
పారిస్: వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఎర్ర మట్టిపై తన జోరును కొనసాగిస్తూ ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది ఆమె చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది. 2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్...అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్ ఓపెన్ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో ఫైనల్ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్ టైటిల్ దక్కించుకోవడం విశేషం. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె నిలిచింది. తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. తొలి సెట్లో స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పావ్లిని 2–1తో ముందంజ వేసినా...అది అక్కడితో సరి. పోలండ్ స్టార్ ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్లు చెలరేగిపోయి వరుసగా 10 గేమ్‌లను గెలుచుకుంది. ఫలితంగా తొలి సెట్‌ను గెలుచుకోవడంతో పాటు రెండో సెట్లోనూ 5–0తో విజయానికి చేరువైంది. ఈ స్థితిలో తర్వాతి గేమ్‌ను ఎలాగో పావ్లిని గెలుచుకోగలిగినా...తర్వాతి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకొని స్వియాటెక్ సంబరాలు చేసుకుంది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ 18 విన్నర్లు కొట్టగా...18 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్‌తో పావ్లిని తన ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు (సుమారు రూ. 22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు పురుషుల ఫైనల్ అల్కరాజ్ (స్పెయిన్) X జ్వెరెవ్ (జర్మనీ)సా.గం.6.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టైటిల్ పోరుకు స్వియాటెక్, జాస్మిన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో టైటిల్ గెలిచేందుకు పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ విజయం దూరంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్వియాటెక్ గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 6–2, 6–4తో మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ) 6–3, 6–1తో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవాపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 5–7, 6–2, 2–6తో బొలెలీ–వావసోరి (ఇటలీ) జోడీ చేతిలో ఓడింది. -
స్వియాటెక్ ఫటాఫట్...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ అదరగొట్టింది. రష్యా ప్లేయర్ అనస్తాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–0తో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద ఆరు పాయింట్లు గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో ఎలిసబెట్టా కొకైరెట్టో (ఇటలీ)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 6–3, 6–3, 6–1తో అగుర్ అలియాసిమ్ (కెనడా)పై, సిట్సిపాస్ 3–6, 7–6 (7/4), 6–2, 6–2తో మాటియో అర్నాల్డి (ఇటలీ)పై గెలుపొందారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 4 గంటల 29 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 7–5, 6–7 (6/8), 2–6, 6–3, 6–0తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–5, 4–6, 6–4తో ఒర్లాండో లుజ్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బోపన్న–ఎబ్డెన్లతో ఆడాల్సిన సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)–థియాగో వైల్డ్ (బ్రెజిల్) టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో బోపన్న–ఎబ్డెన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో)లతో బోపన్న–ఎబ్డెన్ ఆడతారు. -
స్వియాటెక్ సులువుగా...
పారిస్: రెండో రౌండ్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లో మాత్రం అలవోకగా గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలిచిన స్వియాటెక్ శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 34 విన్నర్స్ కొట్టిన ఆమె కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో డయానా యెస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో చోల్ పాక్వెట్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–4, 7–6 (7/5)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సినెర్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సినెర్ మూడో రౌండ్లో 6–4, 6–4, 6–4తో కొటోవ్ (రష్యా)ను ఓడించాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మాత్రం మూడో రౌండ్లోనే నిష్క్రమించాడు. అర్నాల్డి (ఇటలీ) 7–6 (8/6), 6–2, 6–4తో రుబ్లెవ్‌ను ఇంటిదారి పట్టించాడు. బాలాజీ జోడీ గెలుపు పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–3, 6–4తో రీస్ స్టాల్డెర్ (అమెరికా)–సెమ్ వీర్బీక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 3–6, 6–7 (5/7)తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–సఫీయులిన్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
స్వియాటెక్‌కు షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల లిండా నొస్కోవా తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేసి నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 50వ ర్యాంకర్ నొస్కోవా 3–6, 6–3, 6–4తో స్వియాటెక్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్), 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. -
అప్పుడు సెరెనా... ఇప్పుడు స్వియాటెక్!
పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. మహిళల టెన్నిస్ సంఘంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. 22 ఏళ్ల స్వియాటెక్ 2023లో ఆరు టైటిళ్లను సాధించింది. గతంలో వరుసగా రెండేళ్లు, అంతకుమించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన రికార్డు అమెరికన్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పేరిట ఉంది. సెరెనా 2012 నుంచి నాలుగేళ్ల పాటు ఆ అవార్డు సాధించింది. -
US Open: వరల్డ్ నంబర్ 1కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి అవుట్
న్యూయార్క్: పోలండ్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్-20 సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముందడుగు వేసింది. పూర్తిగా తనదే ఆధిపత్యం కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్ 6-3తో తొలి సెట్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమెతో పోటీ ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్ స్టార్ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్ టెన్నిస్ తార అరియానా సబలెంక నంబర్ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్.. మాజీ వరల్డ్ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది. క్వార్టర్స్‌లో ముకోవా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది. చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Make your prediction. What's the semifinal here? pic.twitter.com/xxrXmYXkIv — US Open Tennis (@usopen) September 4, 2023 Jelena Ostapenko reaches the #USOpen quartefinals for the first time in her career! pic.twitter.com/QzSWObVJYE — US Open Tennis (@usopen) September 4, 2023 Well, well, well 💅 There will be a deciding set between Jelena Ostapenko and Iga Swiatek. pic.twitter.com/3iIYIG0MLs — US Open Tennis (@usopen) September 4, 2023 -
ఇన్ఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్వైటెక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్.. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ మహిళా టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్‌ను నియమించుకుంది. కొన్నేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం ద్వారా సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్‌ను ప్రమోట్ చేయడంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినివ్వనుంది. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(ఎస్టీఈఎం–స్టెమ్)లలో వెనుకబడిన మహిళల కోసం ప్రోగ్రామ్‌లను సృష్టించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. మహిళా సాధకులపై స్వైటెక్ అత్యంత ప్రభావశీలిగా నిలుస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వైటెక్‌తో కలిసి ఇన్ఫోసిస్ యువతకు ప్రధానంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌కు కీలకమైన స్టెమ్‌లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించారు. 22ఏళ్ల స్వైటెక్ నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకోవడంతోపాటు.. 2022 ఏప్రిల్ నుంచి ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. -
సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
లండన్: గత ఏడాది అక్టోబర్‌లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్ పట్టిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. 2019 తర్వాత మళ్లీ వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వితోలినాకు వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్‌తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి, తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. తొలి రౌండ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై, రెండో రౌండ్లో సోఫియా కెనిన్ (అమెరికా)పై, నాలుగో రౌండ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)–రీస్ స్టాడ్లెర్ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్ బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో మానస్ ధామ్నె (భారత్) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj — Wimbledon (@Wimbledon) July 11, 2023 -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. 11 ఏస్‌లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్‌ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వరల్డ్ నెంబర్ వన్.. పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవాపై 6-2,5-7,6-4తో గెలుపొందింది. 2 గంటల 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను ఇగా స్వియాటెక్ 6-2తో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకుంది. అయితే రెండోసెట్లో ఫుంజుకున్న కరోలినా ముకోవా స్వియాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించిన స్వియాటెక్ కరోలినాకు అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఇది మూడోసారి. 2020, 2022లో విజేతగా అవతరించిన స్వియాటెక్.. 2023లోనే విజేతగా నిలిచి హ్యాట్రిక్ ఫ్రెంచ్ఓపెన్ను కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లలో రోలాండ్ గారోస్ టైటిల్‌ను మూడుసార్లు నెగ్గిన క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్ఠించింది. THAT MOMENT 🥹🇵🇱#RolandGarros #Paris @iga_swiatek @WTA pic.twitter.com/Dy0NnNLOZD — Roland-Garros (@rolandgarros) June 10, 2023 Hat's off, champ 🤭#RolandGarros | @iga_swiatek pic.twitter.com/Iw49NVgC9K — Roland-Garros (@rolandgarros) June 10, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!' -
సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్‌వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ సెమీస్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్‌లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
French Open 2023: ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా ఫిట్నెస్ సమస్యలతో వైదొలగగా, ఆరోసీడ్ కోకో గాఫ్, 14వ సీడ్ హదాడ్ మైయాతో పాటు పురుషుల ఈవెంట్లో సీడెడ్లు కాస్పెర్ రూడ్, హోల్గెర్ రూన్ (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. జపనీస్ స్టార్ నిషిఒకా చెమటోడ్చి ముందంజ వేయగా, 15వ సీడ్ బొర్నా కొరిచ్ మూడో రౌండ్లో నిష్క్రమించాడు. ఏకపక్షంగా... మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు (2020, 2022) ఇక్కడ క్లే కోర్ట్ చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు మూడో రౌండ్లో చైనీస్ ప్రత్యర్థి నుంచి కనీస పోటీనే లేకపోయింది. దీంతో పోలండ్ స్టార్ 6–0, 6–0తో జిన్యూ వాంగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది. కేవలం 51 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా మ్యాచ్ బరిలోకి దిగకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. అనారోగ్య కారణాలతో మూడో రౌండ్ బరిలోకి దిగలేనని 23 ఏళ్ల కజకిస్తాన్ ప్లేయర్ వెల్లడించింది. దీంతో ప్రత్యర్థి సార సొరిబెస్ టొర్మో (స్పెయిన్) వాకోవర్‌తో ప్రిక్వార్టర్స్ చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (5/7), 6–1, 6–1తో మిర అండ్రీవా (రష్యా)పై గెలుపొందగా, 14వ సీడ్ హదాడ్ మైయా 5–7, 6–4, 7–5తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది. పోరాడి ఓడిన సెబొత్ బ్రెజిలియన్ క్వాలిఫయర్ తియాగో సెబొత్ వైల్డ్ అంటే ఇకపై ప్రత్యర్థులు హడలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకే అతను తొలి రౌండ్లోనే యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ (2021), రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. తాజాగా అతని దూకుడుకు జపాన్ నంబర్‌వన్ ఆటగాడు యొషిహితో నిషిఒకా బ్రేకులేసినప్పటికీ సెబొత్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. 27వ సీడ్ నిషిఒకా 3–6, 7–6 (10/8), 2–6, 6–4, 6–0తో సెబొత్ వైల్డ్‌పై శ్రమించి గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్పై గెలుపొందాడు. నార్వే స్టార్‌కు తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనా... తర్వాత సెట్లలో సులువుగానే గెలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్ చేరిన ఆరోసీడ్ డెన్మార్క్ స్టార్ రూన్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. మూడో రౌండ్లో తనకెదురైన ప్రత్యర్థి ఒలీవియెరి (అర్జెంటీనా)ను 6–4, 6–1, 6–3తో ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే (గంటా 58 నిమిషాలు) మ్యాచ్‌ను ముగించాడు. బొర్న కొరిచ్ (క్రొయే షియా) 3–6, 6–7(5/7), 2–6తో మార్టిన్ ఎచెవెరి (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
French Open 2023: మట్టి కోర్టులో మహా సంగ్రామం షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ నేడు మొదలుకానుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం, 14 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ తుంటి గాయం కారణంగా ఈ టోర్నీకి తొలిసారి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), సెర్బియా దిగ్గజం జొకోవిచ్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)తో సిట్సిపాస్, లాస్లో జెరి (సెర్బియా)తో ఏడో సీడ్ రుబ్లెవ్ తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్వియాటెక్‌కు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ఆరో సీడ్, గత ఏడాది రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా) ఏడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నారు. -
వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
Madrid Open: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. 2021లో ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో ర్యాంకర్ సబలెంకా ఈ ఏడాది ఫైనల్లో 6–3, 3–6, 6–3తో స్వియాటెక్‌పై గెలిచింది. సబలెంకా కెరీర్లో ఇది 12వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సబలెంకాకు 11,05,265 యూరోల (రూ. 10 కోట్ల 12 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. -
నెంబర్‌వన్‌కు షాకిచ్చిన వింబుల్డన్ ఛాంపియన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా మహిళల టెన్నిస్ నెంబర్ వన్ ఇగా స్వియాటెకు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కజకిస్తాన్ సంచలనం.. 23వ ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రైబాకినా చేతిలో 6-4, 6-4 వరుస సెట్లలో ఖంగుతింది. గంటన్నర పోరులో స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని రైబాకినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌కు చేరడం రైబాకినాకు ఇదే తొలిసారి. కాగా స్వియాటెక్ ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు ఫ్రెంచ్ ఓపెన్ కాగా.. మరొకటి యూఎస్ ఓపెన్ ఉంది. కాగా స్వియాటెక్ గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. Letting her racquet do the talking 🤫 🇰🇿 Elena Rybakina • @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/o42uktZv5v — #AusOpen (@AustralianOpen) January 22, 2023 చదవండి: 'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా' -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
లోపల ఏముందా అని ప్రతీసారి చూసేది.. అందుకే సర్ప్రైజ్
టెన్నిస్ మహిళల సింగిల్స్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా వరల్డ్ నెంబర్‌వన్..ఇగా స్వియాటెక్ నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్‌కు ఓవరాల్‌గా ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇంతకముందు 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. తాజాగా యూఎస్ ఓపెన్ నెగ్గింది. అయితే స్వియాటెక్ ఏ ట్రోఫీ గెలిచినా దానిని ఓపెన్ చేసి చూడడం అలవాటు. ఈ విషయం పక్కనబెడితే.. స్వియాటెక్‌కు ఇటాలియన్ డిష్ తిరామిసూ(బెండకాయలతో చేసే ప్రత్యేక డిష్) అంటే చాలా ఇష్టం. దీంతో తనకిష్టమైన తిరామిసును ఆ ట్రోఫీలో పెట్టి ఇస్తారేమోనని ఆశగా చూసేదంటూ అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న యూఎస్ ఓపెన్ నిర్వాహకులు.. ట్రోఫీ అందుకున్న ఇగా స్వియాటెక్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ప్రెస్ మీట్‌కు హాజరైన స్వియాటెక్‌ను ట్రోఫీ చూపించాలని రిపోర్టర్స్ అడిగారు. దీంతో స్వియాటెక్ ట్రోఫీని దగ్గరికి తీసుకొని చూడగా కాస్త బరువుగా అనిపించింది. దీంతో లోపల ఏం ఉందా అని ఓపెన్ చేసి చూడగా.. తనకిష్టమైన ఇటాలియన్ డిష్.. తిరామిసు కనిపించడంతో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఆ తర్వాత నిర్వహకుల వైపు తిరిగిన స్వియాటెక్ చిరునవ్వుతో.. ఇది మీ పనేనా అని సైగలు చేసింది.. అందుకు వాళ్లు అవును అని సమాధానం ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం అర్థరాత్రి జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్ను ఓడించిన స్వియాటెక్ తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై విజయం సాధించింది. 2016లో అంజెలికా కెర్బర్ రెండు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. తాజాగా ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది. From Paris to New York...still looking for the tiramisu 😄 pic.twitter.com/6cOBINQgoO — Roland-Garros (@rolandgarros) September 10, 2022 !!!!! pic.twitter.com/87PMt0TfDe — Out of Context Iga Świątek (@SwiatekOOC) September 11, 2022 చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్ Steve Smith: స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! -
మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్ను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై స్వియాటెక్ విజయం సాధించింది. ఈ విజయంతో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను పోలాండ్ భామ తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 2016 తర్వాత ఒకే సీజన్లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా స్వియాటెక్ నిలిచింది. చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం! -
US Open 2022: అటు అన్స్...ఇటు ఇగా
న్యూయార్క్: ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ స్వియాటెక్ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్ అరియానా సబలెంక (బెలారస్)పై గెలుపొందగా, జబర్ 6–1, 6–3తో 17వ సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్‌తో జబర్ తలపడుతుంది. స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ ఫైనల్ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. మరో వైపు జబర్ ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. శ్రమించిన టాప్‌సీడ్... తొలి సెమీ ఫైనల్లో టాప్‌సీడ్ స్వియాటెక్‌కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్‌ను గెలుచుకుంది. 8, 9 గేమ్‌లను చకచకా ముగించి తొలిసెట్‌ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్లో స్వియాటెక్ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది. ఆ గేమ్ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్ పదునేంటో చూపించిన స్వియాటెక్ 6–1తో సెట్ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్‌లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్ స్టార్ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్‌వన్ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది. 2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్ జబర్ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్‌లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది. -
బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు నాదల్..
యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించిన నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. తన స్నేహితుడైన రిచర్డ్ గాస్కెట్‌ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్స్ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం. 47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్ ఇక 19 ఏళ్ల టెన్నిస్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన జెన్సన్ బ్రూక్స్‌ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్లో 47 విజయాలతో రికార్డు బ్రేక్ చేసిన ఆనందలో అల్కరాజ్ తన షూస్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో 2014 చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఎదుర్కోనున్నాడు. ముగురుజాకు షాక్.. క్వార్టర్స్ చేరిన స్వియాటెక్ ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్లో అన్ సీడెడ్ అయిన లారెన్ డేవిస్‌ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజాకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. మూడో రౌండ్లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్‌లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది. 🎾🇪🇸 نُقطة المُباراة والفوز رقم 1066 لرافاييل نادال بمسيرته الإحترافية والرقم 38 لهُ بهذا الموسم 👏🏻 #RafaelNadal𓃵 pic.twitter.com/jpxVTtmDOM — عشاق التنس Arab Tennis (@ArabTennis20) September 4, 2022 -
నాదల్ జోరు.. తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విలియమ్స్ సిస్టర్స్
యూఎస్ ఓపెన్ 2022లో భాగంగా నాలుగో రోజు పెద్దగా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిని 2-6, 6-4, 6-2, 6-1తేడాతో చిత్తు చేసి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. అయితే తొలి గేమ్ ఓడిన అనంతరం నాదల్ రాకెట్.. అతని ముక్కును చీల్చడంతో రక్తం కారింది. అయితే దీనిని లెక్కచేయని నాదల్ ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. పవర్ఫుల్ షాట్లతో విరుచుకుపడిన నాదల్.. ప్రత్యర్థి ఫోగ్నినిని వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఇక 23 వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు నాదల్ మరింత దగ్గరయ్యాడు. VAMOS pic.twitter.com/6xxFhV4pJC — US Open Tennis (@usopen) September 2, 2022 రికార్డు విజయాలతో అల్కరాజ్.. పరుషుల వరల్డ్ నెంబర్ 3 కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో అర్జెంటీనాకు చెందిన కొరియాను 6-2, 6-2, 7-5తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 46వ విజయం. ఈ క్రమంలోనే సిట్సిపాస్ రికార్డును అధిగమించిన అల్కరాజ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్లో సిట్సిపాస్ 17 పరాజయాలు పొందగా.. అల్కరాజ్ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలయ్యాడు. We see you, @carlosalcaraz 👀 pic.twitter.com/lGEZZin5dS — US Open Tennis (@usopen) September 1, 2022 ఎదురులేని స్వియాటెక్.. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ తన జోరును ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌ను స్వియాటెక్.. 6-3, 6-2తో ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. కాగా 2020, 2022లో స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. It's always crazy hearing yourself for the first time in the world's largest tennis stadium, @iga_swiatek 😆 pic.twitter.com/cWUjhiJSg9 — US Open Tennis (@usopen) September 1, 2022 విలియమ్స్ సిస్టర్స్‌కు షాకిచ్చిన చెక్ రిపబ్లిక్ ద్వయం.. ఇక మహిళల డబుల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా, వీనస్ విలియమ్స్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో చెక్ రిపబ్లిక్ ద్వయం లూసీ హ్రడెకా- లిండా నోస్కోవా చేతిలో 7-6(7-5), 6-4తో విలియమ్స్ సిస్టర్స్ ఓటమి పాలయ్యారు. అయితే సింగిల్స్ మాత్రం సెరెనా దుమ్మురేపింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావిట్ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్ -
స్వియాటెక్ ముందంజ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఇగా స్వియటెక్ (పోలండ్) 6-4, 4-6, 6-3తో లెస్లీ కెర్కోవ్ (నెదర్లాండ్స్)పై గెలుపొందగా, అన్‌సీడెడ్ కెటీ బౌల్టర్ (ఇంగ్లండ్) 3-6, 7-6 (7/4), 6-4తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. నాలుగో సీడ్ పౌలా బడొసా (స్పెయిన్) 6-3, 6-2తో ఇరినా (రొమేనియా)పై, 12వ సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) 6-2, 6-2తో విక్మయేర్ (బెల్జియం)పై అలవోక విజయం సాధించారు. మరో వైపు పురుషుల విభాగంలో రెండు సార్లు చాంపియన్ (2013, 2016), బ్రిటన్ స్టార్ అండీ ముర్రే ఈ సారి రెండో రౌండ్‌తోనే సరిపెట్టుకున్నాడు. ముర్రే 4-6, 6-7 (4/7), 7-6 (7/3), 4-6తో 20వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-4, 6-4, 4-6, 3-0తో రికార్డస్ బెరంకిస్ (లిథువేనియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-3, 7-5తో జోర్డాన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 16వ సీడ్ సిమోన హలెప్ (రొమేనియా) 7-5, 6-4తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై, 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో అన బొగ్దన్ (రొమేనియా)పై గెలుపొందారు. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
French Open 2022: ఇగా సిగలో ఫ్రెంచ్ కిరీటం
పారిస్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్ 68 నిమిషాల్లో 6–1, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, 18 ఏళ్ల కోకో గాఫ్ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ కోకో గాఫ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది స్వియాటెక్‌కిది వరుసగా 35వ విజయంకాగా... ఆమె ఖాతాలో ఆరో టైటిల్ చేరింది. 21 ఏళ్ల స్వియాటెక్ 2020లో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరే క్రమంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. కానీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్వియాటెక్‌తో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఆమె కేవలం నాలుగు గేమ్‌లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్ పక్కా ప్రణాళికతో ఆడుతూ కోకోకు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ఈ పోలాండ్ స్టార్ విజృంభించింది. సుదీర్ఘ ర్యాలీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వియాటెక్ చాలాసార్లు పది ర్యాలీల్లోపే పాయింట్లు గెలుచుకుంది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్వియాటెక్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో గేమ్‌లో కోకో గాఫ్ తొలిసారి తన సర్వీస్‌ను కాపాడుకోగా... ఆరో గేమ్‌లో స్వియాటెక్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, ఏడో గేమ్‌లో గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 35 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లో కోకో కాస్త పోటీనిచ్చినా స్వియాటెక్‌ను ఓడించేందుకు అది సరిపోలేదు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు 35-0 🏆#RolandGarros pic.twitter.com/Tq7u72NWH8 — Roland-Garros (@rolandgarros) June 4, 2022 -
French Open 2022: తిరుగు లేని స్వియాటెక్
పారిస్: జోరుమీదున్న పోలాండ్ ‘టాప్’స్టార్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్ గారోస్‌లో 2020లో టైటిల్ సాధించిన స్వియాటెక్ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన 18వ సీడ్ కోకో గౌఫ్ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గౌఫ్‌తో స్వియాటెక్ తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ దెబ్బకు... టాప్ సీడ్ స్వియాటెక్ ధాటికి రష్యన్ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసి కసత్కినా షాకిచ్చింది. నాలుగో గేమ్‌ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్‌వన్ దూకుడు పెంచింది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది. వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది. తొలిసెట్ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్లో స్వియాటెక్ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రమే తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్కే పరిమితమైన కసత్కినా 24 అనవసర తప్పిదాలు చేసింది. తొలిసారి సెమీస్‌లో సిలిచ్ మారిన్ సిలిచ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్ గర్జించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్ గారోస్ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన సిలిచ్ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్‌స్లామ్ సహా పలు మేజర్ టోర్నీల్లో సీడెడ్ ప్లేయర్‌గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. పోరాడి ఓడిన బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నేడు పురుషుల సెమీ ఫైనల్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) X అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కాస్పర్ రూడ్ (నార్వే) Xమారిన్ సిలిచ్ (క్రొయేషియా) సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం -
నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్ ప్లేయర్ భావోద్వేగం
Zheng Qinwen French Open 2022: ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకున్న నాలుగో చైనీస్ మహిళగా కిన్వెన్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది ఈ 19 ఏళ్ల చైనీస్ టీనేజర్. అయితే, సోమవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా కిన్వెన్ రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. స్వియాటెక్‌తో మ్యాచ్‌లో తొలి సెట్ వరకు బాగానే ఉన్న కిన్వెన్.. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో అక్కడే బ్యాక్ మసాజ్ చేయించుకుంది. ఆ తర్వాత కుడి తొడకు కట్టు కట్టుకుని బరిలోకి దిగింది. ఈ క్రమంలో 6-7(5), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. దీంతో కిన్వెన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఎంతకష్టమైనా మ్యాచ్ పూర్తి చేయడానికే నేను ఇష్టపడతా. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను. అయితే, ఈరోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే.. ఈ బాధ తప్పేది. పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో. ’’ అని వ్యాఖ్యానించింది. కడుపునొప్పి, కాలు నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, వరల్డ్ నెంబర్ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని ఈ 74వ ర్యాంకర్ పేర్కొంది. అయితే, కడుపునొప్పి లేకుండా మరింత ఎక్కువగా ఎంజాయ్ చేసేదానినని, ఇంకాస్త బాగా ఆడేదానిని తెలిపింది. తనతో మరో మ్యాచ్ అవకాశం వచ్చినపుడు మాత్రం అస్సలు ఇలాంటి పరిస్థితి(రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ఇదిలా ఉంటే.. కిన్వెన్పై విజయంతో ఈ ఏడాది వరుసగా 32వ గెలుపు నమోదు చేసింది పోలాండ్‌కు చెందిన స్వియాటెక్. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్వార్టర్లో అమెరికాకు చెందిన జెసికా పెగులాతో ఆమె అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! 📽️ It was a real battle for No.1 @iga_swiatek against Zheng Qinwen in their Round of 16 match:#RolandGarros pic.twitter.com/1FWNGZS5Im — Roland-Garros (@rolandgarros) May 30, 2022