టైటిల్‌ పోరుకు స్వియాటెక్, జాస్మిన్‌ | Swiatek and Jasmine for the title fight | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు స్వియాటెక్, జాస్మిన్‌

Jun 7 2024 4:16 AM | Updated on Jun 7 2024 4:16 AM

Swiatek and Jasmine for the title fight

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో టైటిల్‌ గెలిచేందుకు పోలాండ్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ విజయం దూరంలో నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన స్వియాటెక్‌ గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో 6–2, 6–4తో  మూడో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ (అమెరికా)పై గెలిచింది. 

రెండో సెమీఫైనల్లో 12వ సీడ్‌ జాస్మిన్‌ పావ్లిని (ఇటలీ) 6–3, 6–1తో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవాపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 5–7, 6–2, 2–6తో బొలెలీ–వావసోరి (ఇటలీ) జోడీ చేతిలో ఓడింది. 

Advertisement
 
Advertisement
Advertisement