పారిస్ ఒలింపిక్స్ మహిళల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్‌కు (పోలాండ్) షాక్ తగిలింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన క్విన్‌వెన్ ఝెంగ్ స్వియాటెక్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించింది. గంటా 51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో క్విన్‌వెన్ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
Qinwen Zheng becomes the 1st Chinese player in history to reach the final of the Olympics in singles.
No man or woman has ever done it before today.
Megastar in the making.
🇨🇳❤️🇨🇳 pic.twitter.com/24f1WkwBcz— The Tennis Letter (@TheTennisLetter) August 1, 2024
ఒలింపిక్స్ టెన్నిస్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి చైనా క్రీడాకారిణిగా క్విన్‌వెన్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో రొలాండ్ గారోస్‌లో 1149 రోజుల పాటు సాగిన స్వియాటెక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2021 నుంచి రొలాండ్ అండ్ గారోస్‌లో స్వియాటెక్‌కు ఓటమనేదే లేదు. డొన్నా వెకిక్, అన్నా కరోలినా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విన్నర్‌తో క్విన్‌వెన్ ఫైనల్లో పోటీపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment